శ్రీ కృష్ణుడు భువికి తెచ్చిన పారిజాత వృక్షం – కింటూర్ గ్రామం, ఉత్తరప్రదేశ్

Loading

original-parijata-tree

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

పారిజాత వృక్షం
కృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామ కి బహూకరించిన పారిజాత వృక్షం ఇదే. ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలో లోని కింటూర్ గ్రామం వద్ద ఉంది . ప్రపంచంలో కెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఇది శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గం లో ఉంచబడింది ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం.

original-parijata-tree

దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు , చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి, పై భాగన ఆకులు యేడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది అదీ జూన్ / జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది . ఈ వృక్ష కాండము చుట్టుకొలత 50 అడుగులుగాను, ఎత్తు 45 అడుగుల గాను చెప్పబడింది. ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు. ఇప్పుడు నిపుణులు ఈ వృక్షం మనుగడ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

parijata vruksham