విష పూరితమైన జిల్లేడు స్వరూపంలోఉన్నా, శ్వేతార్క గణపతిని ఎందుకు పూజిస్తారు?

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

శ్వేతార్క గణపతి

దేవతల ప్రార్థనలు దశదిశలా ప్రతి ధ్వనిస్తుండగా క్షీరసాగరపు అలపై నున్న విషం `తెల్లటి నురుగు’ సెగలు విరజిమ్ముతూ సముద్రజలాలపై తేలుతూ తీరానికి చేరి, వాయు ప్రభంజనంచే విరగబడి ఒడ్డును భూభాగంపైన `విత్తనం’ లా పడింది. దేవతలూ,మహర్షులూ ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని తిలకించసాగారు. అప్పుడు విత్తనం రూపంలో నున్న ఆ `విషం’ భూగర్భంలోకి ప్రవేశించి, ఫలించి రెప్పపాటులో `మొక్క కాండం’ భోగర్భంలోంచి మొలకెత్తింది. ఆ కాండం `శ్వేతవర్ణం’ లో అంటే తెల్లగా `పాల నురుగు రంగు’లో వుంది. (పాము కాటికి లేదా విషప్రయోగానికి గురైన మానవులు లేదా యితర జీవుల నోళ్లలోంచి తెల్లరంగు నురుగలు వస్తాయి) అందరూ విభ్రాంతితో చూస్తుండగా ఆ మొక్క నుంచి `శ్వేత ఆర్కములు’ అనగా `తెల్లటి ఆకులు’ మొలిచాయి. ఆ గరళము `విత్తనము’గా మారి దాని నుంచి `శ్వేతార్కము’ ఉద్భవించింది.

ఆ విచిత్ర దృశ్యాన్ని మహేంద్రాది దేవతలూ, మహర్షులూ విన్మయంతో వీక్షించసాగారు.
అంతట ఆ `శ్వేతార్క’ మొక్క కాండము దిగువ భాగాన `వేరు’ మీద `అదృశ్యరూపం లో నున్న శిల్పాచార్యుడు’ చెక్కుతున్నట్లు దేవతా రూపము ఆవిర్భవిస్తూ క్రమక్రమంగా ఆ రూపము చతుర్భుజుడూ, మొదకహస్తుడైన విఘ్నేశ్వరుడుగా అవతరించింది. అది మామూలు విఘ్నేశ్వరుడు కాదు. శ్వేతార్క విఘ్నేశ్వరుడు. శ్వేతార్కము వేరు మీద అదే తెల్లటి వర్ణముతో స్వయంభువై అవతరించాడు శ్వేతార్కగణపతి.
విషము, హాలాహలము, గరళము పేరేదైనా ఏ రూపంలో నున్నా అది మృత్యువుకు చిహ్న ము. దాని వర్ణము శ్యామవర్ణము అనగా చీకటిని బలు నలుపు. జీవము, ప్రాణము, భవిష్యత్తు పేరేదైనా అది జీవితమునకు గల ప్రకాశమునకు చిహ్నము. ప్రకాశము యెక్క వర్ణము స్వర్ణకాంతులతో సమ్మిళితమైన శ్వేతము. అనగా తెలుపు. పవిత్రతకి చిహ్నము తెలుపు. అందుకే పరబ్రహ్మ స్వరూపుడైన విఘ్నేశ్వరుడు, హాలాహల మందలి శేషభాగాన్ని విత్తనముగా మార్చి, దాని నుంచి పవిత్రమైన శ్వేతా ర్కమును భ్రవింపజేసి, దానిపై తాను స్వయ ముగా, స్వయంభువై శ్వేతార్కగణపతిగా అవతరిం చాడు. కాలకూట విషాన్ని కూడా తన అవ తారంతో పూజనీయం గావించాడు. పరమేశ్వరు గరళాన్ని కంఠమందు ధరించి గరళ కంఠుడు అన్న పేరిట పూజలందుకుం టున్నాడు. పరమేశ్వర ప్రసాదితమైన గరళ భాగాన్ని తమ కోరల యందు ధరించిన సర్ప జాతి – నాగరాజు, నాగేంద్రుడు, నాగదేవత, సుబ్ర హ్మణ్యము, నాగమ్మ వంటి పేర్లతో పూజలందుకుంటోంది.
నాగజాతితో పాటు కాసింత విషాన్ని స్వీకరించి తన కొండెములో నిలుపుకున్న `వృశ్చి కము’ అంటే `తేలు’ జ్యోతిష శాస్త్ర ప్రధానమై న ద్వాదశ రాశులలో ఒకటిగా `వృశ్చిక రాశి’ గా స్థానము పొంది తన రాశియందు జన్మిం చిన మానవులకు వృద్ధి, లాభ, క్షేమ యోగా లను ప్రసాదిస్తోంది.

