ముక్కనమ పండుగ విశిష్టత

ముక్కనమ పండుగ విశిష్టత

Loading

ముక్కనమ పండుగ విశిష్టత

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

నాల్గవ మరియు చివరి రోజు, మకర సంక్రాంతి యొక్క 4 రోజులలో, అనేక ప్రాంతాలలో ముక్కనుమ అని పిలుస్తారు.  భోగి, సంక్రాంతి రోజుల్లో మాంసాహారం ముట్టుకోరు. తర్వాతి రోజైనా కనుమ, ముక్కనుమ రోజుల్లో ఎవరికి నచ్చిన మాంసాహారాన్ని వాళ్ళు భుజిస్తారు. నిజానికి కనుమ రోజు కూడా మాంసాహారాన్ని ముట్టుకోవద్దని కొంతమంది పండుతులు చెబుతున్నారు.ముక్కనుమతో సంక్రాంతి పండగ ముగుస్తుంది. ఈరోజున గ్రామదేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి పూజలు చేస్తారు.అందువల్ల మాంసాహారాన్ని ఇష్టపడేవాళ్ళు తమకు ఇష్టమైన వంటకాలను చేసుకుని తింటారు. అందుకే ముక్కల కనుమ, ముక్కనుమ అన్న పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం. ముక్కనుమ రోజు వాకిట్లో రథం ముగ్గు వేస్తారు. దాన్ని పక్కింటి వారి వాకిట్లో రథం ముగ్గుతో కలిపేస్తూ ఊరు మొత్తాన్ని కలిపేస్తారు. సూర్యుడు ఉత్తరాయణం వైపు కదిలే గమనాన్ని గుర్తు చేస్తూ ఇలా రథంతో స్వాగతం పలుకుతారని చెబుతారు.

ముక్కనమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును కరినాళ్ అని పిలుస్తారు. ఈ రోజు బంధువులను కలిస్తే మంచిదని చెబుతారు. కొత్త సంబంధాలు కలుపుకునేందుకు, మంచి చెడులకు సంబంధించి బంధువులను పరామర్శించేందుకు ఈ రోజు మంచిరోజుగా భావిస్తారు. అందుకే సుకుటుంబ,సపరివార సమేతంగా వనభోజనాలు కూడా చేస్తారట.

ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు ‘సావిత్రి గౌరివత్రం’ అంటే ‘బొమ్మల నోము’ పడతారు. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్ధమందు నిమజ్జనం చేస్తారు. ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మలనోములో పాల్గొంటూ వుంటారు. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి, మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి పూజిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తయిదువులకు పండ్లు, తాంబూలం వాయనంగా ఇస్తారు.

bhogi, kanuma, makara sankranthi, pongal, sankranthi
కనుమ పండుగ విశిష్టత
స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత

Related Posts