హరిదాసులు కనుమరుగు అవుతున్నారా? నమ్మలేని నిజాలు!

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

సంక్రాంతి రోజున ఇంటింటికీ హరిదాసులు ఎందుకు వస్తారు?

గుమ్మం ముందుకు వచ్చి నాలుగు బియ్యం గింజలు కూడ వేయలేని పరిస్ధితిలో ఉన్నారు మన జనం సంక్రాంతి ముందు మాత్రమే వీళ్ళు కనపడతారు మళ్ళి సంవత్సరం దాకా రారు. హరిదాసు అంటె పరమాత్మతో సమానం. శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి

హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధార్మలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు, నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు

సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు. ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు.

ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది. శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం.

హరిదాసులు కనుమరుగు అవుతున్నారా?

హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఐ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు.

అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నా కూడా బయటకు వచ్చి హరిదాసుకి కానుక కాదు కదా బియ్యం కూడా అక్షయ పాత్రలో వేసే సావకాశం జనాలకి ఉండడం లేదు. దీనివల్ల రానురాను హరిదాసులు పల్లెలలో కనబడడం తక్కువయింది.  పట్టణాలలో మాట ఎలా ఉన్నాకనీసం దేశానికి పట్టుకొమ్మలుగా పిలవబడే పల్లెల్లోనైనా ఈ సంస్కృతిని కొనసాగించేలా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి.

హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్న ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి., మన సంస్కృతి ని కాపాడండి.

 

bhogi, Haridasu, KiteFestival, makara sankranthi, pongal, sankranthi, Sri vishnuvu, Uttarayan
భాను సప్తమి విశిష్టత – పాటించవలసిన నియమాలు
సమ్మక్క సారక్క జాతర తేదీలు – ఆలయ సమయాలు

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.