మకర సంక్రాంతి ముహూర్త నిర్ణయం

మకర సంక్రాంతి ముహూర్త నిర్ణయం

Loading

Makara Sankranthi Muhurtham

మకర సంక్రాంతి ముహూర్త నిర్ణయం

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

సూర్యుడు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించే విధానాన్ని సంక్రమణం అంటారు. సూర్యభగవానుడు ఏరాశిలోకి మారుతాడో ఆ రాశి పేరుతో ఆ సంక్రమణాన్ని పిలవడం జరుగుతుంది. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం జనవరిలో మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశం అవుతాడు కావునా ఈ సంక్రమణంను మకర సంక్రాంతి అంటారు.

మకర సంక్రమణ పురుషలక్షణము

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పుష్య శుద్ధ చతుర్థి అనగా ది. 15-01-2024 సోమవారం ఉదయం గం. 8-25 ని.లకు రవి మకర రాశి ప్రవేశం. . శుక్లపక్షము-ప్రజలకు వ్యాధి, పీడ రాజులకు యుద్ధము కలుగును. చవితి తిథి దుఃఖము సోమవారం వస్తువులకు అధిక మంచువలన నష్టము సంభవించుట పూర్వాహ్ల రాజులకు నష్టం లగ్న ఫలం ప్రజలకు పశువులకు క్షయం, ముహూర్తం 3వది ధరలు పెరుగుట. వాహనము అశ్వవాహనము.

అస్య పురుషస్య లక్షణం – ఫలం

ధ్వాంక్షనామకుడు – వైశ్యులకు శుభము
చందనోదక స్నానము – సుభిక్షము
యవనాళక్షత (అలసందలు) అక్షత ధారణ – హాని
వస్త్రధారణము – కృష్ణవర్ణ పట్టు వస్త్రము- భయంకరము
పాత్రధారణ – కాంస్య పాత్ర – దుష్టనాశనకరము
ఆహారము చిత్రాన్నము – స్త్రీలకు హాని
ఫలధారణ మారేడుపండు – వర్షములు కురియుట
చత్రధారణ జీర్ణావస్థలో ఉన్న గొడుగు- శుభకరము
క్రీడావస్తువు ధనుర్ధారణము -ప్రజారిష్టము
దిగ్యానము ఈశాన్యము – తద్దేశే సుభిక్షము
అవస్థ నివిష్టావస్థ (కూర్చుని ఉండుట) – వృష్టి, పాడిపంటలు – ధరలు మధ్యమము
చేష్టా చింతాచేష్ట – ప్రజా సౌఖ్యము

bhogi, FestivalOfHarvest, HarvestFestival, KiteFestival, makara sankranthi, pongal, sankranthi, Uttarayan
అయోధ్య రామమందిరం – నిర్మాణ విశేషాలు
కనుమ పండుగ విశిష్టత

Related Posts