ఉగాది వృషభ రాశి ఫలితాలు 2024-2025

ఈ క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి [Sri Krodhi Nama Samvatsara Vrushabha Rasi Phalalu 2024-25] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

 • ఆదాయం – 02, వ్యయం – 08
 • రాజపూజ్యం – 07, అవమానం – 03

ఎవరెవరు వృషభ రాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు వృషభరాశి లోకి వస్తారు.

 • కృత్తిక 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ)
 • రోహిణి 1,2,3,4 పాదములు,(ఓ,వా,వీ,వూ)
 • మృగశిర 1,2 (వే,వో) పాదములు

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వృషభ రాశి ఫలాలు [Vrushabha Rasi Phalalu 2024-25] ఈ కింది విధంగా ఉన్నాయి.

వృషభరాశి రాశి ఫలాలు 2024-25

ఈ రాశి వారికి ఈ సంవత్సరములోగ్రహముల దోషకాలములు

 • రవి : 14-4-2024 నుండి 14-6-2024 వరకు ద్వాదశం, జన్మం, 17-8-2024 నుండి 16-9-2024 వరకు అర్ధాష్టమం, 16-12-2024 నుండి 14-1-2025 వరకు అష్టమం
 • కుజుడు 2-6-2024 నుండి 26-8-2024 వరకు ద్వాదశం, జన్మం.
 • గురుడు : ఈ సం|| అంతా జన్మం.
 • శని : ఈ సం॥రం అంతా శుభుడే.
 • రాహువు : ఈ సం|| అంతా శుభుడే,
 • కేతువు : ఈ సం॥ అంతా శుభుడే.

ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి, ధనము సంపత్తు కుటుంబ
మునకు కారకుడైన గురుడు జన్మంలో కలసినందున సప్తమంలో శని రాజ్యస్థా
నంలోఉండుట. ఈ గ్రహ సముదాయబలంచే జీవితంలో ఎంచదగిన కాలముగా  ఉండును. అయినాశుభాశుభఫలితములేఇచ్చును. సంసారజీవితంలో ఆనందము. ఉత్సాహప్రోత్సాహములు, మనోనిశ్చితకార్యములు నెరవేరుట జరుగును. స్థిరాస్తిని వృద్ధిచేయుట, భూగృహ జీవితానందము, పదవులు, బహుమానములు పొందుట, అధికార అనుగ్రహం స్త్రీమూలకలాభం, అన్యస్త్రీ లాభములు, విలువైన వస్తువులు కొనుట, కొన్ని విషయాలలో అపనిందలు, అపవాదులు ఎదుర్కొనవలసి వచ్చును. ఆకస్మిక నిర్ణయాలు వల్ల బుద్ధి చాంచల్యం తేజోనాశనం. ఇతరులు వల్ల మోస పోవుటయు, ఆందోళన, ధననష్టం, బంధుజనులు వలన దుఃఖము, మాతృవంశ సూతకములు, వాహన ప్రమాదాలు తప్పవు. విదేశీ ప్రయాణాలున్న వార్కి అనుకూలత త్వరగా వీసాలభించును. నూతన వ్యాధులు, భయాందోళన కలిగించు సంఘటనలు, ప్రయాణములందు ఆరోగ్యభంగములు, అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్యభంగములు, ఆపరేషన్ జరుగుట, వృధాగా కాలక్షేపం చేయుట మనోదుఃఖాలు, సోదరమూలక విరోధాలు, నేత్ర, ఉదర, సంబంధవ్యాధులు, – మిత్రవిరోధాలుకలుగును. కుటుంబంలో వివాహాదిశుభకార్యాలు తప్పక జరుగును.

ఈ సం॥రం ఉద్యోగులకు, యోగకారకగ్రహాల వల్ల విదేశాలలో ఉద్యోగా దులు చేయువారికి మంచి యోగము. విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నములు చేయువార్కి మంచి ఫలితాలుపొందగలరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తప్పవు. అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబమునకు దూరంగా ఉండవలసివచ్చును. నిరుద్యోగులకు ఈ సం॥రం కొంత ఆశాజనకంగా కన్పించును. పర్మినెంట్ కానివార్కి పర్మినెంటు అగును. ప్రవేటుసంస్థలలో పనిచేయు వారికి వేరొక కంపెనీలకు మారుదురు. అన్నిరంగాలఉద్యోగులకు గృహమార్పులు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండును. ప్రజలలోనూ, అధిష్ఠానము వారితోనూ గౌరవం పొందుదురు. కనీస పదవులు లభించును. ఉన్నత పదవులు లభించును. ప్రజలలోగుర్తింపు, ధనంమంచినీళ్ళవలెఖర్చు. ఎన్నికలలో విజయం సాధించుదురు. మీతోతిరిగిన వారే మీకు అన్యాయం చేస్తారు. జాగ్రత్తగాఉండాలి.

ఈ సం||రం కళాకారులకు కొంత ఫర్వాలేదు. శుభా శుభ మిత్రమ ఫలితాలు, ప్రభుత్వసంబంధ అవార్డులు, రివార్డులు, పొందుట కష్టమే. చివరినిమిషంలో చేజారిపోవును. సినిమా సినిమా టీవి. టీవి. నాటక రంగములలో ఉన్న గాయనీ, గాయకులు, కవులకు, సంగీత కళాకారులకు నూతన అవకాశములు అంతంత మాత్రమే. ఈ సం||రం అన్నిరకాల వ్యాపారులకు బాగుండును. హోల్సేల్, రిటైల్రంగంలో ఉన్నవార్కిబాగా అనుకూలించును. నూతనవ్యాపారాలు ప్రారంభిస్తారు. జాయింటు వ్యాపారులకు నష్టాలు తప్పవు. సరుకులు నిల్వచేయు వారికి పట్టిందల్లా బంగారమా? అనునట్లుండును. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రమే. బిల్డర్స్ వివిధ కాంట్రాక్టుదారులకు అనుకూలత, నూతన కాంట్రాక్టులు లభించును. ఈ సం||రం విద్యార్ధులకు సామాన్య ఫలితాలు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఆశించిన మార్కులు పొందలేదు. బద్ధకం, చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు, చెడు సావాసాల వల్ల నష్టాలు, విదేశీ ప్రయాణాలుకలసివచ్చును. ఇంజనీరింగ్, మెడికల్ బి.ఇడి, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్సు పరీక్షలు వ్రాయువారు కావలసినసీట్లును పొందలేరు. క్రీడాకారులకు కొంతమేలుజరుగును. ఈ సం||రం శని వల్ల రెండు పంటలు మంచి దిగుబడి వచ్చును. అయినా ఆశించినంత ఆదాయం రాదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్లే అంది చేజారిపోవును. ఋణాలుతీర్చలేరు. కౌలుదార్లకు మరింత కష్టతరం. ప్రభుత్వ సహాయాలు అందవు. చేపలు, రొయ్యలు చెరువులు వారికి ఈ సం॥రం మిశ్రమ ఫలితాలు. అంతగా నష్టం ఉండదు. ఫౌల్ట్రీవావారికి కొంత మెరుగ్గా ఉండును.

