సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి – సుబ్రహ్మణ్య కటాక్షము

సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి – సుబ్రహ్మణ్య కటాక్షము

  1. సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు జరుపుకోవాలి?
  2. షణ్ముఖుడు సర్పరూపంను ఎప్పుడు దాల్చాడు?
  3. పువ్వులు, పండ్లు, పడగలు స్కందునికి ఎందుకు సమర్పించాలి?
  4. సుబ్రహ్మణ్యస్వామికి ఉన్న వివిధ పేర్లు ఏమిటి?
  5. సుబ్రహ్మణ్యస్వామికి ఏ పూజ చేస్తే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు?

significance-subramanya-shasti-pooja

మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి.

లోకసంరక్షణార్ధం పరమశివుని తేజస్సు నుంచి సుబ్రహ్మణ్యస్వామి వారు అవతరించిన రోజే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి దీపావళి పండుగ తర్వాత విశేషంగా జరిగే ఉత్సవం. దీనినే స్కందషష్ఠి అని, సుబ్బారాయషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ఈరోజు సుబ్రహ్మణ్యుడు అన్ని దేవాలయములలో విశేష పూజలను అందుకొంటారు.

అక్షౌహిణుల సైన్యాన్ని, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి వారిని ఉక్కిరిబిక్కిరి చేసి, భీకరయుద్దము చేసి తారకాశురుని సంహరించాడు కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సంతానం కోసం, శత్రు విజయాల కోసం సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి సమర్పించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం.

వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణమును చూసిన వారికి వివాహములలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాక సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా ఉంది. విశేషించి షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి పాలకావడి( పంచదారతో, పాలతో నిండి ఉండే కుండలు)ని అర్పించినవారికి వంశవృద్ది కలుగునని విశ్వాసం.

సుబ్రహ్మణ్యస్వామికి ఉన్న పేర్లు :
షణ్ముఖుడు – ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు – పరమశివుని స్ఖలనం వల్ల ఆవిర్భావించినవాడు
కార్తికేయుడు – కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు – శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు – శరవణము(తటాకము)లో అవతరించినవాడు గాంగేయుడు – గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి – దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు – శివునకు ప్రణవ మంత్రము ఉపదేశం చేసినవాడు
సుబ్రహ్మణ్యుడు – బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ – తమిళం లో పిలుస్తారు

నమస్తే నమస్తే మహాశక్తి పాణే |
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||
ఒకచేతిలో మహాశక్తి అయుదాన్ని, ఒకచేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొకచేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు అని శరణు వేడినవారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు.

Subramanya Shashti

 

god, hindu tradition, subrahmanya
మార్గశిర లక్ష్మివార వ్రతం | వ్రత విధానం – సమర్పించవలసిన నైవేద్యములు – వ్రత కధ
పోలి స్వర్గం నోము – ప్రాశస్త్యం | పోలిస్వర్గం కధ

Related Posts