ఇంటి వద్దనే శ్రీ రామనవమి పూజ ఎలా జరుపుకోవాలి…

Loading

how to perform sri rama navami at home

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం గా భూమి మీద చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్తు లగ్నంలో రామచంద్రుడు కర్కాటకరాశి లో జన్మించాడు. చైత్ర శుద్ధ నవమి రోజుని శ్రీ రామనవమి పండుగగా జరుపుకొంటూ శ్రీ సీతా రామ కళ్యాణం మహోత్సవాన్ని చేస్తాము.

ఉగాది తరువాత చైత్రమాసంలో అత్యంత విశేషంగా జరపుకొనే పండుగలలో శ్రీ రామనవమి (Sri Ramanavami Festival) పండుగ మొదటిది. పూర్వకాలంలో కనులారా శ్రీ సీతా రామ కళ్యాణం చూడడం కోసం వేసే తాటాకు పందిళ్ళు, దోసిళ్ళతో వడపప్పు, గ్లాసులతో పానకాలు, విసురుకోవడానికి విసినకర్రలు, కల్యాణంకి వచ్చే ముత్తయిదువులకు ఇచ్చే తాంబూలాలతో అత్యంత కోలాహలంగా జరిగేవి. అయితే ప్రస్తుత రోజుల్లో అవన్నీ మాటలవరకే పరిమితం అగుచున్నవి.

Please submit the below form to get the Puja Vidhanam.

ఇంటి వద్దనే శ్రీ రామనవమి పూజ ఎలా జరుపుకోవాలి?

అనేక కారణాలతో దేవాలయాలకు వెళ్ళలేని, శ్రీరామనవమి పూజ చేయించుకోలేని వారు సంప్రదాయ పద్ధతిలో తమ ఇంటి వద్దనే శ్రీ రామనవమి పూజ ఎలా జరుపుకోవాలి [How to Perform Sri Rama Navami Puja at Home] అన్నది ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగినది.

  • శ్రీ రామనవమి ఉదయమే లేచి ఇంటిని శుబ్రంచేసి, రంగవల్లులతో, మామిడి తోరనములతో అలంకరించాలి.
  • శిరస్సున స్నానం చేసి, శుబ్రమైన వస్త్రాలు ధరించి, రామపట్టాభిషేకం ఉన్న ఫోటో లేద రామ సీత లక్మణుడు ఆంజనేయుడు దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి.
  • పీటను అలంకరిచి, రంగవల్లె వేసి నూతన వస్త్రాన్ని పరచి విగ్రహాలను లేదా పటములను ఉంచవలెను.
  • యధాశక్తిగా శ్రీ సీతారామచంద్ర స్వామి షోడశోపచార పూజ చేసి పానకం, చనివిడి, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి.
  • తదనంతరం, నీరాజనము ఇచ్చి వచ్చిన బంధువులకు ప్రసాదం పెట్టి తాంబూలమును ఇవ్వాలి.

Please submit the below form to get the Puja Vidhanam.

ఇంట్లోనే శ్రీ సీతారామ కళ్యాణం జరుపుకోవడం ఎలా?

కళ్యాణం ఆనవాయి ఉన్నవారు, తమలపాకు వక్కను దేవుడి పటం వద్ద పెట్టి కుడుకలో తేనె పెరుగు దేవుడి పటం వద్ద ఉంచి అక్షింతలు పూలు పట్టుకొని రాముడి ధ్యానం చేసి ,”రామయా రామ భద్రయా రామ చంద్రయ వేదసే రఘు నాథయా నాథయా సీతాయ పతయే నమః” అని అక్షింతలు పూలు వేసి మా ఇంట్లో కల్యాణం జరుపుకోమని ఇంటికి రమ్మని ప్రార్థన చేసి నట్లుగా భావన చేసి, జీలకర్ర బెల్లం ఇద్దరి తల పైన పెట్టి మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఆభరణాలు (మంగళ సూత్రం కాక) నల్లపూసలు లేదా బంగారు ఆభరణాలు లేదా పసుకుకొమ్ము వేసి నమస్కరించి, పండ్లు లేదా పొడిసీర లేదా రాముడికి బెల్లం పానకం వడ పప్పు నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. తరువాత ఒడిబియ్యం కలిపి ఉంచి, పండ్లు అయిదు కుడుకలు ఒడి బియ్యంని ఫోటో ముందు పరిచిన వస్త్రంలో పోసి సమయం ఉన్నప్పుడు శ్రీ రామ గుడిలో సమర్పించండి.

Please submit the below form to get the Puja Vidhanam.

lord rama, ram navami, Sri Rama Navami
శ్రీ రామనవమి కళ్యాణ పూజ సామాగ్రి జాబితా
శ్రీ రామనవమి కళ్యాణ ప్రవరలు | శ్రీరామచంద్ర స్వామి, సీతా అమ్మవార్ల గోత్ర ప్రవరలు

Related Posts

Comments