జ్యేష్ట మాసం తెలుగు సంవత్సరంలో మూడవ నెల. వైశాఖమాసం తర్వాత వచ్చే మాసమే జ్యేష్ట మాసం. చంద్రుడు ఈ మాసంలో జ్యేష్ట నక్షత్రంతో కూడుకొని ఉంటాడు కాబట్టి జ్యేష్ట మాసం అని అంటారు. ఈ జ్యేష్ఠ మాసంలో సూర్యుని ఉష్ణోగ్రత ఉచ్ఛస్థితిలో ఉంటుంది.ఈ మాసం సూర్యు దేవుని ఆరాధనకు, ఆంజనేయుడి ఆరాధనకు చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వివాహాలు, గృహాప్రవేశాలు, శంఖుస్థాపనాలు, ఉపనాయనాలు, సీమంతం వంటి శుభకార్యాలు తలపెట్టడం చాలా శ్రేయోదాయకం.
జ్యేష్ట మాసంలో పెళ్లి చూపులు ముహుర్తాలు – Marriage Looks Dates in the Month of June
![]()
జ్యేష్ట మాసంలో పెళ్లి చూపులు ముహుర్తాలు – Marriage Looks Dates in the Month of June
జ్యేష్ట మాసంలో పెళ్లి చూపులు ముహుర్తాలు సామాన్యంగా ఉంటాయి. కావునా యాజమానుల, కార్యక్రమం చేయించే పురోహితులను దృష్టి యందు ఉంచుకొని జ్యేష్ట మాసంలో పెళ్లి చూపులు ముహుర్తాలు అన్నిటినీ ఒకచోట సమకూర్చి ఉవ్వడం జరిగినది. అందరూ ఈ పెళ్లి చూపులు ముహూర్తాలను గమనించి, మీకు ఎంతవరకు అవి సరిపడుతాయో యోగ్యులయిన పండితులచే నిర్ధారణ చేసుకోగలరు.
Get Muhurtham Dates via Email or WhatsApp
Related
ముహూర్తం అంటే ఏమిటి ?
పురాతన కాలం నుండి, హిందువుల వివాహాలు, గృహప్రవేశం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, నామకరణం, అన్నప్రాసన, ఉపనయనం మొదలైన ముఖ్యమైన కార్యక్రమాలు లేదా కార్యక్రమాలను నిర్వహించడానికి మంచి రోజు మరియు సమయాన్ని ఎంచుకునే సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దీనిని ముహూర్తం అంటారు. జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఒక నిర్దిష్ట శుభకార్యానికి తగిన రోజు మరియు సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది.
హిందూ పంచాంగం లో ఒకరి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి రోజువారీ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే ప్రధాన కార్యక్రమాలకు ముహూర్తాలు ఉన్నాయి. రాహుకాలం, వర్జ్యం, యమగండ, దుర్ముహూర్తం వంటివి లేని సమయాలు చాలా మంది హిందువులు ఇప్పటికీ రోజువారీ అనుసరించే విధానాలు. ముహూర్తం అనేది కాలాన్ని కొలిచే వేద ప్రమాణం. 24 గంటల పగలు+రాత్రి 30 ముహూర్తాలను కలిగి ఉంటుంది. ఒక్కో ముహూర్తం 48 నిమిషాల పాటు ఉంటుంది.
ముహూర్తాలను ఎలా నిర్ణయిస్తారు?
ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా తారా బలం, చంద్ర బలం, లగ్న బలం, పంచక రహితం మొదలైన విషయాలు గమనించాల్సి ఉంటుంది. వీటి తో పాటు చివరిగా ఆయా కార్యక్రమాలనిర్ధారణ చేసే సమయంలో ఉండే తిథి, వార, నక్షత్ర, యోగ ములను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథి, వారములు మధ్యస్థముగా ఉన్ననూ ముహూర్తము నిర్ధారణ చేయవచ్చును.
అయితే ఏ ముహూర్తం చూసినా, ఆయా కార్యక్రమానికి సంబంధించిన యోగ్యమైన లేదా నిర్దేశించబడిన శుభ నక్షత్రాలను, యజమానులు జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రముకు సరిచూసి ముహుర్తములను నిర్ణయింపవలెను.
మీ యొక్క శుభకార్యాలకు ముహూర్తము నిర్ణయింపవలెనన్నా లేదా మీకు సరైన ముహూర్తము కావలేనన్నా మమ్మల్ని సంప్రదించగలరు. పురోహిత్యము, జ్యోతిష్య శాస్త్రంలో 25 సంవత్సరాలు అనుభవం కలిగిన పండితులచే మీ జన్మ లేదా నామ నక్షత్రాలు బట్టి మంచి ముహుర్తాలు నిర్ణయించగలము.
Download జ్యేష్ట మాసంలో పెళ్లి చూపులు ముహుర్తాలు – Marriage Looks Dates in the Month of June
Marriage Looks Dates in 2025, Marriage Looks Dates in June Month, Muhurtham Dates in June 2025, Muhurtham Dates in Jyeshta Masam, Pelli Choopulu Dates in Jyeshta Masam, Pelli Choopulu Muhurtham Dates 2025

జ్యేష్ట మాసంలో అక్షరాభ్యాస ముహుర్తాలు – Aksharabhyasam Dates in the Month of June

జ్యేష్ట మాసంలో నామకరణం ముహుర్తాలు – Naming Ceremony Dates in the Month of June
Related Posts
Related Posts
Recent Posts
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
- హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు








