Please submit the below form to get the Puja Vidhanam.
యజ్ఞ్యోపవీతము(Yagnopaveetham) లేదా జంధ్యం(Janeu) ను బ్రహ్మసూత్రము అని కూడా అంటారు. జంధ్యాన్ని హిందూ సాంప్రదాయంలో బ్రాహ్మణులు ధరిస్తారు. కానీ సాంప్రదాయమును బట్టి ఎవరైనా ధరించవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఆర్యసమాజ్ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి అందరిని జంధ్యంను ధరించమనేవారు. అలాధరించడం వల్ల ముగ్గురు దేవత అనుగ్రహం పొందవచ్చును. యజ్ఞ్యోపవీతం లో ఉండే మూడు పోచలు శక్తినిచ్చే పార్వతి, ధనాన్నిచ్చే లక్ష్మి, చదువునిచ్చే సరస్వతి కి ప్రతీకలు. అట్టి యజ్ఞ్యోపవీతం శరీరంపై కలిగియున్న వారు సంధ్యావందనమును (Sandhyavandanam) చేయుటవల్ల బ్రహ్మజ్ఞ్యానమును తప్పక పొందవచ్చును.
నూతన యజ్ఞోపవీత ధారణ విధానము (Yagnopaveetha Dharana Vidhi)
హరిః ఓం | శ్రీ గణేశాయ నమః | శ్రీ గురుభ్యో నమః |
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నౌపశాంతయే ||
ఆచమ్య |
- ఓం కేశవాయ స్వాహా |
- ఓం నారాయణాయ స్వాహా |
- ఓం మాధవాయ స్వాహా |
- ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
- ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
- ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
- ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
- ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
- ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
- ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
- ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
- ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
- ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
- ఓం శ్రీ కృష్ణాయ నమః |
ప్రాణాయామం –
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
సంకల్పం –
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే* శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్య ప్రదేశే శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ ____ (*౧) నామ సంవత్సరే ___ అయనే(*౨) ___ ఋతౌ (*౩) ___ మాసే(*౪) ___ పక్షే (*౫) ___ తిథౌ (*౬) ___ వాసరే (*౭) ___ నక్షత్రే (*౮) ___ యోగే (*౯) ___ కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ___ గోత్రస్య ___ నామధేయస్య మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం బ్రహ్మతేజోఽభివృద్ధ్యర్థం (నూతన) యజ్ఞోపవీత ధారణం కరిష్యే ||
యజ్ఞోపవీత జలాభిమంత్రణం |
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన | మహేరణాయ చక్షసే |
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః | ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ | ఆపో జనయథా చ నః |
నవతంతు దేవతాహ్వానం |
- ఓంకారం ప్రథమతంతౌ ఆవాహయామి |
- అగ్నిం ద్వితీయతంతౌ ఆవాహయామి |
- సర్పం (నాగాన్) తృతీయతంతౌ ఆవాహయామి |
- సోమం చతుర్థతంతౌ ఆవాహయామి |
- పితౄన్ పంచమతంతౌ ఆవాహయామి |
- ప్రజాపతిం షష్టతంతౌ ఆవాహయామి |
- వాయుం సప్తమతంతౌ ఆవాహయామి |
- సూర్యం అష్టమతంతౌ ఆవాహయామి |
- విశ్వేదేవాన్ నవమతంతౌ ఆవాహయామి |
- బ్రహ్మదైవత్యం ఋగ్వేదం ప్రథమ దోరకే ఆవాహయామి |
- విష్ణుదైవత్యం యజుర్వేదం ద్వితీయ దోరకే ఆవాహయామి |
- రుద్రదైవత్యం సామవేదం తృతీయదోరకే ఆవాహయామి |
- ఓం బ్రహ్మాదేవానామితి బ్రహ్మణే నమః – ప్రథమగ్రంథౌ బ్రహ్మాణమావాహయామి |
- ఓం ఇదం విష్ణురితి విష్ణవే నమః – ద్వితీయగ్రంథౌ విష్ణుమావాహయామి |
- ఓం కద్రుద్రాయమితి రుద్రాయ నమః – తృతీయగ్రంథౌ రుద్రమావాహయామి |
యజ్ఞోపవీత షోడశోపచార పూజ |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ధ్యాయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ఆవాహయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – పాద్యం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – అర్ఘ్యం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ఆచమనీయం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – స్నానం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – వస్త్రయుగ్మం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – యజ్ఞోపవీతం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – గంధం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – పుష్పాణి సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ధూపమాఘ్రాపయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – దీపం దర్శయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – నైవేద్యం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – తాంబూలం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – కర్పూరనీరాజనం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – మంత్రపుష్పం సమర్పయామి |
- ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సూర్యనారాయణ దర్శనం |
ఓం ఉద్యన్నద్య మిత్రమహః ఆరోహన్నుత్తరాం దివం |
హృద్రోగం మమ సూర్య హరిమాణం చ నాశయ |
శుకేషు మే హరిమాణం రోపణాకాసు దధ్మసి |
అధో హరిద్రవేషు మే హరిమాణం నిదధ్మసి |
ఉదగాదయమాదిత్యో విశ్వేన సహసా సహ |
ద్విషంతం మహ్యం రంధయన్ మో అహం ద్విషతే రథమ్ ||
ఉదు త్యం జాతవేదసం దేవం వహన్తి కేతవః |
దృశే విశ్వాయ సూర్యమ్ ||
యజ్ఞోపవీతం సూర్యాయ దర్శయిత్వా |
ఆచమ్య (చే.) ||
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం (నూతన) యజ్ఞోపవీత ధారణం కరిష్యే ||
అస్య శ్రీ యజ్ఞోపవీతమితి మంత్రస్య పరమేష్ఠీ ఋషిః, పరబ్రహ్మ పరమాత్మా దేవతా, త్రిష్టుప్ ఛందః, యజ్ఞోపవీతధారణే వినియోగః ||
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తుతేజః ||
ఆచమ్య (చే.) ||
(గృహస్థులకు మాత్రమే)
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఉద్వాహానంతర (గార్హస్థ్య) కర్మానుష్ఠాన (యోగ్యతా) సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే ||
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తుతేజః ||
(గృహస్థులకు మాత్రమే)
ఆచమ్య (చే.) ||
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే ||
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తుతేజః ||
ఆచమ్య (చే.) ||
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ నూతన యజ్ఞోపవీతే మంత్ర సిద్ధ్యర్థం యథాశక్తి గాయత్రీ మంత్రజపం కరిష్యే ||
గాయత్రీ ధ్యానము ||
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిన్దు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమథారవిన్దయుగళం హస్తైర్వహన్తీం భజే ||
గాయత్రీ జపం (చే.) ||
ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
ఆచమ్య (చే.) ||
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ జీర్ణయజ్ఞోపవీత విసర్జనం కరిష్యే |
ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితమ్ |
విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తు మే ||
ఏతావద్దిన పర్యంతం బ్రహ్మత్వం ధారితం మయా |
జీర్ణత్వాత్ త్వత్ పరిత్యాగో గచ్ఛ సూత్ర యథా సుఖమ్ ||
యజ్ఞోపవీతం యది జీర్ణవంతం
వేదాంత నిత్యం పరబ్రహ్మ సత్యమ్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం విసృజస్తుతేజః ||
ఇతి జీర్ణ యజ్ఞోపవీతం విసృజేత్ |
సముద్రం గచ్ఛస్వాహాఽన్తరిక్షం గచ్ఛస్వాహా ||
ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ||
Please submit the below form to get the Puja Vidhanam.
1 Comment. Leave new
Thanks a lot for providing this useful information for all the Brahmin community.