కేదారేశ్వర వ్రతం – కేదార గౌరీ పూజ విధానం

Loading

Kedareswara Vratam

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

Kedareswara Vratam

కేదార గౌరీ వ్రతం లేదా కేదార వ్రతం అనేది శివుని భక్తులకు ఒక ముఖ్యమైన ఉపవాస ఆచారం, సాధారణంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో పాటిస్తారు. దీపావళి అమావాస్య రోజున జరుపుకుంటారు, ఇది దీపావళి సమయంలో లక్ష్మీ పూజ రోజుతో సమానంగా ఉంటుంది. ఈ కేధార వ్రతాన్ని ఆశ్వయుజ బహుళ అష్టమి నుండి ఆచరిస్తారు మరియు ఆశ్వయుజ అమావాస్య నాడు ముగిస్తారు. కానీ, ఆచరణలో కేదార గౌరీ వ్రతం ఒకే రోజు అంటే దీపావళి అమావాస్య రోజున నిర్వహిస్తారు.’

ఇది భార్యాభర్తలిద్దరూ కలిపి చేసుకునే వ్రతం. భర్తకు కుదరనప్పుడు భార్య మాత్రమే చేసుకోవచ్చు. భార్యకు వీలుకాక పోతే మాత్రం భర్త ఒక్కడే చేయకూడదు. వివాహంకాని ఆడపిల్లలు కూడా ఈ నోము నోచుకోవచ్చు. ముందుగా 21 పేటల పట్టు దారాన్ని కాని, నూలు దారాన్ని కాని తోరంగా కట్టుకోవాలి. కలశంలోకి, ప్రతిమలోకి కేదారేశ్వరుని ఆవాహన చేయాలి. 21 ఉపచారాలతో పూజ చేయాలి. గోధుమపిండితో 21 నేతి అరిసెలు వండాలి.పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసం, అన్ని రకాల కూరలు, పళ్లు నివేదన చేయాలి. కథ చెప్పుకున్నాక అక్షింతలు వేసుకోవటం మర్చిపోకూడదు.ఇలా 21 సంవత్సరాలు చేయాలి. కేదారం అంటే మాగాణం. వరి పండే పొలం. దానికి అధిపతి కేదారే శ్వరుడు. పార్వతీదేవి ప్రకృతి స్వరూపిణి. పార్వతి లేకపోతే శివుడు శక్తి హీనుడయిన గాథను వ్రత కథగా చెప్పుకుంటారు. ఈ వ్రతకథ స్త్రీ పురుషుల సమానత్వాన్ని తెలియచేస్తుంది. గౌరీదేవి లేనిదే శివుడికి పూజలేదు. గౌరితో కూడిన సాంబశివుణ్ణి పూజించే అరుదైన వ్రతం ఇది.

ముందుగా గణపతి పూజ:

ఆచమనం :
ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా (గ్లాసు లేదా చెంబులోని నీళ్ళను ఉద్ధరిణి లేదా చెంచాతో ముందుగా ఒకసారి నీళ్ళను అరచేతిలో వేసుకుని చేతులు శుభ్రం చేసుకోవాలి. తరువాత పైన చెప్పిన ఒక్కొక్క నామం చదువుతూ మూడు సార్లు తీర్థంగా స్వీకరించాలి. మళ్ళీ ఒకసారి నీళ్ళును అరచేతిలో వేసుకుని చేతులు శుభ్రం చేసుకోవాలి)
గోవిందాయనమః: విష్ణవే నమః, మధుసూధనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః,శ్రీకృష్ణ పరబ్రాహ్మణే నమః.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
యస్మృరేత్పుండరీ కాక్షం సదాహ్యాభ్యంతరం శుచిః

శ్రీ గోవింద గోవింద
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
ఓంభూః ఓం భువః ఓగం సువః, ఓం మహః ఓంజనః ఓంతేపః ఓంగుం సత్యం ఓంతేత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.
ప్రాణాయామము చేసి దేశకాలాలను స్మరించి సంకల్పం చేసుకోవాలి.
మమోపాత్త దురతక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు …. సంవత్సరే, … ఆయనే, … మాసే … పక్షే … తిథి … వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ … గోత్రః … నామధేయః (ధర్మపత్ని సమేత) మమధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివ్రుద్ధ్యార్థం, సర్వాభీష్ట సిద్ద్యర్థం కేదార వ్రత సమయే, సకల విఘ్న దోష నివారణార్ధం మహాగణపతి  పూజాం కరిష్యే, తదంగ కలాశారాధానం కరిష్యే.