ఇక విషోత్పత్తికి కారకములైన సర్పములను శివుడు ఆభరణములుగా ధరించగా – విష్ణువు పాన్పు గా స్వీకరించగా – శక్తి స్వరూపిణి యైన అమ్మవా రు తన శిరోజములుగా ధరించి – సృష్టిలో విషము – అమృతము, సుఖము – దుఃఖము, మంచి చెడు సమాన ముగా స్వీకరించాలనే సందే శాన్ని జగత్తుకి అందించారు (అమ్మవారు శిరోజ ములుగా మొట్టమొదటి ధరించినది సర్పములనే. ఆ సర్పములు తమ కోరికతో అమ్మవారి కేశరహి తమైన శిరోభాగాన్ని కరచి పట్టుకుని వుండే వట. అయితే అమ్మవారి దర్శనార్థం వచ్చే దేవ మానవ దానవులు ఆ సర్పములను చూసి భీతి చెందుతుండేవారట. అది గ్రహించిన అమ్మవారు ఆ సర్పములను తన మహిమతో శిరోజములుగా మార్చి వేశారు).
ఇలా దేవతలందరూ అనేక విధాలుగా విషాన్ని తమ తమ ఆదీనముల యందు వుంచుకొని లోకాలను కాపాడుతుండగా – నేడు లోకోద్ధరణ కోసం విషాన్ని విత్తనంగా మార్చి మొక్కను సృష్టించి దానిపై తాను స్వ యంభువుడై అవతరించాడు శ్వేతార్కగణపతి.

swetark_ganpati
శ్వేతార్కమును మాములు పరిభాషలో జిల్లేడు అంటారు. జిల్లేడు ఆకును తృంచినా, కొమ్మను తృంచినా తెల్లటి పాలు ఉద్భవిస్తాయి. ఆ తెల్లటి పాలు క్షీరసాగరమునకు ప్రతిచిహ్నము.
జిల్లేడు పాలు విషపూరితం. ఆ పాలు కంటికి తగిలితే చూపుపోతుంది. నాలికకు ఆ పాలు తగిలితే ప్రాణమే పోతుంది. మనుషులే కాక పశువులు కూడా ఆ జిల్లేడు ఆకులను తినవు. వాటిని తింటే ప్రాణం పోతుందని మనుషు లకే కాక పశువులకు కూడా తెలుసు.
కానీ – ఆ జిల్లేడు ఆకులతో, జిల్లేడు పూలతో వినాయక చవితినాడు వినాయకుడిని పూజిస్తాం.

