ఉత్పన్న ఏకాదశి – ఉపవాసం విశిష్టత

ఉత్పన్న ఏకాదశి – ఉపవాసం విశిష్టత

Loading

ఉత్పన్న ఏకాదశి – ఉపవాసం విశిష్టత

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిధి.

ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది.

ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశి ని ఏకాదశి తిధి యొక్క జయంతిగా భావిస్తారు.

ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి.  ముర అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు. వితంతువులు కానీ ఈ రోజు ఉపవాసము ఆచరించిన యెడల ముక్తిని పొందగలరు.

image

కాలభైరవ అష్టమి – భైరవ పూజ ఫలితాలు
ఏ సమయంలో యే దైవమును పూజిస్తే త్వరిత ఫలితం కలుగును??

Related Posts

No results found.