స్త్రీలు దీపారాధన చేయాలి అంటే రోజూ తలస్నానం చేయాలా..?

స్త్రీలు దీపారాధన చేయాలి అంటే రోజూ తలస్నానం చేయాలా..?

దీపారాధన చేయాలి అంటే రోజూ తలస్నానం చేయాలా..? అన్నది సాధారణంగా చాలా మంది స్త్రీలకు వచ్చే ప్రశ్న. ఇదే సందేహంతో కొందరు రోజూ దీపారాధన చేయడం మానేయడం కూడా మానేస్తారు. అయితే…

పెళ్లి అయిన స్త్రీలు రోజువారి చేసే నిత్య దీపారాధనకి రోజూ తలస్నానం చేయవలసిన అవసరం లేదు. మాములుగా స్నానం చేసి పాపటిలో కుంకుమ ధరించి నిత్య దీపారాధన, రోజూ చేసుకునే పూజ చేయవచ్చు. స్త్రీల పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుంది. పాపటి లో కుంకుమ ధరించడం వల్ల  గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించిన ఫలితం కలుగును. అందువల్ల పాపటిలో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినట్టు , రోజూ తలస్నానం అవసరం లేదు.

is it necessary to take head bath before lighting diya at home

అయితే ఏదైనా వ్రతం, పూజ, నోము & దీక్ష ఇత్యాదులు ఉన్నపుడు తప్పక తలస్నానం చేసే చేయాలి. సాధారణంగా ఆడవాళ్ళు బుధ, శనివారం, తలస్నానం చేయడం మంచిది.  వ్రతాలు ఉన్నపుడు శుక్రవారం చేయవచ్చు. మైలు / శూతకం ఉన్నపుడు కచ్చితంగా, 1, 3, 4,5, రోజుల్లో తలస్నానం చేయాలి. ఆ సమయంలో తిని, తాగి మిగిల్చింది ఎవరికి పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల తిన్నవారికి పెట్టిన వారికి కూడా ఆర్ధిక ఇబంధులు వస్తాయి, ముఖ్యంగా భర్తకు పెట్టకూడదు.

own house, pooja room, అయిదోతనము, పూజ గది
సంధ్యావందనం ఎలా చేయాలి – కృష్ణ యజుర్వేద సంధ్యావందనం విధి
బ్రాహ్మణ సంస్థాన్ శిక్షణ శిభిరం – పూజ విధానము, స్మార్తము నేర్పబడును

Related Posts