శని త్రయోదశి రోజున శని భగవానుని ఎలా ఆరాదించాలి?

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో,నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.
శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు,పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని ,వస్త్ర,ధన,వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త,పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద,పిప్పలా,రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు.
శని కి సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు.
నవ గ్రహాల్లో ఏడో వాడైన శనీశ్వరుడు  జీవరాశులను  సత్యమార్గంలో నడిపించెందుకే అవతరించాడని ప్రతీతి.
శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు.
1. ఉదయానే తలస్నానం చేయాలి.
2. ఆ రోజు మద్యమాంసాలు ముట్టరాదు.
3. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.
శనిగ్రహదోషాల వల్ల బాధపడేవారు
నీలాంజన సమభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం,తం నమామి శనైశ్చరం
అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లుపఠిస్తే మంచిది.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా \”ఓం నమ: శివాయ\” అనే శివపంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
6. ఆరోజు ఆకలి గొన్న జీవులకు భోజనం పెడితే మంచిది.
7. ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
8. ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె తీసుకోకుండా ఉండటం మంచిది.
9.ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.
10.కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.


శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి

“నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్. .
ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్”

చిత్రగుప్తుని నోము విధానం – చిత్రగుప్త పూజ ప్రాశస్త్యం | వ్రత కధ, పూజా సామాగ్రి
గోదా కళ్యాణం ప్రత్యేకత | గోదా దేవి వైభవం

Related Posts

No results found.

Comments