చంద్ర గ్రహణం సంభవించిన మకర రాశి వారు అనగా ఉత్తరాషాఢ & శ్రవణ నక్షత్ర జాతకులు గ్రహణానంతరం ఏ దానమును ఇవ్వాలో (Lunar Eclipse Astrological Remedies), దానము ఇచ్చే సమయంలో పురోహితులు చెప్పవలసిన సంకల్ప మంత్రము ఇక్కడ సవివరంగా ఇవ్వబడ్డాయి.
గ్రహణము యేయే రాశులయందు సంభవించునో వారు వెండి చంద్రబింబములను మరియు రాగి సర్ప ప్రతిమనుతో కలిపి పూజించి నెయ్యితో నిండిన కంచుగిన్నెను, వస్త్రములను, 1/4 మినుములు మరియు 1/4 బియ్యంను తగిన దక్షిణలు కలిపి దానమీయవలయును. మరియు రావిచెట్టును తాకకుండా 21 ప్రదక్షిణలు చేయవలయును. గ్రహణ సమయమునందు దానము గ్రహించువారు దొరకకున్న గ్రహణానంతరము సంకల్పించుకున్నదానికి ద్విగుణీకృతంగా దానమీయవలయును.

గ్రహణకాల దాన మంత్రము:
యజమానస్య జన్మరాశి జన్మ నక్షత్ర స్ధిత చంద్ర గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం చంద్రబింబ నాగబింబ దాన పూర్వక రాజమాష సహిత తండుల దానం కరిష్యే…
తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధనా!
హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదో భవ!!
విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత!
దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్ధవేత్!! అను మంత్రముచే చదివి
గ్రహణ సూచిత అరిష్ట వినాశార్ధం మమ శుభ ఫలావాప్త్యర్ధం ఇదం రాహుబింబ చంద్ర బింబదాన ఘృతపూర్ణ కాంశ్య పాత్ర సహిత యధాశక్తి వస్త్ర దక్షిణ సహిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ. చంద్ర గ్రహ, నక్షత్ర దోష నివారణార్ధం తండుల పూర్వక రాజమాష ధాన్య దాన యధాశక్తి హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ అని బ్రాహ్మణోత్తముడు స్వీకరించి, దానమిచ్చిన వారిని ఆశీర్వదించవలెను.