కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి కన్నుమూత

కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి కన్నుమూత

అభినవ శంకరులుగా పేరుగాంచిన తమిళనాడు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి బుధవారం ఉదయం 9గంటలకు తుదిశ్వాసను విడిచి పరమేశ్వరునిలో ఐక్యం అయ్యారు. చాలా రోజులుగా తీవ్ర శరీర అనారోగ్యం బాధపడుతున్న పీఠాధిపతులకు గుండెపోటు రావడంతో ఆయన్ను ఉదయం శంకర మఠం సమీపంలోని శంకర్ మల్టిస్పెషాలిటి ప్రయివేట్ ఆసుపత్రి లో చేర్పించి మెరుగైన చికిత్స అందించినా పరిస్థితి చేయి దాటడంతో జయేంద్రుల వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇదివరకు రెండు నెలల క్రితం కూడా ఆయనకు స్ట్రోక్ రావడంతో చికిత్స అందించారు.

kanchi-shankaracharya-jayendra-saraswathi-dies-at-82

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తర్వాత కంచి కామకోటి 69వ పీఠాధిపతిగా 1954 మార్చి 24వ తేదిన  శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి బాధ్యతలు స్వీకరించారు. 1954 నుంచి ఆయన కంచి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. ఆయన 1935 జూలై 18న తంజావూరు జిల్లాలో జన్మించారు. ఈయన అసలు పేరు సుబ్రహ్మణ్యం మహాదేవ అయ్యర్. పీఠాధిపతిగాఫై భాద్యతలు స్వీకరించిన తరువాత పేరుని శ్రీ జయేంద్ర సరస్వతిగా మార్చడం జరిగింది. ప్రస్తుతం ఆయన వయస్సు 82 సంవత్సరాలు. శ్రీ జయేంద్ర సరస్వతి మరణం తరువాత ఆయన స్థానంలో శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కంచి పీఠముకు జయేంద్ర సరస్వతి అందించిన సేవలు మరువలేనివని తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి పేర్కొన్నారు.

పెండ్యాల వారి ఉగాది లక్ష్మి కవిత
మూత పడనున్న తిరుపతి ఆలయం

Related Posts