వసంత పంచమి | శ్రీ పంచమి – సరస్వతీ దేవి అనుగ్రహం

వసంత పంచమి | శ్రీ పంచమి – సరస్వతీ దేవి అనుగ్రహం

Loading

vasanta-panchami

వసంత పంచమి | శ్రీ పంచమి – సరస్వతీ దేవి అనుగ్రహం

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

మాఘ శుక్ల పంచమి – వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి

ఫిబ్రవరి 14వ తేదీ 2024, మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి(Vasant Panchami), శ్రీ పంచమి, మదన పంచమి అని పేర్లు.

జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి, స్మరించి, పూజించే రోజే వసంత పంచమి. యావద్భారతావనిలో ప్రజలంతా, ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు.

యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.

Saraswati Puja

శ్రీసరస్వతి పూజ పరోక్ష సేవ

వసంత పంచమి సందర్భంగా శ్రీసరస్వతి అమ్మవారి పూజను Poojalu.com యొక్క Online Puja Services పరోక్ష సేవ ద్వారా నిర్వహించడానికి సంకల్పించడం జరిగినది. దీనికి రుసుము చెల్లించనవసరంలేకుండా, ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నయెడల, మా పురోహితులు మీతో/మీచిన్నారులతో శ్రీసరస్వతి పూజను చేయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.
పూజా సమయం: 16వ తేది ఫిబ్రవరి 2021 ఉదయం 9గంటల లగాయతు

Enroll for Online ePuja now!

[contact-form-7 id=”44506″ title=”Free Online ePuja Form”]


Please find the below Guidelines to complete your event without having any issue in a simple way.

Guidelines:
1. Should have Good Internet Connection.
2. Should have latest devices which support GoToMeeting & Install from Play Store/Web.
3. Should have proper Audio output such as Bluetooth Speakers / Sound Boxes.
4. Should have the Video Camera device minimum 2-3 feet distance far from the Puja area.
5. Puja premises should be visible clearly to Pandit ji while performing the puja to guide properly.
6. If relatives joined, then by default they should be in mute mode & can unmute themself whenever required.
7. Take necessary precautions to avoid background noise such as traffic, house related sounds & TV etc.
8. If your video stuck at any point of time due to poor connectivity / low band width, requesting to rejoin again.
9. If the Online ePuja like not working properly, reach us @ 9908234595.
10. The same online puja will be Stream Live on Poojalu.com YouTube Channel(that depends).
11. Should prepare to puja & decoration if required before puja start.
Download Puja Samagri List

Enrolled people will get the GoToMeeting link via Email. As this is a free Online ePujs, requesting the devotees please enroll only if needed. Else that space will be useful for the really required people. The main intention of this Online Free Puja is to facilitate everybody to perform the Puja to get the Devine blessings  on this Carona Pandemic.

Poojalu.com, have a right to terminate if any of the enrolled user misused the Online ePuja facility. We always keep an eye in every user to make the Puja in smooth way. Enroll using the below form to get the GoToMeeting link to Join in the Puja. The Puja will start on time & join 15mins before to avoid  last minute rush.

శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:

మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ
పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః॥

వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి, శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో, అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి.

చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా, ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం.
పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి, కవితా ఘోష్టులు జరిపి కవులను, పండితులను, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.

సరస్వతీ కటాక్షం:

  • బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు.
  • గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి దొకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో, సూర్యుని ఆరాధించగా, ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు.
  • వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసేడని పురాణాలు చెబుతున్నాయి.
  • అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి, పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి.
  • తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక, ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.

Book Pandit for Vasanta Panchami Poojas

hindu tradition, Saraswati, sri panchami, Vasant Panchami, పూజ గది
భీష్మాష్టమి – భీష్మ తర్పణ విధానం
భీష్మ ఏకాదశి – భీష్మ తర్పణ విధానం

Related Posts