ధర్మ శాస్త్రం లో స్త్రీలకు మాత్రమే పాతివ్రత్య నియమాలు ఎందుకు?

ధర్మ శాస్త్రం లో స్త్రీలకు మాత్రమే పాతివ్రత్య నియమాలు ఎందుకు?

Loading

ధర్మ శాస్త్రం లో స్త్రీలకు మాత్రమే పాతివ్రత్య నియమాలు ఎందుకు?

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

చాలా పాతివ్రత్య నియమాలు, వ్రతాలు, నోములు స్త్రీలు ఆచరించేవిగా ఉంటాయి. వ్రత, నోములు చేసే విధానాలలో పురుషుల పాత్ర చాలా తక్కువ. దీనికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం.

[embedyt] https://www.youtube.com/watch?v=VN0ATIa8p9k[/embedyt]

సాధారణంగా ధర్మ సింధు, గరుడపురాణ గ్రంధాల ఆధారంగా చూసిన యెడల మానవులు చేసే తప్పిదాలకు శిక్షలు నరకంలో ఒకే విధంగా అమలు చేయబడుతూ ఉంటాయి. స్త్రీ పురుషులు ఇరువురికి వారి వారి పాపాలకు సమానంగా శిక్షలు వేయబడతాయి. అయితే పురుషుడిని బీజంగా, స్త్రీని క్షేత్రంగా చెప్పడం జరుగుతుంది.

ఒక వంశం పురోగాభివృద్ధి చెందే విధంగా సరియైనటువంటి స్త్రీని తన కుమారుడికి భార్యగా చేసే ప్రయత్నాన్ని మామగారు చేస్తుంటారు లేదా ఇంటి యజమాని చేస్తూ ఉంటారు. పురుషుడి తప్పిదం వల్ల ఒక వంశానికి వచ్చే సమస్య చాలా తక్కువ. కానీ ఒక వంశం నుంచి వచ్చి మరోక వంశానికి చేసే స్త్రీ యొక్క తప్పిదం చేత ముందు తరం యొక్క పితృ దేవతలు విశేషమైన క్షోభ చెందుతారు.

  • స్త్రీ ఒక వంశ పురోగాభివృద్ధికి తోడ్పడుతుంది.
  • స్త్రీ ఒక వంశం నిలబడటానికి తోడ్పడుతుంది.
  • స్త్రీ ఒక వంశం ఉత్తమ గతులను పొందటానికి తోడ్పడుతుంది.

ఎప్పుడైతే ఒక స్త్రీ తన వంశమందు ఒక యోగ్యుడైన కుమారుడికి జన్మనిచ్చిందో పితృదేవతానుగ్రహం చేత వంశం వృద్ధి అవుతుంది. వీటన్నిటికీ కారణమైన స్త్రీలకు మాత్రమే వ్రత పాతివ్రత్య నియమాలను ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది.

అందు చెతనే ప్రత్యేకం ఏ వ్రత పాతివ్రత్య నియమాలు పురుషులుకి లేవు. మంగళగౌరి వ్రతం / వరలక్ష్మీ వ్రతం / సంపద శుక్రవార వ్రతం ఇలా ఎన్నో వ్రతాలు స్త్రీలు మాత్రమే ఆచరిన్చేవిగా ధర్మ శాస్త్రం లో స్త్రీలకు మాత్రమే పాతివ్రత్య నియమాలు పేర్కొనడం జరిగింది.

dharma sandehalu, hindu tradition, Muttaiduva, అయిదోతనము
పిండి దీపారాధన‌ విధానం – విశేష ఫలితాలు
మీ బాబు/పాప గండ నక్షత్రంలో పుట్టారా? లేదా మీ అమ్మాయి దోష నక్షత్రంలో రజస్వల అయ్యిందా???

Related Posts