శ్లో|| స్మరం యోనిం లక్ష్మీం త్రితయ మిద మాదౌ తవమనోః
నిధా యైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః|
భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వంత స్సురభి ఘృతధారాహుతి శతైః ||
భావం:
ఓ నిత్యస్వరూపిణి…
త్రిపురసుందరీ-కామబీజమగు ఐం-యోనిబీజమగు హ్రీం-లక్ష్మీబీజం అను ఈ మూటిని (ఐం హ్రిం శ్రీం) కలిపి నిరవధిక మహాభోగరసికులు సకల సిరులను వాంఛిస్తూ చింతామనులనే రత్నాలతో కూర్పబడిన అక్షమాలలను చేతుల్లో ధరించి, కామధేనువు యొక్క నేతి ధారలతో శివాగ్నిలో అనేక ఆహుతులర్పిస్తూ, హోమం చేస్తూ, నిన్ను సేవిస్తూన్నారు.
పై శ్లోకమును రోజుకి 1000సార్లు చొప్పున 45 రోజులు జపించినా సకల ఐశ్వర్యములు సిద్ధించును.
సేకరణ: https://www.panditforpooja.com/blog/mantra-for-aishwarya-siddhi/