స్త్రీలకు :- ఈ సం॥స్త్రీలకు అనుకూలంగా ఉండును. భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయభేదాలు వచ్చినా మీదే పైచేయి. కొన్నివస్తువులు చేజారిపోవును. పోగొట్టు కొంటారు. సంతానం వల్ల ఇబ్బందులు. గర్భ సంబధమైన వ్యాధులు, కోర్టువ్యవహా రాలలోజయం. ఉద్యోగాలుచేయుచున్న వారికి అధికారులు వల్ల ఇబ్బందులు. కుటుంబంనకు దూరంగా ఉండవలసి వచ్చును. వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు వచ్చును. స్త్రీ సంతానము కల్గును. మొత్తంమీద ఈరాశి స్త్రీపురుషాదులకు  శుభాశుభమిశ్రమఫలితాలువచ్చును. కొంతమందికి అనుకూలత. మరికొంతమందికి నిరుత్సాహం. ఎంత ప్రతిభ కనపరచినా ఫలితంఉండదు. మీశక్తి సామర్థ్యములు ఏమాత్రం పనిచేయవు. మీరు ఏ పని తలపెట్టినా చాలా శ్రమ పడి విజయం సాధిస్తారు. కష్టంఎక్కువ.

చేయవలసిన శాంతులు:-మంగళ, గురు, వారనియమాలు పాటించాలి. గురునికి జపం,దానం,హోమాలుచేయాలి. శ్రీశైలక్షేత్రదర్శనం మంచిది. మీ గ్రామంలోగల శివాలయంలో అభిషేకాలుచేయించుకోండి. గురుగ్రహ, నరఘోషయంత్రాలు ధరించినమంచిది.

ఏప్రియల్ :-ఈనెలలో ప్రథమార్థం అన్నివిధాలుగా యోగించును. చేయువృత్తి వ్యాపారాలందు రాణింపు. ఆరోగ్యంబాగుండును. ఆదాయంనకు లోటుండదు.
ధైర్యంతోముందుకు పోగలరు. వాహనసౌఖ్యం, బంధుమిత్రాదులతో సఖ్యత, సంతాన సౌఖ్యము, శత్రువులపై జయం, కుటుంబ సౌఖ్యం, నూతన పరిచయాలు.

మే:- ఈ నెలలో ఆదాయంనకు మంచిన ఖర్చులు, ఆరోగ్య భంగములు, నేత్ర శిరోపీడలు, ఒక ముఖ్య సమస్య వేధించుట వలన భయభ్రాంతులగుదురు. స్త్రీమూలకంగా లాభములు. సంతానం వలన ప్రయాణములు చేయవలసి వచ్చును. కొన్ని విషయాలలో అవమానములు అపనిందలు తప్పవు.

జూన్ :- అన్నిరంగాలవార్కి అన్నివిధాలుగాబాగుండును. చేయు వృత్తివ్యాపారాలు బాగా కలసివచ్చును. ఆరోగ్యలాభములు ఆదాయం బాగుండును. స్పెక్యులేషన్ రాణింపు, ధైర్యంగా ప్రతీ విషయంలో మాట్లాడి ముందుండుట, కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం. ప్రయాణములలో లాభించును. సంఘంలో ఉన్నత స్థితి కల్గును.

జూలై :- ఆరోగ్యంబాగుండును. ఆదాయంనకు లోటుండదు. రావలసిన బాకీలు
వసూలుఅగును. ధైర్యంగాపనులుచేస్తారు. గృహసంబంధమైనకార్యాలు అనుకూలించుట, కుటుంబ సౌఖ్యం, వాహన లాభం, సంతాన సౌఖ్యం, పెద్దవారితో పరిచయాల, తీర్ధయాత్రా ఫలప్రాప్తి, స్పెక్యులేషన్లో అనుకూలత. ఆందోళనలు.

ఆగష్టు :- ఈనెలలో అన్నివిధాలుగాయోగమే. గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందున చేయు వృత్తివ్యాపారాలందు అనుకూలత. గతంలోఉన్న సమస్యలు పరిష్కారమగుట. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరవార్తలు, ప్రయాణ సౌఖ్యం, వాహనసౌఖ్యం, నూతన పరిచయాల వల్ల పనులుపూర్తిఅగుట.

