మీరు ఒకరికి కుమారుడా? లేదా మీకు ఒక పుత్రుడున్నాడా?

మీరు ఒకరికి కుమారుడా? లేదా మీకు ఒక పుత్రుడున్నాడా?

  1. మీరు ఒకరికి కుమారుడా?లేదా మీకు ఒక పుత్రుడున్నాడా?
  2. ఈ భూమిపై వారసులుగా పుత్రులు ఎందుకు జన్మిస్తారో తెలుసా?
  3. అసలు పుత్రులుగా మనము ఎవరికి జన్మనిస్తాము?

పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు

  • తాను పూర్వజన్మనందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.
  • పూర్వజన్మలో తనకొకడు అపకారం చేసాడు, దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.
  • పూర్వజన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.
  • పూర్వజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించినవాడు, తాను దాచిన సొమ్మును తిరిగి తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.
  • పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రుడుగా జన్మస్తాడు.
  • పూర్వజన్మలో తాను అనుభవించిన సేవ-సుఖములకు బదులు తీర్చడానికి పుత్రుడిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.
  • ఏమీ అపేక్షించనివాడు కుడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.

ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య -భర్త -సొదరుడు -పనిమనిషి -ఆవు మొ.న పశువులు కూడా కర్మ ఋణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. అంతే కాదు వీరు పున్నామనరకం నుంచి రక్షించడానికి కూడా జన్మించెదరు. ఋణము తీరగానే వదిలి వెళ్లడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.

ఏ సమయంలో యే దైవమును పూజిస్తే త్వరిత ఫలితం కలుగును??
చతుర్వేదములు – వివరణ

Related Posts