మార్గశిర లక్ష్మివార వ్రతం | వ్రత విధానం – సమర్పించవలసిన నైవేద్యములు – వ్రత కధ

Loading

Margasira Lakshmivaram

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

మార్గశిర లక్ష్మివార  వ్రతం:

మార్గశిర మాసంలో వచ్చే గురువారం/లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు.  మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.

ఈ సంవత్సరమందు మార్గశిర లక్ష్మివారముల తేదీలు:

డిసెంబరు 14వ తేదీ   గురువారం
డిసెంబరు 21వ తేదీ గురువారం
డిసెంబరు 28వ తేదీ గురువారం
జనవరి 04వ తేదీ గురువారం
జనవరి 11వ తేదీ గురువారం

 

మార్గశిర లక్ష్మివార వ్రత విధానం:

మార్గశిర లక్ష్మివార వ్రత పూజా విధానం  దీపావళి  లక్ష్మీపూజ మరియు వరలక్ష్మి పూజ వలే ఉన్నప్పటికిని… అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది.

మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయవలెను(తలంటు కుంకుడు/శ్యాంపుతో చేయరాదు). ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, తలకు నూనే రాసుకొనుట, దువ్వుకోనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలెను.

‘ఆదౌ పూజ్యో గణాధిపః’ అని మొట్టమొదట గణపతికి  ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం, లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర  లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి.
లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం.

మార్గశిర లక్ష్మివార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు:

1 వ గురువారం – పులగం
2 వ గురువారం – అట్లు, తిమ్మనం
3 వ గురువారం –  అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం – చిత్రాన్నం, గారెలు
5 వ గురువారం – పూర్ణం బూరెలు

మార్గశిర లక్ష్మివార వ్రత కధ:

పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు.  అతనికి సుశీల అను ఒక కూతురు కలదు.  ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది.  ఆసుశీల  సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల.  ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు.  ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని  సుశీల చాలా బాధపడుతుంది.  తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా!  నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను.  సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు.  దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దోలిపింఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది.  ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు.  ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు.  ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను.  మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు.  కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది.  వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి.  ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను.  సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు.  జరిగిన విషయం తల్లికి చెప్పాడు.  తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను.  మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను.  అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను.  అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది.  సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు.  ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను.  ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు.  ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు.  తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను.  తల్లి విచారించింది.  కొన్నాళ్ళకు.  తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను.  తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి  మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది.  అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను.  ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది.  కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది.  అప్పుడు జరిగినది తల్లిచేప్పినది.  ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది.  రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది.  ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు.  మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది.  పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలడువ్వుకొని వ్రతం చేయలేకపోయినది.  కూతురుమాత్రమే చేసుకున్నది.  నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది.  పని అయినతరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుంధం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది.  అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని.  ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం .  అప్పుడు సుశీల తల్లిని తనకోగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది.  పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది.  కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా….  నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది.  అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది.  మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృస్యము అయ్యినది మహాలక్ష్మి.  సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం,  మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు,  పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది.  కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు.  అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను.  కధలోపమైనను వ్రత లోపము కారాదు.  భక్తి తప్పినను ఫలము తప్పదు.

లక్ష్మీ అమ్మవారి మంగళ హారతి పాట:

లక్ష్మీదేవ్మ- మంగళ హారతి ఇది గో
అనురాగంబులో- నిన్నువేడి తిని
క్షీర సాగర తనయా – ఆది లక్ష్మీ ప్రార్ధంచితిని || లక్ష్మీ
వనస బత్తాయా – దానిమ్మ ఖర్జూర
తేనెలూ రేటి – తీ పైన పండ్లు
కన్నతల్లి – కమలాఫలాలు
ఉంచినాఫమ్మ- దయాసేయవమ్మా || లక్ష్మీ
మల్లె పుష్పాలు – మందార పూలు
తెల్ల గన్నేరు – చెంగల్ప పూలు
పళ్ళేరములో- మధుపాయసాలు
తల్లి ఉన్నాయి – దయ సేయమ్మా || లక్ష్మీ
భక్తితో గొలిచేటి – నీ భక్త వరులం
నిజముగా – నిన్ను నమ్మేము నిరంతరం
శ్రీ హరి ప్రియమమ్ము కాపాడుమమ్మా
సకల సౌఖ్యాలు – చేకూర్చు మాతా ||

Aidava tanam, dharma sandehalu, god, hindu tradition, maha lakshmi, Mangalyam, margasiram, pooja, Pooja Vidhanalu, thursday
మోక్షద ఏకాదశి
ధనుర్మాసం – విశిష్టత

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.