శ్రీశైల మల్లిఖార్జున జ్యోతిర్లింగ ఆవిర్భావం – విశిష్టత

శ్రీశైల మల్లిఖార్జున జ్యోతిర్లింగ ఆవిర్భావం – విశిష్టత

Loading

శ్రీశైల మల్లిఖార్జున జ్యోతిర్లింగ ఆవిర్భావం – విశిష్టత

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీశైలే స్వర్ణ శృంగేమణి గణరచితే – కల్ప వృక్షాళిళీతే |
స్ఫీతే సౌవర్ణ రత్నస్ఫురిత – నవగృహే దివ్య పీటే శుభార్షే ||
ఆసీన స్సోమచూడ స్సకరుణన యన – స్సాంగన స్స్మేర వక్త్రః |
శంభుః శ్రీభ్రా మరీశః ప్రకటిత విభవో – దేవతాసార్వ భౌమః ||

పరమేశ్వరుడు ఇచ్చట మల్లిఖార్జున స్వామిగా అవతరించియున్నాడు. ఈ ప్రాంతంలో శిలాదుడనే గొప్ప మహర్షి శివుని గురించి ఘోర తపస్సు చేయగా ఆ మహర్షి తపమునకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏమి వరము కావాలనో కోరుకోమని అడిగెను. శిలాదుడు స్వామి.. నాకు పుత్రుడు పొందేలా నీ వరం చేత నన్ను అనుగ్రహించు అని కోరుకున్నాడు. అంతట బోలా శంకరుడయిన పరమశివుడు శిలాదుడుకి వరం ప్రాసదించి అంతర్ధానమయ్యెను. తదనంతరం శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిలో నందీశ్వరుని తన వాహనముగా (నందికేశుని) చేసుకొనెను. పర్వతుడు స్వామి వారి గురించి మరలా తపస్సు చెయ్యగా స్వామి ప్రత్యక్షమయి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడిగెను.అంతట పర్వతుడు స్వామివారికి నమస్కరించి పరమేశా.. నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువుండేలా వరం ప్రసాదించవయా అని అడిగెను. అడిగనంత మాత్రం చేత వరములను ప్రసాదించే బోలా శంకరుడు వరాన్ని ప్రసాదించి అక్కడే ఉండి పోయను.దానితో కైలాసంలో ఉన్న పార్వతి ,ప్రమద గణాలు కూడా స్వామి వారి వెంటనే వచ్చి ఇక్కడే కొలువుదీరారు. పర్వతుని కోరిక ప్రకారం పరమేశ్వరుడు మల్లిఖార్జున లింగరూపమున పర్వతునిపై స్వయం భూ జ్యోతిర్లింగముగా వెలసినారు, పార్వతీ దేవి భ్రమరాంబికా దేవిగా శక్తి పీఠమై స్వయంభువులుగా వెలిసారు.

స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ కలదు. పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివునికి పరమ భక్తురాలు.ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది ఆమె. తన భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంతట చంద్రావతి స్వామీ.. నేను మీ శిరముపై ఉంచిన మల్లిపూల దండ ఎన్నటికీ వాడి పోకుండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు.శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు.

శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే” అని యుగయుగాల నుండి అఖండకోటి భక్తావళి నమ్మకము. అనగా శ్రీశైల మల్లిఖార్జునస్వామి ఆలయ శిఖరాన్ని శిఖరేశ్వరస్వామి పర్వతము నుంచి దర్శించి కలిగినచో పునర్జన్మ ఉండదు. శ్రీ మల్లిఖార్జునస్వామి వారి లింగము సుమారు ఆరు అంగళముల ఎత్తు ఎనిమిది అంగుళముల వెడల్పుతో సాలిగ్రామ శిలతో పానుమట్టం మీద దర్శనమిస్తున్నారు.

శ్రీశైల క్షేత్రమునకు వెళ్ళు దారిలో 4 కి.మీ. ముందుగా పాలధార, పంచధార, హటకేశ్వరము దర్శించుకొనవలెను. ఇక్కడ నుండి 2 కి.మీ. సాక్షి గణపతి ఆలయము కలదు. శ్రీశైలము వచ్చినవారు తప్పక సాక్షి గణపతి స్వామివారి దర్శనము చేసుకొనవలెను. ఇచ్చటికి సమీపములో పాతాళగంగ, శ్రీశైలం డ్యామ్‌ కలవు. ఛత్రపతి శివాజీని గురించి తెలిపే మ్యూజియం కలదు.

శ్రీశైలం చుట్టుపక్కల దర్శనీయ స్థలములు:

  1. సాక్షి గణపతి ఆలయం. 2 కి.మీ
  2. లలితా అమ్మవారు 2.2 కి.మీ
  3. పాలధార పంచధార 3.6 కి.మీ
  4. హటకేశ్వరము 4 కి.మీ
  5. పాతాళగంగ 1.3 కి.మీ
  6. శిఖర దర్శనం 8.7 కి.మీ
  7. ఇష్టకామేశ్వరి మందిరం 15 కి.మీ

దర్శనీయ ప్రాంతాలు

  1. శ్రీశైలం డ్యామ్ 3 కి.మీ
  2. అక్కమహాదేవి గుహలు 4.5 కి.మీ
  3. ఛత్రపతి శివాజీ మ్యూజియం 2.3 కి.మీ
శ్రీ కృష్ణుడు భువికి తెచ్చిన పారిజాత వృక్షం – కింటూర్ గ్రామం, ఉత్తరప్రదేశ్

Related Posts

No results found.