భోగి మంటలు – భోగి పళ్ళు పోయడం వెనుక అసలు రహస్యం

Loading

Bhogi

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

సంక్రాంతి సమయంలో సూర్యడు దక్షిణయానం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైందని చెబుతారు. ఆధ్యాత్మిక విషయానికొస్తే దక్షిణయానంలో పడిన కష్టాలను తొలగించి, సంతోషాలను ప్రసాదించాలని భోగి మంటలను వేస్తారని కూడా చెబుతుంటారు. భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. వామన అవతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత అతనికి ఒక వరం ఇచ్చాడని చెబుతారు. దీని ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని.. సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట. అందుకే సంక్రాంతి ముందు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెబుతున్నాయి.

భోగి రోజు రేగి పండ్లు(భోగి పళ్ళు) పోయడం వెనుక అసలు రహస్యం

భోగి రోజు సాయంత్రం ఐదు సంవస్తారాలు లోపు పిల్లలకు భోగి పళ్ళు  పోస్తారు, పిల్లలకు ఐదు సంవస్తారాలు లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని ఈ రేగి పండ్లు / భోగి పళ్ళు పోస్తారు. ఆ వయసుపిల్లలకు బ్రహ్మ రంద్రం పలుచగా ఉంటుంది రేఖి అరా కూడా పలచగా ఉంటుంది. ఈ రేగి పండ్లుకి రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటుంది.

అవి పోసిన సమయంలో రేగి పండ్లు నుండి వచ్చే వాయువు పిల్లల తల పైన బ్రహ్మ రంద్రానికి శక్తిని ఇస్తుంది , మేధస్సుకి శక్తి వస్తుంది ఈ పండ్లు తల పైన నుండి పడటం వల్ల తలలోని మెదడు లోని నరాలకు రేగి పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల ఆక్టివ్ అవుతారు. శీతాకాలంలో వచ్చే జబ్బులు వల్ల పిల్లలు మెతక బడిపోతారు. ఈ రేగి పళ్లలో అరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది ఇది ఒక శాస్త్రీయ సంప్రదాయం అలాగే చుట్టూ ఉండే అరా బలపడుతుంది. ఎటువంటి పరిస్థితులు అయినా ఎదురుకునే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రేగి పండ్లు నే పోస్తారు, అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది చుట్టు పక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది.

రేగుపళ్లలో ‘సి’విటమిన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా జీర్ణసంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదరసంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి.అందుకే రేగుపళ్లని ఎండుపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది.

ఇంకో కారణం భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళు పోస్తారు.

రేగి పండ్లును బదరీఫలం అంటారు. సాక్షాత్తూ ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారు అంటారు, అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్న పేరు వచ్చిందని చెబుతారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడుదొడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది. -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకూ ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది.

మన దేశంలోనే కాకుండా తూర్పుదేశాలన్నింటిలోనూ రేగుని తమ సంప్రదాయ వైద్యంలో వాడతారు. జలుబు దగ్గర నుంచీ సంతానలేమి వరకూ రేగుని అన్నిరకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది. భూటాన్‌లో అయితే కేవలం ఇంటిని సువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు.

రేగిపండ్లు, బంతిపూల రెక్కలు (వీటికి వాయువు లో ఉండే క్రిములను నాశనము చేసే గుణం ఉంది) , చిల్లర కూడా కలిపి పిల్లల తలపైన నుండి దోసిటీతో పోయాలి..చివరిగా దిష్టి తీయాలి అలా పోసే టప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించాలి చివరిగా కర్పూరం తో పిల్లలకు దిష్టి తీయాలి.

పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణుని కి బోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కోరుకోవాలి, పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృషుడి కి భోగి పళ్ళు పోసి వేడుకగా భజన చేయవచ్చు. 12 సంవస్తారాలు లోపు పిల్లలకు బోగి పళ్ళు పోయవచ్చు.

bhogi, Pongal Festival, sankranti
మకర సంక్రాంతి – సంక్రాంతి నాడు చేయవలసిన పనులు
హనుమంతుడికి మంగళవారానికి ఉన్న సంబంధం ఏమిటి?

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.