శుక్ర మూఢమి పై ఆశక్తికరమైన కొన్ని వాస్తవాలు

 1. Home
 2. chevron_right
 3. Dharma Samdehalu
 4. chevron_right
 5. శుక్ర మూఢమి పై ఆశక్తికరమైన కొన్ని వాస్తవాలు

శుక్ర మూఢమి పై ఆశక్తికరమైన కొన్ని వాస్తవాలు

మూఢమి లేదా మౌఢ్యమి అంటే ఏమిటి?
మూఢమి అంటే చీకటి అని అర్థం. మూడమి అన్ని గ్రహాలకు ఉన్న గురు,శుక్ర మౌడ్యమి మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది.. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు మూఢమి సంభవిస్తుంది.  అనగా గురు గ్రహము సూర్యునకు దగ్గరగా ఉన్నప్పుడు గురు మౌడ్యమి ఏర్పడును . శుక్ర గ్రహము సూర్యునకు దగ్గరగా ఉన్నప్పుడు శుక్ర మూడమి ఏర్పడును . గురుడు మరియు శుక్ర గ్రహములు నైసర్గికముగా శుభ గ్రహములు . ఇవి సూర్యునకు దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగతము పొందును . అందు వలన తమ శక్తిని కోల్పోతాయి . శుభ ఫలితములను ఇవ్వలేవు .

ఉదా: 1000 వాట్స్ బల్బు ను తీసుకుందాం . అది సూర్యుడని అనుకుందాం .
దాని ప్రక్కన రెండు 50 వాట్స్ బల్బులను ఉంచితే వాటి కాంతి  1000 వాట్స్ బల్బు కాంతిలో కలసి పోతుంది కదా . అలాగే సూర్యునకు దగ్గరలో ఉన్న ఏ గ్రహములైన తమ శక్తిని కోల్పోతాయి .

shukra moodam

శుక్ర మూఢమి ఎలా ఏర్పడుతుంది?
బుధుడు,శుక్రుడు భూకక్ష్యకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ బుధ శుక్రులు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతలి వైపుకి వెళ్ళినప్పుడు భూమిపైన ఉన్న మనకు బుధ,శుక్రులు కనిపించారు.అట్టి సమయాన్నే బుధ అస్తంగత్వం,శుక్ర అస్తంగత్వం అంటారు. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్ర మౌడ్యమి అంటారు.

శుక్ర మూఢమి లో శుభ కార్యక్రమములు ఎందుకు చేయరాదు?
శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము.మౌఢ్యమిని మూఢమిగా వాడుకభాషలో పిలుస్తారు. శుక్రుడు సూర్య గ్రహమునకు ముందూ,వెనుక 10 డిగ్రీ ల దూరము లోపు శుక్రుడన్నట్లయితే అస్తంగత్వమునకు గురి అవును.అనగా శుక్రుడు తన తేజస్సును, ప్రభావాన్ని, శుభత్వాన్ని కోల్పోవును.అందువల్ల ఆ కాలములో చేసే శుభకార్యాలకు శుభ గ్రహమైన శుక్రబలం ఉండదు కాబట్టి శుభకార్యాలు చేయరాదు.కాబట్టి నిషేథ కాలముగా పరిగణించారు. వివాహం, చేయరాదు.

ఈ మౌడ్యమి ఉన్న కాలములో శుభ కార్యములు జరుపకూడదు . ముఖ్యముగా  పెళ్ళిచూపులు, వివాహము , గృహారంభము , గృహ ప్రవేశము, వాహన కొనుగోలు చేయుట మొదలగు సమస్త శుభకార్యములు చేయరాదు .

శుక్ర మౌఢ్యమిలో సంతాన సమస్యలు ఏర్పడటం నిజమేనా?
శుక్ర మౌఢ్యమి ఏర్పడినప్పుడు సమస్త జీవకోటి శృంగార సంబంథమైన విషయాల్లో బలహీనత ఏర్పడుతుంది. వీర్యకణాలలో జీవత్వం,పటుత్వం ఉండదు.  శుక్రుడు సంసార జీవితానికి –శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు.

శుక్ర మౌఢ్యమిలో జరిగే సాధారణ విపత్తులు ఏమిటి?

 1. స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి.
 2. శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి.
 3. శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది.సముద్రం ఆటు,పోటులలో మార్పులు వస్తాయి.

శుక్ర మౌఢ్యమిలో  చేయవలసిన పనులు ఏమిటి?

 1. ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.
 2. మూడమిలో జప,హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును.
 3. శుక్రమౌఢ్యమి కాలంలో ప్రసవం జరిగినప్పుడు శుక్ర గ్రహ,రవిగ్రహ శాంతి చేయాలి.
 4. నక్షత్ర శాంతి , నవగ్రహ దోష పరిహారములు , హోమము , జపములు , అభిషేకములు వంటివి చేయవచ్చును.

సేకరణ: https://www.panditforpooja.com/blog/shukra-moodam/

, ,
శ్రీ హేమలంబి నామ సంవత్సర రాశి ఫలాలు (2017-2018)
హోళీ పండుగ గూర్చి ముందుగా తెలుసుకోవలసినవి!

Related Posts