స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా? తిరిగితే ఏమవుతుంది???

స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా? తిరిగితే ఏమవుతుంది???

Loading

spiritual effect of women leaving their hair loose

స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా? తిరిగితే ఏమవుతుంది???

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు (స్త్రీలు) తలస్నానం చేసి జుట్టుని విరబోసుకొంటున్నారా?  జడని అల్లుకోకుండా జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్తున్నారా??? అయితే కింది సమాచారం తపకుండా చదవండి.

  1. స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా?
  2. స్త్రీ జుట్టు విరబోసుకొని తిరిగితే ఏమవుతుంది?
  3. పురుషులు పొడుగ్గా పెంచుకొనే జుట్టుకి ఏ నియమమైన ఉందా?
  4. స్త్రీలు బ్రహ్మహత్యాపాతకాన్ని పంచుకున్నందుకు ఇంద్రుడు ఇచ్చిన వరమేమిటి?
  5. స్త్రీ దేవతలు కేశములను పూర్తిగా వదిలినట్టుగా ఫోటోలు ఉంటాయి కదా మరి వాటి సంగతి ఏమిటి?
  6. భారతీయ మహిళల సాంప్రదాయ కేశాలంకరణలు ఏమిటి?

spiritual effect on women leaving their hair loose

తలస్నానం చేసిన తర్వాత  స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు. తలంటు స్నానం చేసిన స్త్రీల యొక్క జుట్టు విరబోసుకొని ఉంటే సమస్తమైన భూత ప్రేతాది శక్తులు కేశపాశముల గుండా ప్రవేశిస్తాయి. ఎట్టి పరిస్తితులలో తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు. స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్ట గ్రహాలు ఆవహించి, స్త్రీలలో కామలక్షణములను ప్రేరేపిస్తాయి. అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పురుషుడికి ఆ స్త్రీ మీద కామం కలుగుతుంది. 

is loose hair good or bad for womens
తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కొసలను ముడివేసుకొని పూజ/దైవదర్శనం చేయాలి. విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడంకానీ,  శుభకార్యాల్లో పాల్గొనడం అశుభం. ఆవిధంగా చేసినచో, లక్ష్మిదేవి అక్క అయిన జ్యేష్ట దేవిని(దరిద్ర దేవత) ఆహ్వానించినట్లే.

దీనికి ఉదాహరణే రామాయణంలో దితి జుట్టుని విరబోసుకొని, బాగా అలసిపోవడం చేత శిరస్సు కొంచెం ముందుకి వంగి, జుట్టు పాదాలకి తగిలి సౌచం పోయి ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కలు చేయడమే.

Women with hair knot

పురుషులు కూడా జుట్టుని పొడుగ్గా పెంచుకోవడం లేదా మహర్షులు జటలు పెంచుకొంటారు కదా? వాళ్లకు ఈ నియమం వర్తించదా?

ఈ విధంగా చాలా మంది నాస్తికులకు ఒక సందేహం కలుగుతుంది. పురుషులు/మహర్షులు పెంచుకొనే జుట్టుకు నియమంలేదు ఎందుకంటే, కేశములను విరబోసుకొనే స్త్రీలకు మాత్రమే అధికంగా కామోపభోగాన్ని ప్రేరేపించే శక్తి ఉంది. అది ఇంద్రుడు స్త్రీలకు ఇచ్చిన వరం.

వృత్తాంతం:

ఒకనాడు బ్రహ్మజ్ఞానం కలిగిన విశ్వరూపుడు అను మహర్షి తనమన భేదాలు లేకుండా దేవతలకి ఇచ్చే హవిస్సులలో కొంతభాగం రాక్షసులకు ఇస్తున్నాడనే విషయం తెలుసుకొన్న ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ మరచి తన చంద్రహాసంతో విశ్వరూపుని మూడు శిరస్సులను(సురాపానం, సోమపానం,అన్నం తింటున్న శిరస్సు) నరికి వేస్తాడు.

Lord Indra brahma hatya dosha pariharaఅనంతరం సురాపానం చేసే శిరస్సు ఆడాపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది. అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్ట(తీతువు పిట్ట)గా మారిపోయాయి. ఆ మూడు పక్షులు ఇంద్రుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని సూచిస్తాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లొ రొదగా ఉండేవి. వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి, భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావుభాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు.

భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లుగా, వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతటతాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాలయందు కొద్దిపాళ్ళు ఎక్కువసుఖాన్ని ప్రసాదించాడు. బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రాలు), నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం. అందుకని కేవలం స్త్రీలకు మాత్రమే జుట్టు విరబోసుకు తిరగడం నిషిద్ధం.

స్త్రీ దేవతలు అందరూ కేశములను పూర్తిగా వదిలినట్టుగా ప్రతిమలు, ఫోటోలు, మూర్తులలో ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏమిటి?

ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపము. సత్వ,రజో,తమో (స్త్రీ)గుణములు ఆమె యందు ఉండవు. అమ్మవారు కామారి(కామాన్ని హరించేది). కాబట్టి  స్త్రీ దేవతలకు ఈ నియమం వర్తించదు.

Goddess with loose hair

అందుచేత ఛాందస్సవాదులు ఇటువంటి ప్రశ్నలని కట్టిపెట్టి శాస్త్రాల్ని అనుసరించండి మంచిది.

భారతీయ మహిళల సాంప్రదాయ కేశాలంకరణలు:

Women with nice hair dress

జడ వేసుకొని ఆలయ దర్శనం చేయుట

tradition of hair dressing

సిగలో(తలలో) పుష్పములను ధరించుట

indian women with knot hair

వృద్ధ మహిళలు సాంప్రదాయంగా కొప్పును వేసుకొనుట

గమనిక: పై సమాచారం కేవలం శాస్త్రంలో చెప్పిన విషయాలను ప్రస్తావన చేసే ప్రయత్నం మాత్రమే.  ఎవరిని విమర్శించి, వారి ఇష్టాయిష్టములను తిరస్కరించుట కొరకు కాదని మనవి.

పూజలో ఉపయోగించే వివిధ వస్తువుల ప్రాముఖ్యత – వాటి అంతరార్థం
ఆలయంలో అర్చకులు/పూజారులు స్త్రీ నుదుటిమీద బొట్టును పెట్టవచ్చా???

Related Posts

No results found.