ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదా ?

Loading

Simple Remedies for getting Good Job

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ప్రస్తుత రోజుల్లో చాల మందికి ఎదురయ్యే సమస్య ఉద్యోగం. తాము చేసినటువంటి కోర్సుకు చదివిన చదువుకు సరియైన ఉద్యోగం దొరకక పోవడం ఈ రోజుల్లో చాలా మంది యెక్క  ప్రాధాన సమస్య. అయితే… కొన్ని చిన్న చిట్కాలను పాటించడం వల్ల అనుకొన్న ఉద్యోగమును పొందవచ్చును.

యత్నికృత కార్యసాఫల్యాన్ని ఇచ్చే భోళాశంకరుడు(పరమ శివుడు) వద్ద నువ్వుల నునేలో నానబెట్టిన 3వత్తులను దీపములుగా వెలిగించాలి. అంతే కాకుండా పరమేశ్వరుడు స్పటిక లింగంగా ఉన్న శివాలయాలలో విభూతితో అభిషేకం చేయించాలి. తద్వారా ఉద్యోగం పొందని ఎవ్వరికైనా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అంతేకాక రాశి ఉసిరికాయ పై నేతి దీపారాధనను రావి చెట్టు కింద వెలిగించాలి.

విశేషించి మానవ గతులను మార్చే నవగగ్రహాలకు నమస్కారము చేయడం, నవగ్రహ స్తోత్రములు చదవడం వల్ల నచ్చిన ఉద్యోగం పొందవచ్చు. మానవ ప్రయత్నానికి స్వామీ అనుగ్రహం తప్పక కలుగును. ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి 5వత్తులను నువ్వుల నూనెతో వెలిగించుట మంచిది. శ్రీమహావిష్ణువుకు తులసి దళములను అర్చించినయెడల ఉన్నత పదవులను పొందవచ్చును.

సేకరణ: https://www.panditforpooja.com/blog/simple-remedies-for-getting-good-job/