స్కంద షష్టి వ్రతం

స్కంద షష్టి వ్రతం

Loading

skanda sashti significance

స్కంద షష్టి వ్రతం

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు.

దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి , సుబ్బరాయుడు షష్టి, తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా వ్యవహరిస్తారు.

skanda sashti significance

సుబ్రహ్మణ్యుని ఆవిర్భావం:

కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న”తారకా సురుడు” అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు.

దేవతలు శివున్నిఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు.ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి,దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు “శూలం” మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి “శక్తి” అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి “సర్పరూపం” దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి”గా పిలుచుకుంటున్నాము.

“శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు,పువ్వులు,వెండి పడగలు,వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం,కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది.

తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది.ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది.

నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని,దానం చేయమని సందేశం ఇస్తుంది.

కుఱళ్ వెణ్బా (ప్రార్థన):-
తుదిప్పోర్‍క్కు వల్వినైపోమ్ తున్బమ్ పోమ్
నెఞ్జిఱ్ పదిప్పోర్‍క్కు సెల్వమ్ పలిత్తు కథిత్తు ఓఙ్గుమ్
నిష్టైయుఙ్ కైకూడుమ్, నిమలర్ అరుళ్ కందర్
శష్ఠి కవచన్ తనై |

 కాప్పు  (సంకల్పం):-
అమరర్ ఇడర్తీర అమరమ్ పురిన్ద
కుమరన్ అడి నెఞ్జే కుఱి |

స్కంద షష్ఠి కవచం
శష్టియై నోక్క శరహణ భవనార్
శిష్టరుక్కుదవుమ్ శెఙ్కదిర్ వేలోన్
పాదమ్ ఇరణ్డిల్ పన్మణిచ్ చదఙ్గై
గీతమ్ పాడ కిణ్కిణి యాడ

మైయ నడఞ్చెయుమ్ మయిల్ వాగననార్
కైయిల్ వేలాల్ ఎనైక్కాక్కవెన్‍ఱు వన్దు
వర వర వేలాయుదనార్ వరుగ
వరుగ వరుగ మయిలోన్ వరుగ
ఇన్దిరన్ ముదలా ఎణ్డిశై పోఱ్ఱ
మన్తిర వడివేల్ వరుగ వరుగ

వాశవన్ మరుగా వరుగ వరుగ
నేశక్ కుఱమగళ్ నినైవోన్ వరుగ
ఆఱుముగమ్ పడైత్త ఐయా వరుగ
నీఱిడుమ్ వేలవన్ నిత్తమ్ వరుగ
శిరగిరి వేలవన్ సీక్కిరమ్ వరుగ

రహణ భవచ రరరర రరర
రిహణ భవచ రిరిరిరి రిరిరి
విణభవ శరహణ వీరా నమోనమ
నిభవ శరహణ నిఱ నిఱ నిఱైన

వచర హణబ వరుగ వరుగ
అసురర్ కుడి కెడుత్త అయ్యా వరుగ
ఎన్నై ఆళుమ్ ఇళైయోన్ కైయిల్
పన్నిరణ్డాయుమ్ పాశాఙ్కుశముమ్
పరన్ద విళిగళ్ పన్నిరణ్డిలఙ్గ

విరైన్‍దెనైక్ కాక్క వేలోన్ వరుగ
ఐయుమ్ కిలియుమ్ అడైవుడన్ శౌవుమ్
ఉయ్యోళి శౌవుమ్, ఉయిరైయుఙ్ కిలియుమ్
కిలియుఙ్ శౌవుమ్ కిళరోళియైయుమ్
నిలై పెఱ్ఱెన్మున్ నిత్తముమ్ ఒళిరుమ్

శణ్ముఖన్ ఱీయుమ్ తనియొళి యొవ్వుమ్
కుణ్డలియామ్ శివగుహన్ దినమ్ వరుగ
ఆఱుముగముమ్ అణిముడి ఆఱుమ్
నీఱిడు నెఱ్ఱియుమ్ నీణ్డ పురువముమ్
పణ్ణిరు కణ్ణుమ్ పవళచ్ చెవ్వాయుమ్

