వినాయక ఆకారం – విశ్లేషణ

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

వినాయక ఆకారం చూడగానే మనస్సును ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఐతే ప్రతి విషయానికి ఎంతో విశేషార్ధం ఉండేలా మన పూర్వికులు వినాయకునికి ఈ ఆకారాన్ని సూచించారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా!

  • అతి పెద్దదయిన తల – పెద్దగా ఆలోచించమని చెపుతుంది
  • అతి పెద్ద చెవులు – ఎదుటివారు చెప్పేది కూలంకషంగా వినమని
  • అతి చిన్న కన్నులు – దృష్టి నిశితం గా ఉండాలి, ఏకాగ్రతగా ఉండాలి
  • నోటిని కప్పుతూ ఉన్న తొండం – నీ మాటలను అదుపులో ఉంచుకో
  • ఒక విరిగిన దంతం, ఏకదంతం – సర్వదా మంచిని నీతో ఉంచుకుని చెడును విరిచి పడేసే ప్రయత్నం చేయి
  • వంపుతిరిగిన తొండం – పరిస్థితులను తట్టుకునేవిధంగా తనను తాను మలచుకొంటూ, తనదైన వ్యక్తిత్వాన్ని వదలకుండా చూసుకో మని చెపుతుంది
  • యజ్ఞోపవీతంగా సర్పం – సర్పం కుండలిని శక్తికి ప్రతీక, ప్రతి ఒక్కరు తమ కుండలిని శక్తిని వృద్ధి చేసుకోవటం కోసం ప్రయత్నించాలి అని
  • లంబోదరం – జీవితం లో ఎదురయ్యే మంచిని చెడుని సమన్వయము చేసుకుంటూ ముందుకు సాగమని, (వినాయకుని ఉదరంలో సమస్త లోకములు ఉన్నాయి అని మరో అర్ధం చెప్పుకోవచ్చు)
  • అభయ ముద్ర – భక్తులకు భయపడనవసరం లేదని చెప్పుట
  • వరద ముద్ర – కోరిన కోరికలు తీర్చగలను అని చెప్పుట
  • పాశం (పై ఎడమ చేతిలో) – భక్తులను ఆధ్యాత్మిక విషయముల వైపునకు లాగుతాను అని ganesh
  • గొడ్డలి (పై కుడి చేతిలో) – కర్మబంధములనుండి విముక్తిని కలిగించగలను అని
  • మోదకము/ కుడుము – సాధన ద్వారామత్రమే అతి మధురమైన మోక్షం లభిస్తుంది అని
  • పాదముల వద్ద ఉన్న ఫలములు – ఈ ప్రపంచములో కావలసినవి అన్ని ఉన్నాయి, కేవలం నీవు శ్రమించి వాటిని సాధించుకోవాలి
  • ఎలుక – ఎక్కడి, ఏమూలకు అయిన చేరగలిగిన, తనకు అడ్డంగా ఉన్నదానిని దేనిని అయిన నాశనం చేయగలిగిన సామర్ధ్యం ఉండాలి, కాని అది మన ఆధీనంలో ఉండాలి
  • ఇద్దరు భార్యలు సిద్ధి ,బుద్ధి వారి పుత్రులు శుభము, లాభము మరియు పుత్రిక సంతోషి – మన బుద్ధి (మనస్సు) మన ఆదీనం లో ఉంటే మనం కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయి. దానితో పాటుగా మనకు మంచి జరుగుతుంది, లాభము కూడా లభిస్తుంది
  • మరి సంతోషి ని కుమార్తె అని ఎందుకు చెప్పారు? మనకు జరిగిన మంచిని కాని శుభమును కాని మరొకరికి పంచటానికి మనం ఆలోచించ వచ్చు కాని వాని వల్ల కలిగిన ఆనందాన్ని అందరికి పంచుతాము. కనుకనే సంతోషి ని కుమార్తెగా చెప్పారు.

 

vinayaka chavithi
పెండ్యాల వారి సంక్రాంతి లక్ష్మి సరదాల లక్ష్మి కవిత
ఏకదంతుడినిగా భక్తులను అనుగ్రహించే కృపామూర్తి

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.