కలసస్య ముఖే విష్ణుః కంటే రుద్రసమాశ్రితః, మాలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మృతః కుక్షౌత్సాగరాసర్వేసప్త ద్వీపా వసుంధర, ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వనః అంగైశ్చ సాహితాసర్వే కలశాంబు సమాశ్రితః

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా

పూజాద్రవ్యములపైన, తమపైన జల్లుకొనవలెను. తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

శ్రీ కేదారేశ్వర పూజ:

శూలం ఢమరుకంచైవ – దదానం హస్త యుగ్మకే కేదరదేవమీశానం ద్యాయేత్ త్రిపుర ఘూతినమ్ … శ్రీ కేదరేశ్వరాయనమః … ధ్యానం సమర్పయామి
కైలాస శిఖరే రమ్యే పార్వత్యా స్సహితప్రభో
ఆగచ్చ దేవదేవేశ మద్భక్తా చంద్రశేఖర శ్రీకేదారేశ్వరాయనమః …. ఆవాహయామి
సురాసుర శిరోరత్న – ప్రదీపిత పదాంబుజ
కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగుహ్యతామ్ శ్రీ కేదారేశ్వరాయనమః … ఆసనం సమర్పయామి
గంగాధర నమస్తేస్తు – త్రిలోచన వృషభద్వజ
మౌక్తికాసన సంస్థాయ – కేదార నమోనమః శ్రీ కేదారేశ్వరాయనమః … పాద్యం సమర్పయామి
అర్ఘ్యం గృహాణ భగవన్ – భక్త్యాదత్తం మహేశ్వర
ప్రయచ్చమే మనస్తుభ్యం – భక్తానా మిష్టదాయకం శ్రీ కేదారేశ్వరాయనమః … అర్ఘ్యం సమర్పయామి
మునిభిర్నా రాదప్రఖ్యైర్నిత్య మాఖ్యాత వైభవః
కేదారదేవ భగవాన్ గృహాణా చమనం విభో శ్రీ కేదారేశ్వరాయనమః … ఆచమనీయం సమర్పయామి
స్నానం పంచామృతైర్దేవ శుద్ధ శుద్ధోద కైరపి
గృహాణగౌరీరమణత్వద్భక్తేన మయార్పితం … శ్రీ కేదారేశ్వరాయనమః పంచామృతస్నానం సమర్పయామి
నదీజల సమాయుక్తం మయాదత్త మనుత్తమం
స్నానం స్వీకురుదేవేశ – సదాశివ నమోస్తుతే … శ్రీకేదారేశ్వరాయనమః స్నానం సమర్పయామి
వస్త్ర యుగ్మం సదాశుభ్రం – మనోహర మిదం శుభం
దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యాతాం … శ్రీ కేదారేశ్వరాయనమః వస్త్రయుగ్మం సమర్పయామి
స్వర్ణ యజ్ఞోపవీతం కాంచనం చోట్టరీయకం
రుద్రాక్షమాలయా యుక్తం – దదామి స్వీకురు ప్రభో … శ్రీకేదారేశ్వరాయనమః యజ్ఞోపవీతం సమర్పయామి
సమస్త గ్రంధద్రవ్యాణాం – దేవత్వమసి జన్మభూః
భక్త్యాసమర్పితం ప్రీత్యా – మయాగంధాది గృహ్యతామ్ … శ్రీ కేదారేశ్వరాయనమః గంధాన్ ధారయామి
అక్షతో సి స్వభావేన – భక్తానామక్షయం పదం
దదాసినాథ మద్దతైరక్షతైః స్స్వీ యతాం భావాన్ శ్రీ కేదారేశ్వరాయనమః … అక్షతాన్ సమర్పయామి
కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వై రభ్యర్చిత సురైః కుంకుమైః పార్దివై రేభిరిదానీమర్చతాం మయా శ్రీ కేదారేశ్వరాయనమః పుష్పాణి పూజయామి
తతః ఇంద్రాది లోకపాలక పూజాం కుర్యాత్ శివస్య దక్షిణేభాగే (కుడివైపు) బ్రాహ్మణేనమః ఉత్తరభాగే (ఎడమవైపు) విష్ణవేనమః మధ్యే కేదారేశ్వరాయ నమః

అథాంగ పూజ:

