ఏ సమయంలో యే దైవమును పూజిస్తే త్వరిత ఫలితం కలుగును??

ఏ సమయంలో యే దైవమును పూజిస్తే త్వరిత ఫలితం కలుగును??

సూర్య నారాయణుని ఉదయం 4.30 నుంచి ఆరు గంటలలోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతికరం. ఆరు నుంచి ఏడున్నర వరకు పరమ శివుడిని, దుర్గా మాతను పూజించిన మంచి ఫలితము కలుగును. మధ్యాహ్నము పన్నెండు గంటల సమయమందు ఆంజనేయ స్వామి వారిని పూజించినయెడల హనుమ కృపకు మరింత పాత్రులు అగుదురు. రాహువును సాయంత్రము మూడు గంటలకు పూజించినచో మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయమున అనగా., సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన సమయము. సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది మధ్య లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షము వీక్షణములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహావిష్ణువును పూజిస్తే లక్ష్మీనారాయణుని కటాక్షము అపారంగా ప్రసరిస్తుంది.( ఈ వివరములు పురాణముల ఆధారంగా ఇవ్వబడినవి. సమయానుసారంగా మీకు ఇష్టమైన దైవమును పూజించుట యదేచ్చం.)

hindu-gods

ఉత్పన్న ఏకాదశి – ఉపవాసం విశిష్టత
మీరు ఒకరికి కుమారుడా? లేదా మీకు ఒక పుత్రుడున్నాడా?

Related Posts