నన్నెఱి నెఱ్ఱియిల్ నవమణిచ్ చుట్టియుమ్
ఈరాఱు శెవియిల్ ఇలగుకుణ్డలముమ్
ఆఱిరు తిణ్బుయత్ తళహియ మార్బిల్
పల్బూషణముమ్ పదక్కముమ్ దరిత్తు
నన్మణి పూణ్డ నవరత్న మాలైయుమ్

ముప్పురి నూలుమ్ ముత్తణి మార్బుమ్
శెప్పళగుడైయ తిరువయి ఱున్దియుమ్
తువణ్డ మరుఙ్గిల్ శుడరొళిప్ పట్టుమ్
నవరత్నమ్ పదిత్త నఱ్‍ చీఱావుమ్
ఇరుతొడై అళహుం ఇణైముళన్ దాళుమ్

తిరువడి యదనిల్ శిలంబొలి ముళంగ
శెగగణ శెగగణ శెగగణ శెగణ
మొగమొగ మొగమొగ మొగమొగ మొగన
నగనగ నగనగ నగనగ నగెన
డిగుగుణ డిగుడిగు డిగుగుణ డిగుణ

రరరర రరరర రరరర రరర
రిరిరిరి రిరిరిరి రిరిరిరి రిరిరి
డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడు
డగుడగు డిగుడిగు డఙ్గు డిఙ్గుగు
విన్దు విన్దు మయిలోన్ విన్దు

మున్దు మున్దు మురుగవేళ్ మున్దు
ఎన్‍ఱనై యాళుమ్ ఏరగచ్ చెల్వ !
మైన్దన్ వేణ్డుమ్ పరిమహిళంన్దుదవుమ్
లాలా లాలా లాలా వేశముమ్
లీలా లీలా లీలా వినోద నెన్‍ఱు

ఉన్‍ఱిరు వడియై ఉఱుదియెణ్ ఱెణ్ణుమ్
ఎణ్‍ఱనై వైత్తున్ ఇణైయడి కాక్క
ఎన్నుయిర్క్ కుయిరామ్ ఇఱైవన్ కాక్క
పన్నిరు విళియాల్ బాలనైక్ కాక్క
అడియేన్ వదనమ్ అళ్గువేల్ కాక్క

పొడిపునై నెఱ్ఱియైప్ పునిదవేల్ కాక్క
కదిర్వేల్ ఇరణ్డుమ్ కణ్ణినైక్ కాక్క
విదిశెవి ఇరణ్డుమ్ వేలవర్ కాక్క
నాశిగళ్ ఇరణ్డుమ్ నల్వేల్ కాక్కా
పేశియ వాయ్‍థనైప్ పెరువేల్ కాక్క

ముప్పత్ తిరుపల్ మునైవేల్ కాక్క
శెప్పియ నావై చెవ్వేల్ కాక్క
కన్నమ్ ఇరణ్డుమ్ కదిర్వేల్ కాక్క
ఎన్నిళఙ్ కళుత్తై ఇనియవేల్ కాక్క
మార్బై ఇరత్తిన వడివేల్ కాక్క

శెరిళ ములైమార్ తిరువేల్ కాక్క
వడివేల్ ఇరుతోళ్ వళమ్‍పెఱక్ కాక్క
పిడరిగళ్ ఇరణ్డుమ్ పెరువేల్ కాక్క
అళ్గుడన్ ముదుగై అరుళ్వేల్ కాక్క
పశుపతి నాఱుమ్ పరువేల్ కాక్క

వెఱ్ఱివేల్ వయిఱ్ఱై విళఙ్గవే కాక్క
సిఱ్ఱిడై అళ్గుఱ శెవ్వేల్ కాక్క
నాణాఙ్కయిఱ్ఱై నల్వేల్ కాక్క
ఆణ్కుఱి యిరణ్డుమ్ అయిల్వేల్ కాక్క
పిట్టమ్ ఇరణ్డుమ్ పెరువేల్ కాక్క

వట్టక్ కుదత్తై వల్వేల్ కాక్క
పణైత్తొడై ఇరణ్డుమ్ పరువేల్ కాక్క
కణైక్కాల్ ముళంన్తాళ్ కదిర్వేల్ కాక్క
ఐవిరల్ అడియినై అరుళ్వేల్ కాక్క
కైగళిరణ్డుమ్ కరుణైవేల్ కాక్క

మున్గై యిరణ్డుమ్ మురణ్వేల్ కాక్క
పిన్గై యిరణ్డుమ్ పిన్నవళ్ ఇరుక్క
నావిల్ సరస్వతి నఱ్ఱునై యాగ
నాబిక్ కమలమ్ నల్వేల్ కాక్క
ముప్పాల్ నాడియై మునైవేల్ కాక్క

ఎప్పొళందుమ్ ఎనై ఎదిర్వేల్ కాక్క
అడియేన్ వచనమ్ అశైవుళ నేరమ్
కడుగవే వన్దు కనకవేల్ కాక్క
వరుమ్పగల్ తన్నిల్ వజ్జిరవేల్ కాక్క
అరైయిరుళ్ తన్నిల్ అనైయవేల్ కాక్క

ఏమతిల్ జామత్తిల్ ఎదిర్వేల్ కాక్క
తామదమ్ నీక్కిచ్ చతుర్వేల్ కాక్క
కాక్క కాక్క కనకవేల్ కాక్క
నోక్క నోక్క నొడియినిల్ నోక్క

తాక్క తాక్క తడైయఱత్ తాక్క
పార్‍క్క పార్‍క్క పావమ్ పొడిపడ
బిల్లి శూనియమ్ పెరుమ్పగై అగల
వల్ల భూతమ్ వలాట్టిగప్పేయ్గళ్
అల్లఱ్‍పడుత్తుమ్ అడఙ్గ మునియుమ్
పిళ్ళైగళ్ తిన్నుమ్ పుళక్కడై మునియుమ్
పెణ్గలైత్ తొడరుమ్ బిరమరాక్ కరుదరుమ్
అడియనైక్ కణ్డాల్ అలఱిక్ కలఙ్గిడ
ఇరిశికాట్ టేరి ఇత్తున్బ శేనైయుమ్
ఎల్లిలుమ్ ఇరుట్టిలుమ్ ఎదిర్‍ప్పడుమ్ అణ్ణరుమ్

కనపూజై కొళ్ళుమ్ కాళియో డనైవరుమ్
విట్టాఙ్గ్ కారరుమ్ మిగుపల పేయ్గళుమ్
తణ్డియక్కారరుమ్ చణ్డాళర్గళుమ్
ఎన్ పెయర్ శొల్లవుమ్ ఇడివిళున్ దొడిడ
ఆనై అడియినిల్ అరుమ్పా వైగళుమ్

పూనై మయిరుమ్ పిళ్ళైగళ్ ఎన్బుమ్
నగముమ్ మయిరుమ్ నీళ్ముడి మణ్డైయుమ్
పావైగళుడనే పలకలశత్తుడన్
మనైయిఱ్ పుదైత్త వఞ్జనై తనైయుమ్
ఒట్టియ పావైయుమ్ ఒట్టియ శెరుక్కుమ్

కాశుమ్ పణముమ్ కావుడన్ శోఱుమ్
ఓదుమఞ్జనముమ్ ఒరువళిప్ పోక్కుమ్
అడియనైక్ కణ్డాల్ అలైన్దు కులైన్దిడ
మాఱ్ఱార్ వఙ్చగర్ వన్దు వణఙ్గిడ
కాల ధూతాళ్ ఎనైక్ కణ్డాఱ్ కలఙ్గిడ

అఞ్జి నడుఙ్గిడ అరణ్డు పురణ్డిడ
వాయ్‍విట్టలఱి మదికెట్టోడ
పడియినిల్ ముట్టాప్ పాశక్ కయిఱ్ఱాల్
కట్టుడన్ అఙ్గమ్ కదఱిడక్ కట్టు
కట్టి ఉరుట్టు కాల్కై ముఱియక్

కట్టు కట్టు కదఱిడక్ కట్టు
ముట్టు ముట్టు విళిగళ్ పిదుఙ్గిడ
చెక్కు చెక్కు చెదిల్ చెదిలాగ
చొక్కు చొక్కు శూర్‍ప్పగై చొక్కు
కుత్తు కుత్తు కూర్వడి వేలాల్

