నర్మదా నది పుష్కరాలు – 2024 లో నర్మదా పుష్కరాల తేదీలు ఏమిటి?

Loading

Narmada River Pushkaralu Dates 2024

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

నర్మదా నది పుష్కరాలు 2024

నర్మదా నది మధ్య భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన నదులలో ఒకటి. ఈ నది ఉత్తర, దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తున్నది. మధ్య ప్రదేశ్ రాష్ట్రములోని అమర్‌కంఠక్ పర్వతాల్లో పుట్టి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రములో కలుస్తుంది.

నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ . ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశి లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఆచరిస్తారు. 2024లో నర్మదా నది పుష్కరాలు మే 1 మధ్యాహ్నం ఒంటిగంటకు గురుడు వృషభరాశి లోకి ప్రవేశించాక ప్రారంభమై మే 12 న ముగుస్తాయి.

నర్మదా పుష్కరాల తేదీలు మరియు తిధులు

  • మే 1 2024 – బుధవారం – అష్టమి
  • మే 2 2024 – గురువారం -నవమి
  • మే 3 2024 – శుక్రవారం -దశమి
  • మే 4 2024 – శనివారం -ఏకాదశి
  • మే 5 2024 – ఆదివారం -ద్వాదశి
  • మే 6 2024 – సోమవారం -త్రయోదశి
  • మే 7 2024 – మంగళవారం -చతుర్దశి
  • మే 8 2024 – బుధవారం – అమావాస్య
  • మే 9 2024 – గురువారం -పాడ్యమి, విదియ
  • మే 10 2024 – శుక్రవారం – తదియ
  • మే 11 2024 – శనివారం – చవితి
  • మే 12 2024 – ఆదివారం – పంచమి

పుష్కరాలు ప్రారంభమైనప్పటి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం, పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది. సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా పురాణాలు, ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది.

amarkantak, gujarath, madyapradesh, narmada river, Narmada River Pushkaralu, Narmada River Pushkaralu Dates 2024, When is Narmada River Pushkaralu, Which River Pushkar in 2024
నర్మదా నది చరిత్ర – నర్మదా నది పుష్కర ఘాట్లు ఎక్కడ ఉన్నాయి?
నర్మదా నది పుష్కర స్నాన సంకల్పం – నర్మదా పుష్కరములు

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.