భగవంతుని ఉపచారములు – రకములు

భగవంతుని ఉపచారములు – రకములు

Loading

భగవంతుడిని పూజించే విశేష ఘట్టములను ఉపచారములు అని అందురు. వీనిలో సంక్షేపం, విస్తారం అని రెండు రకములు కలవు.
లఘువుగా జరుపబడు ఉపచారములను సంక్షేప ఉపచారములని, విశేష రీతిలో జరుపబడు ఉపచారములను విస్తార ఉపచారములని అంటారు. ఐదు, పది, పదహారు, పదునెనిమిది, మప్ఫైఆరు, అరవైనాలుగు అని అనేక విధాలుగా ఉపచారములు ఉన్నాయి.

పంచోపచారాలు– 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం

దశోపచారాలు– 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. గంధం 7. పుష్పం 8. ధూపం 9. దీపం 10. నైవేద్యం

షోడశోపచారాలు– 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. ఆభూషణం 7. గంధం 8. పుష్పం 9. ధూపం 10. దీపం 11. నైవేద్యం 12. ఆచమనం 13. తాంబూలం 14. స్తవపాఠం 15. తర్పణం 16. నమస్కారం

అష్టాదశోపచారాలు– 1. ఆసనం 2. స్వాగతం 3. పాద్యం 4. అర్ఘ్యం 5. ఆచమనీయం 6. స్నానీయం 7. వస్త్రం 8. యజ్ఞోపవీతం 9. భూషణం 10. గంధం 11. పుష్పం 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాల్యం 17. అనులేపనం 18. నమస్కారం

ముప్ఫైఆరు ఉపచారాలు– 1. ఆసనం 2. అభ్యంజనం 3. ఉద్వర్తనం 4. నిరుక్షణం 5. సమ్మార్జనం 6. సర్పిఃస్నపనం 7. ఆవాహనం 8. పాద్యం 9. అర్ఘఅయం 10. ఆచమనం 11. స్నానం 12. మధుపర్కం 13. పునరాచమనం 14. యజ్ఞోపవీతం, వస్త్రం 15. అలంకారం 16. గంధం 17. పుష్పం 18. ధూపం 19. దీపం 20. నైవేద్యం 21. నైవేద్యం 22. పుష్పమాల 23. అనులేపనం 24. శయ్యా 25. చామరం 26. వ్యంజనం 27. ఆదర్శం 28. నమస్కారం 29. గాయనం 30. వాదనం 31. నర్తనం 32. స్తుతిగానం 33. హవనం 34. ప్రదక్షిణం 35. దంతకాష్ఠం 36. విసర్జనం

అరవైనాలుగు ఉపచారాలు– 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆసనం 4. తైలాభ్యంగం 5. మజ్జనశాలాప్రవేశః 6. పీఠోపవేశనం 7. దివ్యస్నానీయం 8. ఉద్వర్తనం 9. ఉష్ణోదకస్నానం 10. తీర్థాభిషేకం 11. ధౌతవస్త్రపరిమార్జనం 12. అరుణదుకూలధారణ 13. అరుణోత్తరీయధారణ 14. ఆలేపమండపప్రవేశం 15. పీఠోపవేశనం 16. చందనాది దివ్యగంధానులేపనం 17. నానావిధపుష్పార్పణం 18. భూషణమండపప్రవేశం 19. భూషణమణిపీఠోపవేశనం 20. నవరత్నముకుటధారణం 21. చంద్రశకలం 22. సీమంతసిందూరం 23. తిలకరత్నం 24. కాలాంజనం 25. కర్ణపాలీ 26. నాసాభరణం 27. అధరయావకం 28. గ్రథనభూషణం 29. కనకచిత్రపదకం 30. మహాపదకం 31. ముక్తావళి 32. ఏకావళి 33. దేవచ్ఛదకం 34. కేయూరచతుష్టయం 35. వలయావళి 36. ఊర్మికావళి 37. కాంచీదాసకటిసూత్రం 38. శోభాఖ్యాభరణం 39. పాదకటకం 40. రత్ననూపురం 41. పాదాంగుళీయకం, హస్తాంగుళీయకం 42. అంకుశం 43. పాశం 44. పుండ్రేక్షుచాపం 45. పుష్పబాణధారణం 46. మాణిక్యపాదుక 47. సింహాసనారోహణం 48. పర్యంకోపవేశనం 49. అమృతాసవసేవనం 50. ఆచమనీయం 51. కర్పూరవటికా 52. ఆనందోల్లాసవిలాసహాసం 53. మంగళార్తికం 54. శ్వేతచ్ఛత్ర 55. చామరద్వయం 56. దర్పణం 57. తాలవృంతం 58. గంధం 59. పుష్పం 60. ధూపం 61. దీపం 62. నైవేద్యం 63. ఆచమనం 64. పునరాచమనం (తాంబూలం, వందనం)

రాజోపచారాలు- షోడశోపచారాలు కాక ఛత్రం, చామరం, పాదుకా, దర్పణం అను ఉపచారములు కూడా కలవు.

Shodasha Upacharam

పురాణేతిహసముల ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు
దర్భ గడ్డి యొక్క ఆవిర్భావం – విశిష్టత

Related Posts

No results found.