నర్మదా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?

Loading

Offerings During Narmada Pushkaralu

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

పుష్కర ప్రాశస్త్యం

పురాణ గాథల ప్రకారం, పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుడి కోసం ఘోర తపమాచరించాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అందుకు పుష్కరుడు, జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమవుతున్నాయనీ నదులు పునీతమైతే దేశం సుభిక్షంగా ఉంటుందనీ ఆలోచించి ‘దేవా… నా శరీర స్పర్శచే సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు’ అని ప్రార్థించాడట. అప్పుడు శివుడు ‘నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాపవిముక్తులవుతారు’ అని వరమిచ్చాడట.

పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు (బృహస్పతి) తనకూ పుష్కరత్వం ప్రసాదించమని బ్రహ్మను గురించి తపమాచరించగా అందుకు పుష్కరుడు అంగీకరించలేదు. పుష్కర, బృహస్పతులిద్దరికీ నచ్చజెప్పిన బ్రహ్మ వారిద్దరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించాడట. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలు గానూ చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగానూ వ్యవహరించి పుష్కర వేడుకలు నిర్వహిస్తారు.

పుష్కర సమయంలో ఆయా నదులలో ఎక్కడ స్నానం చేసినా, పూర్వ జన్మల్లో మనస్సు, వాక్కు, శరీరమనే త్రికరణాలతో చేసిన అన్ని పాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తున్నది. ఎన్నో పుణ్య కార్యాలు ఈ సమయంలో చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. మానవులు స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్టాలను పితృ పిండ ప్రదానాలను చేయాలని మహర్షులన ప్రబోధించారు. పుణ్య కార్యాలన్నింటిలో ముఖ్యమైనది, మహత్తరమైనది, పుష్కరస్నానం.

పుష్కర సమయంలో 12 రోజులు చేయవలసిన దానాలు.

  • మొదటిరోజు – సువర్ణ దానం, రజితం దానం, ధన్యవాదాలు, భూదానం
  • రెండవ రోజు – వస్త్ర దానం, లవణ దానం, రక్తం దానం 
  • మూడవరోజు – బెల్లం దానం, పూల దానం
  • నాల్గవ రోజు – నెయ్యి దానం, నూనె దానం, పాలు దానం, తేనె దానం
  • ఐదవ రోజు – ధన్య దానం, శకట దానం, వృషభదానం
  • ఆరవ రోజు – ఔషధ దానం, చందన దానం, కస్తూరి దానం
  • ఏడవ రోజు – గృహదానం, పీట దానం, శయ్య దానం
  • ఎనిమిదవ రోజు – చందనం దానం, కందుమూలాల దానం, పప్పు మాల దానం  
  • తొమ్మిదవ రోజు – పిండదానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం  
  • పదవరోజు – కూరగాయలు దానం, పండ్ల దానం
  • పదకొండవ రోజు – గజదనం
  • పన్నెండవ రోజు – నువ్వులు దానం 

ఈ దానాలు అన్నీ కూడా సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు చేయడం మంచిది.

amarkantak, gujarath, madyapradesh, narmada river, Narmada River Pushkaralu, What needs to be donate during Pushkaralu
అక్షయ తృతీయ రోజున మనకు తెలియకుండానే దరిద్రాన్ని తెచ్చిపెట్టే పని ఇదే!!!
నర్మదా నది చరిత్ర – నర్మదా నది పుష్కర ఘాట్లు ఎక్కడ ఉన్నాయి?

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.