సెప్టెంబర్ :- అన్నిరంగాలవారికియోగమే. హుషారుగా, ఆనందంగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. పీఠాధిపతులను పెద్దవారిని కలుసుకొంటారు. నూతన వస్తు, వస్త్రప్రాప్తి, వీలువైన వస్తువులను కొంటారు. సంతానం ద్వారా సౌఖ్యం, భార్యాభర్తలమధ్య అవగాహన బాగుండి సుఖమైన జీవితం లభించును.

అక్టోబర్:- ఈనెలలోకొన్నిఇబ్బదులుతప్పవు. శారీరకంగా మానసికంగా సమస్య లుంటాయి. బంధుమిత్రులతోవిరోధాలు, ఆరోగ్యభంగాలు,ఊహించని సంఘటనలు జరుగును. కొంతమంది మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అవమానించెదరు. ఉద్యోగు లకు ఆకస్మిక బదిలీలు. మాసం మధ్య నుండి పరిస్థితులు అనుకూలించును.

నవంబర్ :-ఈనెలలోమిశ్రమఫలితాలుఉండును. ఆర్ధికంగాబాగుండును. ఆరోగ్య భంగములు, ఔషధసేవ, శారీరక పీడలు, అకాలభోజనములు, స్థానచలనములు, గృహమార్పులు, సంతానసౌఖ్యం, ప్రయాణములందు ఇబ్బందులు, మాటామాటా పట్టింపులు తప్పవు. ప్పవు. ద్వితీయార్ధంలో కొంత ఫర్వాలేదు. స్పెక్యులేషన్ లాభించును.

డిశంబర్ :- ఈనెలలో 8వఇంట గ్రహసంచారంవల్ల కొంతమేర నష్టంకలిగిం చును. ఆరోగ్యరీత్యాకూడాఇబ్బందులు. పనులందుఅలసట, కొన్నిపనులు మధ్యలో నిలచిపోవుట, బంధుమిత్రులతో అకారణవిరోధాలు, ప్రయాణాలందు సమస్యలు, శత్రువులువల్ల నష్టములు వస్తువులు పోగొట్టుకొనుట, కార్యములందు అపజయం.

జనవరి :-అన్నిరంగాలవారికి అన్నివిధాలుగాబాగుంటుంది. చేయువృత్తివ్యాపారా దులు బాగాసాగును. ఆర్థికంగా అనుకూలత, ఆరోగ్యలాభం, దూరప్రయాణాలు, బంధుమిత్రులతోకలయిక, విందులు, వినోదాలు, నూతనవస్తు, వస్త్రప్రాప్తి, వాహన సౌఖ్యం,ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు.

ఫిబ్రవరి :- గ్రహముల అనకూల సంచారము వలన మీమాటకు ఎదురులేదు. అన్నింటా మీదే పైచేయి. గృహంలో శుభకార్యాలు జరుగును. కోర్టు వ్యవహారములు మీకు అనుకూలత. విలువైన వస్తు ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమము. పెద్దవారితో పరిచయాలు, సంతాన సౌఖ్యం, కుటుంబంలో సౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, స్పెక్యులేషన్ లాభం. అన్నివర్గాలవార్కి అనుకూలము.

మార్చి :- ఈ నెలలోకూడా అనుకూలంగా ఉంటుంది. అనుకున్నపనులు చాలా సులువుగా పూర్తిచేయగలరు. వివాహాది శుభకార్యాలకు హాజరగుట, సంతాన్త సౌఖ్యం, శత్రువులపై ఆధిక్యత, రావలసిన బాకీలు వసూలగుట కొన్ని విషయాలలో మధ్యవర్తిత్వం వల్ల సమస్యలు తొలగిపోయి మంచి పేరు ప్రఖ్యాతలు, స్పెక్యులేషన్ అనుకూలత. గృహనిర్మాణ పనులు, వాహనములు కొంటారు. సంతానం పరీక్షలు బాగా వ్రాయుదురు. గతంలో ఉన్న సమస్యలు తొలగి ఉల్లాసంగా జీవిస్తారు.