కరోనా లాక్ డౌన్ బాధిత బ్రాహ్మణ పురోహితుల సహాయార్ధం…

కరోనా లాక్ డౌన్ బాధిత బ్రాహ్మణ పురోహితుల సహాయార్ధం…

భగవదనుగ్రహం తోటి, భగవంతుడు మాకు (దాతలకు) ఇచ్చినటువంటి దానిలో స్వచ్ఛందంగా మానవ సేవకు కొంత మూల్యాన్ని ఉపయోగిద్దాం అనే ఆలోచన తోటి, కరోనా వైరస్ లాక్ డౌన్ (#COVID19) కారణంగా ఎటువంటి కార్యక్రమం చేసుకోవడానికి వీలులేని, రోజు కూడా గడవడానికి ఇబ్బంది పడే అర్హులైన (బ్రాహ్మణ) పురోహితులకు సహాయపడాలి అని మా ఉద్దేశ్యం.

కరోనా లాక్ డౌన్ బాధిత పురోహితులకు ఆర్ధిక సహాయాన్ని పునఃప్రారంభించినాము అని తెలియ పరచుటకు సంతోషించుచున్నాము. తగు యజమానులు, మిత్రులు మరలా విరాలములతో ముందుకు రావటం వల్లననే ఇది సాధ్య పడినది. వారికి ఎల్లప్పుడూ మా సాంజలిబంధక నమస్కారములు.

ప్రస్తుతం హైదరాబాదు లో పురోహితులకు  మా తరఫున సహాయం అందించుట పూర్తి అయినది కావున, హైదరాబాదు ప్రాంతానికి చెందని ఇతర ప్రాంత పురోహితులు వివరములు అందించవచ్చును.

పూర్తి సేవా దృక్పథంతోటి మేము చేసే ఈ సేవను మీరు పొందుటకు అర్హులు అని భావించి ప్రగాఢ విశ్వాసంతో మీకు సహాయం చేయుటకు ఆసక్తి చూపుతున్నాము.

***ఈశ్వరానుగ్రహం తో చేసే ఈ కార్యక్రమ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీ వివరాలు యజమానులకు చేయవేయబడతాయి. నిర్ణయం దైవాధీనం.

పురోహితులకు విజ్ఞప్తి!!! అనుకున్న దానికన్నా అధిక సంఖ్యలో పురోహితులు సహాయానికి నమోదు చేసుకోవడం వల్ల, నమోదు చేసుకున్న పురోహితులకు సహాయం చేయడంలో నిమగ్నమైన ఉన్నాము. కొత్త నమోదులు పూర్తిగా నిలిపివేసినాము.

శ్రీ గర్భరక్షా స్తోత్రం / శ్రీ గర్భ రక్షాంబికా స్తోత్రం
రాముడు పాదుకలను మాత్రమే రాజ్యపాలన కోసం ఎందుకు ఇచ్చాడు?

Related Posts