ఫాల్గుణ మాసం తెలుగు సంవత్సరంలో పన్నెండవ నెల. మాఘమాసం తర్వాత వచ్చే మాసమే ఫాల్గుణ మాసం. చంద్రుడు ఈ మాసంలో పూర్వ ఫల్గుణి నక్షత్రంతో కూడుకొని ఉంటాడు కాబట్టి ఫాల్గుణమాసం అని అంటారు. ఈ ఫాల్గుణమాసం శ్రీ మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. మహా శివరాత్రితో చలి పూర్తిగా తగ్గిపోయి, ఎండలను పరిచయం చేసే సమయం ఈ ఫాల్గుణం. ఈ మాసంలో వివాహాలు, గృహాప్రవేశాలు, శంఖుస్థాపనాలు, ఉపనాయనాలు వంటి శుభకార్యాలు తలపెట్టడం చాలా శ్రేయోదాయకం.
ఫాల్గుణ మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates In The Month Of March 2025
![]()
ఫాల్గుణ మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates In The Month Of March 2025
ప్రత్యేకించి ఫాల్గుణ మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు అత్యధికంగా ఉంటాయి. కావునా యాజమానుల, కార్యక్రమం చేయించే పురోహితులను దృష్టి యందు ఉంచుకొని ఫాల్గుణ మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు అన్నిటినీ ఒకచోట సమకూర్చి ఉవ్వడం జరిగినది. అందరూ ఈ శంఖుస్థాపన ముహూర్తాలను గమనించి, మీకు ఎంతవరకు అవి సరిపడుతాయో యోగ్యులయిన పండితులచే నిర్ధారణ చేసుకోగలరు.
Get Muhurtham Dates via Email or WhatsApp
Related
ముహూర్తం అంటే ఏమిటి ?
పురాతన కాలం నుండి, హిందువుల వివాహాలు, గృహప్రవేశం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, నామకరణం, అన్నప్రాసన, ఉపనయనం మొదలైన ముఖ్యమైన కార్యక్రమాలు లేదా కార్యక్రమాలను నిర్వహించడానికి మంచి రోజు మరియు సమయాన్ని ఎంచుకునే సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దీనిని ముహూర్తం అంటారు. జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఒక నిర్దిష్ట శుభకార్యానికి తగిన రోజు మరియు సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది.
హిందూ పంచాంగం లో ఒకరి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి రోజువారీ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే ప్రధాన కార్యక్రమాలకు ముహూర్తాలు ఉన్నాయి. రాహుకాలం, వర్జ్యం, యమగండ, దుర్ముహూర్తం వంటివి లేని సమయాలు చాలా మంది హిందువులు ఇప్పటికీ రోజువారీ అనుసరించే విధానాలు. ముహూర్తం అనేది కాలాన్ని కొలిచే వేద ప్రమాణం. 24 గంటల పగలు+రాత్రి 30 ముహూర్తాలను కలిగి ఉంటుంది. ఒక్కో ముహూర్తం 48 నిమిషాల పాటు ఉంటుంది.
ముహూర్తాలను ఎలా నిర్ణయిస్తారు?
ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా తారా బలం, చంద్ర బలం, లగ్న బలం, పంచక రహితం మొదలైన విషయాలు గమనించాల్సి ఉంటుంది. వీటి తో పాటు చివరిగా ఆయా కార్యక్రమాలనిర్ధారణ చేసే సమయంలో ఉండే తిథి, వార, నక్షత్ర, యోగ ములను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథి, వారములు మధ్యస్థముగా ఉన్ననూ ముహూర్తము నిర్ధారణ చేయవచ్చును.
అయితే ఏ ముహూర్తం చూసినా, ఆయా కార్యక్రమానికి సంబంధించిన యోగ్యమైన లేదా నిర్దేశించబడిన శుభ నక్షత్రాలను, యజమానులు జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రముకు సరిచూసి ముహుర్తములను నిర్ణయింపవలెను.
మీ యొక్క శుభకార్యాలకు ముహూర్తము నిర్ణయింపవలెనన్నా లేదా మీకు సరైన ముహూర్తము కావలేనన్నా మమ్మల్ని సంప్రదించగలరు. పురోహిత్యము, జ్యోతిష్య శాస్త్రంలో 25 సంవత్సరాలు అనుభవం కలిగిన పండితులచే మీ జన్మ లేదా నామ నక్షత్రాలు బట్టి మంచి ముహుర్తాలు నిర్ణయించగలము.
Download ఫాల్గుణ మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates In The Month Of March 2025
Bhumi Puja Dates in March Month, Bhumi Puja Dates in Phalguna Masam, Bhumi Puja Muhurtham Dates 2026, Muhurtham Dates in March 2026, Muhurtham Dates in Phalguna Masam, Sankusthapana Dates in 2026, Sankusthapana Muhurtham Dates in 2026

ఫాల్గుణ మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates In The Month Of March

మార్గశిర మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates in the Month of December
Related Posts
Related Posts
Recent Posts
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
- హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు








