పాక్షిక చంద్ర గ్రహణం- చంద్రగ్రహణ సమయాలు

  1. Home
  2. chevron_right
  3. Dharma Samdehalu
  4. chevron_right
  5. పాక్షిక చంద్ర గ్రహణం- చంద్రగ్రహణ సమయాలు

పాక్షిక చంద్ర గ్రహణం- చంద్రగ్రహణ సమయాలు

చంద్రగ్రహణము ఎప్పుడు?

ది. 8.11.2022 కార్తీక పూర్ణిమ మంగళవారం సాయంత్రం గ్రస్తోదయ చంద్ర గ్రహణం సంభవించును.భరణి నక్షత్రమందు సంభవించుచున్నందున భరణి నక్షత్రం వారు మరియు మేషరాశి వారు ఈ గ్రహణము ను చూడరాదు. గ్రహణ శాంతి చేసుకోనదగును.ఈ గ్రహణము గ్రస్తోదయమైనందున సాయంత్రం గం.5.27.ని.ల నుండి గ్రహణ చంద్రుని చూడవచ్చును.చుద్రోదయమైన  పిదప 52 నిముషములు గ్రహణ చంద్రుని చూచుటసాధ్యమే అయిననూ ఈ సమయమున గ్రహణ చంద్రుడు భూక్షితీజమునకు  దగ్గరగాయుండుటచేతనూ లేక ఆకాశము మేఘాచ్చధితమైయున్ననూ గ్రహణమును వీక్షించుట కష్టము.

Partial-Lunar-Eclipses

నవంబర్ 08.11.2022 పాక్షిక చంద్రగ్రహణ సమయాలు

  • గ్రహణ స్పర్శ కాలము ప.గం. 2.39
  • (చంద్రోదయము సాయంత్రము గం. 5.27లకు గాన గ్రహణస్పర్శ కనిపించదు)
  • గ్రహణమధ్యకాలము  సా.గం. 5.29
  • గ్రహణ మోక్షకాలము సా.గం. 6.19
, , , , ,
పాక్షిక చంద్ర గ్రహణం ఏ రాశి వారికి యే ఫలితము ఇచ్చును?
కార్తీక శుద్ధ ద్వాదశి – క్షీరాబ్ధి ద్వాదశి విశిష్టత

Related Posts