సంక్రాంతి రోజున శుభాలనిచ్చే వ్రతాలు – నోములు

సంక్రాంతి రోజున శుభాలనిచ్చే వ్రతాలు – నోములు

makara-sankranti-nomu-poojas

సంక్రాంతి నెలపట్టాక కన్నెలు , ముత్తయిదువులు ఎన్నోవ్రతాలు , నోములు నోచుకుంటారు . వాటిలో ప్రధానమైనవి కింద తెలుపబడ్డాయి.

1 . బొమ్మల నోము (సావిత్రి గౌరీ నోము): 
గతం లో ఆడపిల్లలకు చిన్నవయసు లోనే వివాహము చేసేవారు . వారితో ముక్కనుమ నాడు బొమ్మలనోము పేరిట సావిత్రి గౌరీదేవి నోము నోయించేవారు . ఈ వ్రతాన్ని వరుసగా తొమ్మిదేళ్ళు చేయాల్సివుంది. దీనివల్ల గృహిణులకు శుభాలు కలుగుతాయని నమ్మకం.

makar sankranti nomu poojas

బొమ్మల నోము పాట:
కంటి కంటి
ఏం కంటి?
కిందాన మీది కంటి
చల్లమెట్ల గౌరికంటి
సావిత్రి గౌరికంటి..

చూస్తి చూస్తి
దేవీ – దేవరా చూస్తి
దేవీ – దేవరా
ఏం చేస్తున్నారంటే
రత్నాలు జూదం ఆడుతున్నారు.
ఎవరు ఓడారు
ఎవరు గెల్చారు
అందుకు సాక్షులు ఎవరు
దేవీ, దేవరా సాక్షి
సావిత్రీ గౌరిదేవమ్మ
నీ సాక్షి ఎల్లకాలం కావాలి.
స్వర్గాని కెళ్ళినా
సవతిపోరొద్దు
మేడమీదకెళ్ళినా
మారుతల్లొద్దు
సావిత్రీ గౌరిదేవమ్మ తల్లీ
నీ దయమాకు ఎల్లకాలం కావాలి
కంటి కంటి …

gobbi gowri nomu

2 . గొబ్బిగౌరీ వ్రతం :
ఈ వ్రతం భోగి రోజు మొదలవుతుంది . భోగిపండుగనాడు సాయంత్రం నట్టింట్లో ఓ వైపు మండపం కట్టి అలంకరిస్తారు . ఈ కాలము లో దొరికే పండ్లు , కూరగాయలు , చెరకు గడలతొ అలంకరిస్తారు . మండపం మధ్య బియ్యం పోసి నడుమ గౌరీదేవిని ఉంచి పూజలు చేస్తారు . భోగి నుండి నాలుగో రోజు ఉద్వాసన పలికి , మండపం లో అలంకరించిన కూరగాయలఓ కూర వండుకుంటారు . దీన్నేగొబ్బి కూర అంటారు .

గొబ్బిగౌరీ వ్రత పాట:
సుబ్టి గొబ్బెమ్మ – శుభముల నియ్యావే
తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యావే
చేమంతి పువ్వంటి చెల్లెలు నియ్యావే
మొగలి పువ్వంటి మరిదినియ్యావే
మల్లె పువ్వంటి మొగుణ్ణియ్యావే
మంకెన పువ్వంటి మరదలు నియ్యావే…

goda devi nomu

3 . గోదాదేవి నోము :
పూర్వము గోదాదేవి ‘ పూర్వఫల్గుణ నక్షత్రం లో , కర్కాటక లగ్నం లో తులసి వనం లో జన్మించినది . ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణిణ్ణి ఆరాధించినది . ఈమె నెలపెట్టిన రోజు నుండి ధనుర్మాషమంతా ఒక నెలరోజులు వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది . ఈ వ్రతకాలము లో ఆమె గోపికలతో కలిసి పూజించినారు … మనం ఈ నాడు పెట్టే ఆ గొబ్బెమ్మలే గోపికలు .. జనవాడుకలో గోపీ బొమ్మలే గొబ్బెమ్మలుగా పిలవబడుతున్నాయి .
పెళ్ళి కాని ఆడపిల్లలంతా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూపాటలు పాడుతూ , ప్రదక్షిణలు చేస్తూ , తాము గోపికలు గా ఊహించుకొని కృష్ణభగవానుణ్ణి మదిలో అర్పిస్తే మంచి భర్త లభిస్తాడనేది ఓ నమ్మకం .

సేకరణ: https://www.panditforpooja.com/blog/makar-sankranti-nomu-poojas/

Pongal Festival, sankranti
2022మకర సంక్రమణ(సంక్రాంతి) ముహూర్త నిర్ణయం
భోగి రోజు రేగి పండ్లు(భోగి పళ్ళు) పోయడం వెనుక అసలు రహస్యం

Related Posts