స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత

స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత

Loading

Swastik

స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

శుభానికి సంకేతమైనస్వస్తిక్ సంస్కృతంలో స్వస్తిక్ అంటే సు- మంచి, అస్తి – కలగటం. మంచిని కలిగించడం. స్వస్తిక అంటే దిగ్విజయం. ఓంకారం తరువాత హిందూ మతం లో అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్.

ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు. అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలనిట. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన.

ఉక్రెయిన్,ఇథియోపియా, అమెరికా,జపాన్ దేశాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రపంచం నలుమూలలలో కూడా స్వస్తిక్ గుర్తును శుభానికి అదృష్టానికి చిహ్నం గా భావిస్తారు. అసలీ స్వస్తిక్ మూలాలు పన్నేండు వేల సంవత్సరాల నాటి కాలంలో స్వస్తిక్ గుర్తు ఉక్రెయిన్ లో లభించింది.పాశ్చాత్య దేశాలలోని ప్రార్థనా మందిరాలలో ప్రసిద్ధ కట్టడాలలో స్వస్తిక్ గుర్తు కనబడుతుంది. స్వస్తిక్ గుర్తు హిందూ మతంలో నుండే ప్రపంచ దేశాలకు వ్యాపించిందని పరిశోధకులు నిర్ధారించారు.

స్వస్తిక్ నాలుగు పంక్తుల సంబంధం బ్రహ్మతో ఉందని నమ్ముతారు. స్వస్తిక్ నాలుగు రేఖలు బ్రహ్మదేవుని నాలుగు తలలు అని నమ్ముతారు. దీని మధ్య భాగం విష్ణువు నాభి. దీని నుండి బ్రహ్మా ప్రత్యక్షమయ్యారు. స్వస్తిక్ నాలుగు పంక్తులు సవ్యదిశలో ఉంటాయి. ఇది ప్రపంచం సరైన దిశలో నడవడానికి చిహ్నం.

ఇంటి గృహాప్రవేశాలు, పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు ముందుగా స్వస్తిక్ చిహ్నం వేస్తారు. ఇది ఇంటికి పాజిటివ్ శక్తిని తీసుకొస్తుందని నమ్ముతారు. ఇంటి గుమ్మానికి స్వస్తిక్ గుర్తు కట్టుకుంటే దృష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కుడిచేతి ఉంగరం వేలితో పూజ స్థలంలో కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేస్తారు. పూజ ప్రారంభించే ముందు దైవిక ఆశీర్వాదాలు కోరుతూ దీన్ని వేస్తారు. కొన్ని సందర్భాలలో స్వస్తిక్ గుర్తు మధ్యలో చుక్కలు పెడతారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని నమ్ముతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, స్వస్తిక్ గుర్తు ఉన్న ఇల్లు ఆనందం, మంగళకరమైన శక్తితో నిండి ఉంటుంది. కాబట్టి స్వస్తిక గుర్తు ఉన్న ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇంటి తలుపు మీద స్వస్తిక చిహ్నం ఉన్న ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని నమ్ముతారు.

brahma, ganapathi, mahalaskhmi, surya, Swastik, vinayaka
ముక్కనమ పండుగ విశిష్టత
మకరవిళక్కు ప్రాముఖ్యత

Related Posts