కుంకుమ/తిలక ధారణం – కుంకుమ వైశిష్ట్యం

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

  1. నుదుటిన కుంకుమ/తిలకం ధరించడం ఎందుకు?
  2. ఏ యే సందర్భాలలో కుంకుమ/తిలకంను ధరిస్తారు?
  3. లలాటమున కుంకుమ/తిలకంను ధరించుట వలన ప్రయోజనమేమి?

సహజంగా ప్రతి రోజు స్నానము చేసిన తరువాత మరియు ప్రత్యేక సందర్భాలలోనూ, పూజ చేసే ముందర, తరువాత, లేక దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు తప్పక కుంకుమ పెట్టుకుంటారు. దైవభక్తి గల భారతీయులు ప్రత్యేకించి వివాహితులు అయిన స్త్రీలు నుదిటి మీద తిలకము లేదా తిలకం పెట్టుకొంటారు. చాలా తెగలలో వివాహితులైన స్త్రీలు ఎల్ల వేళలా నుదుటన కుంకుమ పెట్టుకొనే కనిపించాలనే ఆదేశము ఉంది. మహాత్ములకు మరియు దైవ ప్రతిమలకు ఆరాధనా సూచకంగా కుంకుమ/తిలక ధారణ జరుపుతాము. వైదిక పద్దతులను ఆచరించే వారు మంత్ర ప్రార్ధనలతో కుంకుమ ధరిస్తారు. తిలకము వేరు వేరు రంగులలోను, రూపాలలోను ఉంటుంది.

నుదుటి పైన తిలకం – ధరించిన వారిలోనూ, ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది. దైవ చిహ్నము గా గుర్తించ బడుతుంది.

మునుపటి కాలములో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు. పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణుడు తన స్వభావమైన పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాడు. క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియుడు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుట ధరించే వాడు. వర్తక వాణిజ్యాల ద్వారా సంపదను పెంపొందించే వైశ్యుడు అభ్యుదయానికి అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవాడు. శూద్రుడు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించెవాడు.

విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్నీ, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్నీ, దేవీ భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు.

tilakam

మన శరీరము మొత్తము ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. కుంకుమ లేక తిలకం మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది.కుంకుమకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందీలు అలంకార ప్రాయమే కానీ నిజమైన ప్రయోజనాన్ని కలిగించవు.

భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము ప్రసాదముగా స్వీకరించబడిన తరువాత మన నుదుట పెట్టబడుతుంది. జ్ఞాపక శక్తికి మరియు ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య నున్న ప్రదేశములో తిలకము పెడతాము. యోగ పరిభాషలో ఈ ప్రదేశము ఆజ్ఞా చక్రముగా చెప్పబడుతుంది. నేను భగవంతుని గుర్తున్చుకొండును గాక! ఈ భక్తీ భావన నా అన్ని కార్య కలాపాలలోనూ వ్యాపించుగాక! నేను నా అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందును గాక! అనే ప్రార్ధనతో తిలకము పెట్టుకోబడుతుంది. మనము ఈ ప్రార్ధనాయుతమైన వైఖరిని తాత్కాలికముగా మరచిపోయినా, ఇతరుల నుదుటి పైనున్న తిలకం మనకు వెంటనే మన ప్రార్ధనను గుర్తుకు చేస్తుంది. అందుకే ఈ తిలకము మనకు భగవంతుని ఆశీర్వాదము మరియు అధర్మ ప్రవర్తనలనుంచి, వ్యతిరేక శక్తుల నుండి రక్షణ వంటిది.

హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి |
లలాట లిఖితా రేఖా పరిమార్ష్టుం నశక్యతే ||

పూర్వ జన్మమునకాని, ఈ జన్మలోనే కాని మనము చేసుకొన్న కర్మఫలములే మన సంపాదనగా మన వెంట నంటి ఉంటాయి. దానినే పెద్దలు నుదుటి వ్రాత అంటారు. దానినెవరో మనకివ్వలేదు.మనం సంపాదించుకొన్నదే. దానిని ఎవ్వరూ మార్చలేరు. అనుభవింప వలసినదే కానీ నుదుటన కుంకుమ/తిలకంను లేదా విభూతిని ధరించినప్పుడు మనకు భగవంతుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మనలలాటం పై లిఖించిన వ్రాత ఈశ్వరుని కరుణ వలన తొలగి మన బాధలు నశిస్తాయి. కనుక ప్రతి వారు ప్రాతఃకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, ఫాలభాగంపై విభూతినిగాని, తిలకాన్ని గాని, ధరించి దేవతారాధన చేసి భగవంతుని కృపకు పాత్రులై దినచర్యలకు సమాయత్తం కావాలి.

భారతీయులకు ఈ ఆచారము చాలా అపూర్వమైనది. మరియు ఎక్కడ ఉన్నా సులభంగా మనల్ని గుర్తించడానికి సహాయపడుతుంది.

మనశ్శాంతి లేదా? చిత్తశుద్ధి కలగడం లేదా?
పురాణేతిహసముల ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు

Related Posts

No results found.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.