పెండ్యాల వారి సంక్రాంతి లక్ష్మి సరదాల లక్ష్మి కవిత

పెండ్యాల వారి సంక్రాంతి లక్ష్మి సరదాల లక్ష్మి కవిత

ఎన్నో సంవత్సరాలుగా రామచంద్రాపురం రత్నంపేట మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు తెలుగు మాస్టారుగా అనేక సేవలందించిన పెండ్యాల సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క సంక్రాంతి లక్ష్మి సరదాల లక్ష్మి కవిత.

sankranthi-lakshmi-saradala-lakshmi

సంక్రాంతి లక్ష్మి సరదాల లక్ష్మి…

పసిడి పంటల పద సవ్వడులతో
ప్రతి ఇంటా పడతుల హడావుడులతో
పిల్లల కేరింతలతో
పిండి వంటల ఘుమఘుమలతో
క్రొత్త బట్టల సందడులతో
కొంగ్రొత్త నగల నయగారాలతో
ప్రతి మనంబున పసందుల విలాసంబులతో
గత కాల బాధల, దుష్టుల దురహంకారాలను
భోగి మంటల్లలోకి గెంటేస్తూ
భావిలో  బాగుండాలని ఆశిస్తూ
దక్షిణమ్మను అయనమ్మును మకరమొచ్చి మింగేస్తే
క్రమంతప్పక మకర సంక్రమణంతో
ఉత్తరంబును అయనమ్మును ఆహ్వానిస్తూ
విజయ హేళతో విచ్చేసింది
సంక్రాంతి లక్ష్మి సరదాల లక్ష్మి…

sankranti
శ్రీ వికారి నామ సంవత్సరం | తెలుగు సంవత్సరాది
వినాయక ఆకారం – విశ్లేషణ

Related Posts