పఱ్ఱు పఱ్ఱు పగలవన్ తణలెరి
తణలెరి తణలెరి తణలదువాగ
విడువిడు వేలై వెరుణ్డదు ఓడప్
పులియుమ్ నరియుమ్ పున్నరి నాయుమ్
ఎలియుమ్ కరడియుమ్ ఇనిత్ తొడర్‍న్దోడ

తేళుమ్ పామ్బుమ్ శెయ్యాన్ పూరాన్
కడివిడ విషఙ్గళ్ కడిత్తుయ రఙ్గమ్
ఏఱియ విషఙ్గళ్ ఎళిదినిల్ ఇరఙ్గ
ఒళుప్పుఞ్ చుళుక్కుమ్ ఒరుతలై నోయుమ్
వాదమ్ చయిత్తియమ్ వలిప్పుప్ పిత్తమ్

శూలైయఙ్ చయఙ్గున్మమ్ శొక్కుచ్ చిఱఙ్గు
కుడైచ్చల్ శిలన్ది కుడల్విప్ పిరిది
పక్కప్ పిళవై పడర్‍తొడై వాళై
కడువన్ పడువన్ కైత్తాళ్ శిలన్ది
పఱ్‍కుత్తు అరణై పరు అరై ఆప్పుమ్

ఎల్లాప్పిణియుమ్ ఎన్‍ఱనైక్ కణ్డాల్
నిల్లా దోడ నీయెనక్ కరుళ్వాయ్
ఈరేళ్ ఉలగముమ్ ఎనక్కుఱ వాగ
ఆణుమ్ పెణ్ణుమ్ అనైవరుమ్ ఎనక్కా
మణ్ణాళరశరుమ్ మగిళందుఱ వాగవుమ్

ఉన్నైత్ తుదిక్క ఉన్ తిరునామమ్
శరహణ భవనే శైలొళి భవనే
తిరిపుర భవనే తిగళొళి భవనే
పరిపుర భవనే పవమొళి భవనే
అరితిరు మరుగా అమరాపదియైక్

కాత్తుత్ దేవర్గళ్ కడుఞ్జిరై విడుత్తాయ్
కన్దా గుహనే కదిర్ వేలవనే
కార్‍త్తికై మైన్దా కడమ్బా కడమ్బనై
ఇడుమ్బనై అళిత్త ఇనియవేల్ మురుగా
తణికాచలనే శఙ్కరన్ పుదల్వా

కదిర్కామత్తుఱై కదిర్వేల్ మురుగా
పళనిప్ పదివాళ్ బాల కుమారా
ఆవినన్ కుడివాళ్ అళగియ వేలా
సెన్దిన్ మామలైయుఱుమ్ చెఙ్గల్వరాయా
శమరాపురివాళ్ శణ్ముగత్ అరసే

కారార్ కుళలాల్ కలైమగళ్ నన్‍ఱాయ్
ఎన్ నా ఇరుక్క యానునైప్ పాడ
యెనైత్తొడర్దిరుక్కుమ్ ఎన్దై మురుగనైప్
పాడినేన్ ఆడినేన్ పరవశమాగ
ఆడినేన్ నాడినేన్ ఆవినన్ బూతియై

నేశముడన్ యాన్ నెఱ్ఱియిల్ అణియప్
పాశవినైగళ్ పఱ్ఱదు నీఙ్గి
ఉన్పదమ్ పెఱవే ఉన్నరుళాగ
అన్బుడన్ రక్షి అన్నముఞ్ చొన్నముమ్
మెత్తమెత్తాగ వేలా యుదనార్

శిద్దిపెఱ్ఱడియెన్ శిఱప్పుడన్ వాళ్గ
వాళ్గ వాళ్గ మయిలోన్ వాళ్గ
వాళ్గ వాళ్గ వడివేల్ వాళ్గ
వాళ్గ వాళ్గమలైక్కురు వాళ్గ
వాళ్గ వాళ్గ మలైక్కుఱ మగళుడన్

వాళ్గ వాళ్గ వారణత్తువ‍ఐమ్
వాళ్గ వాళ్గ ఎన్ వఱుమైగళ్ నీఙ్గ
ఎత్తనై కుఱైగళ్ ఎత్తనై పిళైగళ్
ఎత్తనై యడియెన్ ఎత్తనై శెయినుమ్
పెఱ్ఱవన్ నీగురు పొఱుప్పదు ఉన్కడన్