మహేశ్వరాయ నమః – పాదౌపూజయామి
ఈశ్వరాయ నమః – జంఘే పూజయామి
కామరూపాయ నమః – జానునీ పూజయామి
హరాయ నమః – ఊరూ పూజయామి
త్రిపురాంతకాయ నమః – గుహ్యం పూజయామి
భవాయ నమః – కటిం పూజయామి
గంగాధరాయ నమః – నాభిం పూజయామి
మహాదేవాయ నమః – ఉదరం పూజయామి
ప్శుపతయే నమః – హృదయం పూజయామి
పినాకినే నమః – హస్తాన్ పూజయామి
శివాయ నమః – భుజౌ పూజయామి
శితికంఠాయ నమః – కంఠం పూజయామి
విరూపాక్షాయ నమః – ముఖం పూజయామి
త్రినేత్రాయ నమః – నేత్రాణి పూజయామి
రుద్రాయ నమః – లలాటం పూజయామి
శర్వాయ నమః – శిరః పూజయామి
చంద్రమౌళయే నమః – మౌళిం పూజయామి
పశుపతయే నమః – సర్వణ్యాంగాని పూజయామి

కేదారేశ్వర అష్టోత్తర శతనామ పూజ

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూలపణాయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కామారయే నమః
ఓం అంధకాసురసూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషంకాయ నమః
ఓం వృషభరూఢాయ నమః
ఓం భాస్మోద్ధూళితవిగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం సర్వమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞమయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్థర్షాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగభూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వినే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాసనే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమధాధిపాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేనజనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః
ఓం ఆహిర్బుద్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళ పాత్ర పుష్పపూజాం సమర్పయామి

అధసూత్రపూజ:

ఓం శివాయ నమః – ప్రథమగ్రంధిం పూజయామి
ఓం శాంతాయ నమః – ద్వితీయగ్రంధిం పూజయామి
ఓం మహాదేవాయ నమః – తృతీయగ్రంధిం పూజయామి
ఓం వృషభద్వజాయ నమః – చతుర్థగ్రందిం పూజయామి
ఓం గౌరీశాయ నమః – పంచమగ్రందిం పూజయామి
ఓం రుద్రాయ నమః – షష్ఠగ్రందిం పూజయామి
ఓం పశుపతయే నమః – సప్తమగ్రందిం పూజయామి
ఓం భీమాయ నమః – అష్టమగ్రందిం పూజయామి
ఓం త్రయంబకాయ నమః – నవమగ్రందిం పూజయామి
ఓం నీలలోహితాయ నమః – దశమగ్రందిం పూజయామి
ఓం హరాయ నమః – ఏకాదశగ్రందిం పూజయామి
ఓం స్మరహరాయ నమః – ద్వాదశగ్రందిం పూజయామి
ఓం భర్గాయ నమః – త్రయోదశగ్రందిం పూజయామి
ఓం శంభవే నమః – చతుర్థగ్రందిం పూజయామి
ఓం శర్వాయ నమః – పంచదశగ్రందిం పూజయామి
ఓం సదాశివాయ నమః – షోఢశగ్రందిం పూజయామి
ఓం ఈశ్వరాయ నమః – సప్తదశగ్రందిం పూజయామి
ఓం ఉగ్రాయ నమః – అష్టాదశగ్రందిం పూజయామి
ఓం శ్రీకంఠాయ నమః – ఏకోన వింశతిగ్రందిం పూజయామి
ఓం నీలకంఠాయ నమః – వింశతిగ్రందిం పూజయామి
ఓం మృత్యుంజయాయ నమః – ఏకవింశతి గ్రందిం పూజయామి

