పెండ్యాల వారి ఉగాది లక్ష్మి కవిత

పెండ్యాల వారి ఉగాది లక్ష్మి కవిత

Loading

ugadi-lakshmi-kavita

ఎన్నో సంవత్సరాలుగా రామచంద్రాపురం రత్నంపేట మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు తెలుగు మాస్టారుగా అనేక సేవలు అందించిన పెండ్యాల సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క కలం నుంచి జాలువారిన ఉగాది లక్ష్మి కవిత.

ఉగాది లక్ష్మి కవిత…

ఉగాదీది తెలుగు యుగాది
తెలుగుల లక్ష్మి ఈ ఉగాది
ప్రభవాది” అరువది వత్సరంబులీమె అవతారంబులు
చైత్రాది” పండ్రెండు మాసంబుల కరంబులతో
ఉత్తర” “దక్షిణ” అయనంబుల నయన ద్వయంబుతో
వసంతాది” షడృతువుల అలంకారాలతో
షడృచుల” వీక్షణలతో
త్రికాలమ్ము“ల నడకలతో
సిరి సంపద“ల నందిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ
శ్రీ విళంబి” నామ ఉగాది తెలుగు లక్ష్మి విచ్చేసింది

అందుకే
చెప్పుకొందాం! ప్రతి ఒక్కరం
ఉగాది శుభాకాంక్షలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

పెండ్యాల సుబ్రహ్మణ్య శర్మ
విశ్రాంత తెలుగు ఉపాద్యాయులు

ugadi, yugadi
దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం
కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి కన్నుమూత

Related Posts