పెఱ్ఱవళ్ కుఱమగళ్ పెఱ్ఱవళామే
పిళ్ళై యెన్‍ఱన్బాయ్‍ప్ పిరియ మళిత్తు
మైన్దన్ ఎన్ మీదు ఉన్ మనమగిళ్న్దుఅరుళి
తఞ్జమెన్‍ఱడియార్ తళైత్తిడ అరుళ్శెయ్
కన్దర్ శష్టి కవచమ్ విరుమ్బియ
బాలన్ దేవరాయన్ పగర్‍న్దదై

కాలైయిల్ మాలైయిల్ కరుత్తుడన్ నాళుమ్
ఆచా రత్తుడన్ అఙ్గఙ్ తులక్కి
నేశముడన్ ఒరు నినైవదువాగిక్
కన్దర్ శష్టిక్కవచమ్ ఇదనై
చిన్తై కలఙ్గాదు దియానిప్పవర్గళ్

ఒరునాళ్ ముప్పత్తాఱురుక్కొణ్డు
ఓదియె జెపిత్తు ఉగన్దు నీఱణియ
అష్టదిక్కుళ్ళోర్ అడఙ్గలుమ్ వశమాయ్
దిశై మన్నర్ ఎణ్మర్ శెయలదరుళువర్
మాఱ్ఱలరెల్లామ్ వన్దు వణఙ్గువర్

నవకోళ్ మగిళందు నన్మై యళిత్తిడుమ్
నవమద నెనవుమ్ నల్లెళిల్ పెఱువర్
ఎన్ద నాళుమ్ ఈరెట్టాయ్ వాళ్వర్
కన్దర్ కైవేలామ్ కవచత్ తడియై
వళియాయ్ కానమయ్యాన్

విళిoఅంగు పేళియాయ్‍క్కాణ వెరుణ్డిడుమ్
పొల్లా దవరైప్ పొడిపొడియాక్కుమ్
నల్లోర్ నినైవిల్ నటనమ్ పురియుమ్
శర్వ శత్తురు శఙ్గా రత్తడి
అఱిన్దెనదుళ్ళమ్ అట్టలట్చుమిగళిల్

వీరలట్చుమిక్కు విరున్దుణవాగచ్
శూర పద్మావైత్ తుణిత్తగై అదనాల్
ఇరుబత్తెళ్వర్‍క్కు ఉవన్దముదళిత్త
గురుపరన్ పళనిక్ కున్‍ఱిల్ ఇరుక్కుమ్
చిన్నక్ కుళన్దై శేవడి పోట్రి
ఎనైత్తడుత్ తాట్కొళ ఎన్‍ఱన దుళ్ళమ్

మేవియ వడివుఱుమ్ వేలవా పోట్రి
దేవర్గళ్ సేనాపతియే పోట్రి
కుఱమగళ్ మనమగిళ్ కోవే పోట్రి
తిఱమిగు దివ్వియ దేగా పోట్రి

ఇడుమ్బా యుదనే ఇడుమ్బా పోట్రి
కడమ్బా పోట్రి కన్దా పోట్రి
వెట్చి పునైయుమ్ వేళే పోట్రి
ఉయర్గిరి కనకశబైక్కోర్ అరశే
మయిల్ నటమిడువొయ్ మలరడి శరణమ్

శరణమ్ శరణమ్ శరహణ భవ ఓం
శరణమ్ శరణమ్ షణ్ముఖా శరణమ్ ||

ఇతి శ్రీ స్కంద షష్ఠి కవచం సంపూర్ణం ||

ఎవరెవరు పూజించాలి ?
కుజ దోషం, నాగ దోషం, కాలసర్ప దోషమున్నవారు,  సంతన కలగనివారు, అబార్షన్లు అవుతున్నవారు, వివాహం కానివారు, వివాహంలో లేదా దాంపత్యంలో సమస్యలున్నవారు, భూమికి సంబంధించిన సమస్యలున్నవారు, తమ సంతానం యొక్క ఉన్నత విద్య కోరుకునేవారు స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం జరిపిస్తే చక్కని శుభ ఫలితాలు లభిస్తాయి.

 

subrahmanya
ఆది శంకర జయంతి
శ్రీ రామానుజ జయంతి

Related Posts