కాలసర్ప దోష పరిహారములు | Remedies for Kala Sarpa Dosha

కాలసర్ప దోష పరిహారములు | Remedies for Kala Sarpa Dosha

కాలసర్ప దోషము

జాతకుని జన్మ కుండలి లో రాహు కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వచ్చినచొ దానిని కాల సర్ప యోగం అని అంటారు. దీనిలో చాల రకాలు వున్నాయి. వాటి వాటి స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయం చెయ్యటం జరుగుతుంది దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయం చెయ్య బడుతుంది.

కాలసర్ప దోష ఫలితాలు:

కాల సర్ప దోషమున్న జాతకులకు ఆర్ధిక మరియు వ్యాపార సంబంధ సమస్యలు అధికంగా ఉండటం, వ్యాపారంలో అనుకున్నంత లాభం రాకపోవటం, నేత్ర సంబంధ రోగములు, సోదరులు, మిత్రులతో తగాదాలు, స్వంత ఇంటిని, ఊరిని విడిచి దూర ప్రదేశంలో నివసించ వలసి రావటం, షేరు మార్కెట్ లో నష్టాలు రావటం, కోర్టు వ్యవహారముల కారణంగా చిక్కుల్లో ఇరుక్కోవటం మొదలైన ఫలితాలుంటాయి.

కాలసర్పదోష పరిహారములు:

గమనిక: పైన ఇవ్వబడిన సమస్యలు ఒక్క కాలసర్పదోషం కారణంగానే కాకుండా వేరే జాతక దోషాల వలన కూడా వచ్చే అవకాశముంటుంది. దోషం ఉన్నంత మాత్రాన అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కింద ఇవ్వబడిన పరిహారాల్లో ఏది చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. – ఇంటిలో కాలసర్పయంత్ర స్థాపన చేసి ప్రతి రోజు పూజించాలి.

  • నాగపంచమి రోజున ఉపవాసము ఉండాలి.
  • ఒక సంవత్సరంపాటు ప్రతిరోజు నవనాగస్తోత్రము పారాయణం చేయాలి.
  • రాహు మంత్రం రోజు 108 సార్లు చదవాలి.
  • శ్రావణమాసంలో శివునికి అభిషేకం చేయాలి.
  • హనుమంతునికి చందనం సమర్పించటంతో పాటుగా రోజు హనుమాన్ స్తోత్రం చదవాలి.
  • రాహు లేదా కేతు మహాదశ నడుస్తున్నవారు మృత్యుంజయ మంత్రం చదవటం లేదా బ్రాహ్మణుడిచేత జపం చేపించటం మంచిది.
  • కాలసర్పదోషం కారణంగా సంతాన సమస్య ఉన్నావారు పితృపక్షాలలో పితరులకు సంతర్పణ చేయాలి
  • త్రివేణి సంగమంలో కాని, నాసిక్ లో కాని లేదా శ్రీకాళహస్తిలో కాని కాలసర్ప పూజ జరిపించుకోవాలి..
  • సుందరకాండ పారాయణం చేయాలి.

పైన చెప్పిన పరిహారాల్లో మీకు అనుకూలమైనవి ఆచరిస్తే సరిపోతుంది. ఇచ్చిన అన్ని పరిహారాలు చేయనవసరం లేదు.

remedise
తిల తండుల తర్పణ విధానం | Tila Tarpanam Vidhanam
అనంత పద్మనాభ వ్రతం | పద్మనాభ వ్రత విధానము | అనంతపద్మనాభ స్వామి వ్రత కథ

Related Posts