దశాంగం ధూపముఖ్యంచ – హ్యంగార వినివేశితం
ధూప సుగంధై రుత్పన్నం – త్వాంప్రిణయతుశంఖరశ్రీ కేదారేశ్వరాయనమః ధూపమాఘ్రాపయామి
యోగీనాం హృదయే ష్వేవ – జ్ఞానదీపాంకురోహ్యపి
బాహ్యదీపో మయాదత్తో – గృహ్యతాం భక్త గౌరవాత్ శ్రీకేదారేశ్వరాయనమః దీపం సమర్పయామి
తైలోక్యమసి నైవేద్యం – తత్తే తృప్తిస్తథాబహిః
నైవేద్యం భక్తవాత్వల్యాద్గ్రుహ్యతాం త్ర్యంబకత్వయా శ్రీ కేదారేశ్వరాయనమః మహానైవేద్యం సమర్పయామి
నిత్యానంద స్వరూపస్త్యం – మోగిహృత్కమలేస్థితః
గౌరీశభక్త్యామద్దత్తం – తాంబూలం ప్రతిగృహ్యాతామ్ శ్రీకేదారేశ్వరాయనమః తాంబూలం సమర్పయామి
అర్ఘ్యం గృహాణ్ భగవాన్ – భక్త్యాదత్త మహేశ్వర
ప్రయచ్చ మే మనస్తుభ్యం – భక్తాన మిష్టదాయక శ్రీకేదారేశ్వరాయనమః అర్ఘ్యం సమర్పయామి
దేవేశ చంద్ర సంకాశం – జ్యోతి సూర్యమివోదితం
భక్త్యాదాస్యామి కర్పూర నీరాజన మిదం శివః శ్రీకేదారేశ్వరాయనమః కర్పూర నీరాజన దర్శయామి
ఓం తత్సురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నోరుద్రఃప్రచోదయాత్
నమో హిరణ్యబాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పతయే శ్రీకేదారేశ్వరాయనమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
భూటన భువనాదీశ – సర్వదేవాది పూజిత
ప్రదక్షిణం కరోమిత్యాం – వ్రతం మే సఫలం కురు శ్రీకేదారేశ్వరాయనమః ప్రదక్షిణం సమర్పయామి
హరశంభో మహాదేవ – విశ్వేశామరవల్లభ
శివశంకర సర్వాత్మా – నీలకంఠ నమోస్తుతే శ్రీకేదారేశ్వరాయనమః నమస్కారాన్ సమర్పయామి
ఛతరమాచ్చాదయామి, చామరేణ విజయమి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికం నారోహయామి, సమస్తరాజోపచార, దేవోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార సమర్పయామి
అభీష్టసిద్ధిం కురుమే శివావ్యయ మహేశ్వర! భక్తానాం మిష్టదానార్థం మూర్తీకృతకళేభరః (పూజా తోరము తీసుకుంటున్న సమయంలో పఠించు మంత్రం)
కేదారదేవదేవేశ భాగవన్నంభికా పతే! ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యహం ప్రభోః (తోరము కట్టుకోవడానికి పఠించు మంత్రం)
ఆయుశ్చ విద్యాం చ తథా సిఖంచ సౌభాగ్యవృద్ధిం కుర దేవ దేవ
సంసార ఘోరంబు నిధౌ నిమగ్నం మాంరక్ష కేదార నమో నమస్తే (వాయనం ఇచ్చే సమయంలో పఠించునది)
కేదారం ప్రతి గృహ్ణాతు కేదారో వైదరాతి చ కేదారస్తారకో భాభ్యాం కేదారాయ నమో నమః
వ్రతిమాదాన మంత్రం
కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ తస్మాదస్యాః ప్రదనేన మమాస్తు శ్రీ రచంచలా!!
శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సిప్రీతః సుప్రసన్నోవరదోభవతు మమ ఇష్టకామ్యర్థ సిద్ధిరస్తు

పూజా విధానం సంపూర్ణం

శ్రీ కేదారేశ్వర వ్రత కథ

రమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతముని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను. సిద్ధ-సాధ్య- కింపురుష-యక్ష-గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి.

ఋషులు-మునులు-అగ్ని–వాయువు-వరుణుడు-సూర్యచంద్రులు-తారలు-గ్రహాలు-ప్రమదగణాలు-కుమారస్వామి-వినాయకుడు-వీరభద్రుడు-నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల-సాల-తమలా-వకుళ-నరికేళ-చందన-పనస-జంభూ వృక్షములతోను చంపక-పున్నాగ-పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశభువనాలు పులకిస్తున్నాయి.. అట్టి ఆనందకోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించుచుండెను.

శివుడాతనిని అభినందించి అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనమునుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలగాగల వంది మాగాదులు శివునకు ప్రదక్షిణంచేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ! పరమార్ధ విదులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి యాదండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది.

కైలాసమునువదలి శరభ శార్దూల గజములుగల నాగ గరుడ చకవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిధి మర్యాదలొనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు.

వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి.

మహర్షులారా! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవావ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు.

వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని భాద్రపదమాసంలో శుక్ల అష్టమియందు ఆచరించాలి. ఆరోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను.

ఇంకా ధాన్యరాశినిపోసి అందు పూర్ణకుంభమునుంచి ఇరువదియొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమునుగాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య-భోజ్య, నైవేద్యాదులు కదళీప్జలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలదక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించినవారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.

గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను.

dharma sandehalu, diwali, facts, festivals, god, hindu tradition, Karthika Masam, kedareswara, maha lakshmi, pooja room, siva
యమ ద్వితీయ
భగిని హస్త భోజనం

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.