రథ సప్తమినాడు జిల్లేడు ఆకులను శిరస్సు, భుజాలు, వక్షస్థలం, చెవులు, చేతులు, పాదా లపైన వుంచుకొని స్నానాలు చేస్తాం. ఎందుకు? ఎందుకో చాలా మందికి తెలియదు. జిల్లేడు అంటే హాలాహలమును తనలో యిముడ్చుకు న్న పరబ్రహ్మ ప్రతిరూపము. అట్టి జిల్లేడు ఆకును దేహముపై వుంచు కొని స్నానం చేస్తే మానవుడి శరీరంలో వున్న విషతుల్య ప దార్థాల్లో విష ప్రభావాన్ని జిల్లేడు ఆకర్షించి స్వీకరిస్తుంది. అందుచేత మానవుడు తనకు తెలిసీతెలియకుండా తన దేహంలో చేరు కున్న విషపదార్థాల ప్రభావం నుంచి రక్షించబడ తాడు. అంతే కాదు విషపూ రితమైన దుష్ర్పభా వాలు కూడా తొలగిపోయి ఉద్ధరించబడతాడు. రథసప్తమినాడు యీ స్నానం చేయడం వలన – విషప్రభావం నుంచి రక్షించబడ్డ మానవ శరీరం ఆనాటి పవిత్ర సూర్యకిరణాల ప్రభావం చేత మరల పరిపుష్టమూ, తేజోవంతమూ అవుతుం ది. అలాగే వినాయక చవితి నాడు – వినాయకు డికి, యిష్టమనే పేరిట ఆ గణేశ్వరుడి ప్రతి రూ పమైన జిల్లేడుతో పూజిస్తారు. ఆ పూజా సమ యంలో జిల్లేడులోని విషాకర్షక శక్తి మనిషి దేహంలోని విషాన్ని అకర్షించి, ఆ దేహాన్ని ఆరో గ్యవంతం చేస్తుంది. కేవలం స్పర్శ లేదా ఆ గాలి పీల్చడం వల్ల కూడా మానవుడు ఉద్ధరించబడ తాడనడానికి యిది నిదర్శనం. అలాగే జిల్లేడు మొక్క ఆకులు వాతావరణం లో విషాన్ని ఆకర్షించి లోకానికెంతో మేలు చేస్తున్నాయి. జిల్లేడు మొక్క పాలల్లోంచి ఉద్భవించే విషం – ఆ ఆకుల్లోంచి వచ్చే విషం – లోకంలోని జీవరాశులన్నింటిలోంచి ఆకర్షించబడిన విషమే. ఆ విధంగా జిల్లేడును లోకసంరక్షణార్థం సృష్టించిన భగవంతుడు దాని పవిత్రతను లోకానికి చాటడానికే తాను స్వయంగా జిల్లేడు వేరు మీద శ్వేతార్కగణపతిగా అవతరించాడు. ఆ విధంగా స్వయంభువై అవతరించిన శ్వేతార్కగణపతిని దర్శించు కుంటూ దేవతలూ, మానవులూ జయ జయ ధ్వానాలు చేశారు.

jilledu_chettu
శ్వేతార్కగణపతి ప్రసన్న దరహాస వదనంతో, వరద హస్తంతో ఆశీర్వదిస్తూ “వత్సలారా… పుట్టుకను నేనే… మృత్యువును నేనే… వృద్ధి నేనే… క్షయమును నేనే… హాలహలము నేనే… అమృతము నేనే… అందుకే జగత్తు లోని సర్వజీవులకూ ఇదే నా అభయం…
ఏ జీవియైనా నా ప్రతి రూపమైన శ్వేతార్కగణప తిని పూజించినంతనే ఆ జీవి కాలకూటాది ఘోరవిష ప్రయోగాల బారి నుండి విముక్తమై అకాల మృత్యువు నుండి తప్పించుకోగలదు. దేవ దానవ మానవులలో ఎవరు శ్వేతార్కగణ పతి ప్రతిమను తమ గృహము నందుంచి పవి త్రముగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు సకలార్థిని పొంది, సర్వత్రా విజయవంతులవు తారు” అని ఆశీర్వదించాడు శ్వేతార్కగణపతి.

“విఘ్నవినాయకా… జగదోద్ధారకా… శ్వేతార్క గణనాధా… జయహో… జయ జయహో…” అంటూ జయ జయ ధ్వనులతో శ్వేతార్క గణపతిని కీర్తించారు దేవతలూ, మహర్షులు, మానవులు.

దర్భ గడ్డి యొక్క ఆవిర్భావం – విశిష్టత
శ్రీ కృష్ణుడు భువికి తెచ్చిన పారిజాత వృక్షం – కింటూర్ గ్రామం, ఉత్తరప్రదేశ్

Related Posts

No results found.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.

This content is Copyrighted, and not allowed to copy!