శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత | కృష్ణ జననం – కృష్ణ లీలలు

  1. Home
  2. chevron_right
  3. Devotional Facts
  4. chevron_right
  5. శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత | కృష్ణ జననం – కృష్ణ లీలలు

శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత | కృష్ణ జననం – కృష్ణ లీలలు

శ్రీ కృష్ణాష్టమి – శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది.

importance-of-krishna-janmashtami

కృష్ణ జననం – శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత – కృష్ణ లీలలు:

ముఖనమ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా ” శ్రీకృష్ణుడు ” జన్మించాడు. అంటే! ( క్రీస్తు పూర్వం 3228సం|| )

జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః|
జయతు జయతు మేఘ శ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః||

తా|| ఓ దేవకినందనా! ఓ వృష్ణివంశ మంగళ దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామ! భూభారనాశ ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!

ఆ బాలకృస్తుడు దినదిన ప్రవర్థమానమగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగనా భక్తులను జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనములో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట! వెన్న జ్ఞానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ ఉంటారు.

అలాగునే మరో చిన్నారి చేష్టలలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళూతూఉంటే, రాళ్లను విసిరి చిల్లు పెట్టేవాడట, అలా ఆ కుండ మానవశరీరము అనుకుంటే ఆ కుండ లోని నీరు అహంకారం. ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.

ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ, శిష్ఠరక్షణ శిష్ఠరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రధసారధియై అర్జునిలో ఏర్పడిని అజ్ఞాననాంధకారాన్ని తొలగించుటకు ” విశ్వరూపాన్ని ” చూపించి గీతను బోధించి, తద్వారా మానవళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పుటకు వేయి తలలు కలిగిన ఆదిశేషునకే సాధ్యముకాదని చెప్పగా! అట్టి శ్రీకృష్ణ భగవానుని జ్ఞానబోధతో అందించిన ‘ గీతామృతం ‘ మనకు ఆదర్శప్రాయం.

” గీతాచార్యుడు ” కృష్ణపరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే కాలకృత్యాలను తీర్చుకుని చల్లని నీటిలీ ” తులసీదళము ” లను ఉంచి స్నానమాచరించిన సమస్త పుణ్య తీర్థములలోను స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని, ఆ రోజు సర్వులు వారి వారి గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణ పాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ, ఊయలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమను ఉంచి, రకరకాల పూవులతో గంధాక్షతలతో పూజించి, ధూపదీప నైవేద్యములతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్థ ప్రసాదములు, దక్షిణ తాంబూలములు సమర్పించుకొనుట ఎంతో మంచిదో చెప్పబడినది. ఇంతేకాక చాలాచోట్ల కృష్ణ పరమాత్మ లీలల్లో ఒక లీలగా ఉట్టికుండ కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు.

కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానసరాజహంసః||
ప్రాణ ప్రయాణసమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ||

ఓ కృష్ణా! మరణసమయాన నిన్ను స్మరించుచూ నీలో ఈక్యమవ్వాలని కోరిక ఉన్నది కాని! ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో? అని తలచి ఇప్పుడే నా ‘ మానస రాజహస ‘ను శతృఅబేద్యమైన ” నీపాద పద్మ వజ్రపంజర ” మందు ఉంచుతున్నాను తండ్రీ…!

ఇట్టి పరమ పుణ్యదినమైన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమినాడు విశేషార్చనలు జరిపించుకుని కృష్ణ భగవానుని ఆశీస్సులతో పునీతులమవుదాము.

జాతక రీత్యా నవగ్రహాల స్థితి  అనుకూలంగా లేని వారు, ఏలినాటి శనితో బాధపడుతుండేవారికి, అపమృత్యు దోషం ఉన్నవారికి, వ్యాపారాలలో, ఉద్యోగాలలో సరిగ్గా కలిసిరాని వారు ఈ మాసమంతా ఇంటి పూజా మందిరంలో కృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని తెచ్చి ప్రతిరోజూ తులసి దళాలతో పూజించడం వలన చాలా మంచి ఫలితముంటుంది. చాలా కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలు సత్వరమే పరిష్కరింపబడుతాయి. అలాగే పర దేవతయైన మహాలక్ష్మికి కుంకుమతో పూజ చేయటం వలన దారిద్ర్యం నశించి, ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది.

, , , ,
ఋషి పంచమి పూజా విధానం మరియు ఋషిపంచమి వ్రత కథ
కృష్ణాష్టమి రోజున చేయవలసిన పనులు

Related Posts