భార్యా భర్తల మధ ఆప్యాయత తగ్గటము, వివాహము ఆలస్యము అవ్వటము, భోగలాలస తగ్గడము, పర స్త్రీ లేదా పర పరుషుని వ్యామోహం లో పడటము, పత్నీ పీడకు గురిఅవ్వడము మొదలైనవి అన్నీ కూడా శుక్రగ్రహ దోషము వల్ల ఏర్పడే సమస్యలు కావునా…
- శుక్రగ్రహ దోషనివారణ కొరకు బొబ్బర్లతో చేసిన వడలు ప్రసాదంగా పంచడం, అన్నసమారాధానలో నేతిని వడ్డించడము,
- వివాహ వస్తువులను పేదలకు పంచడము / పేదల వివాహంలో ధనాన్ని ఖర్చు చేయడం,
- శుక్రవారం నాడు ఉదయమునే శుక్రగ్రహ స్వరూపము అయిన మేడి చెట్టుకి ప్రదక్షిణ చేసి, దీపమును వెలిగించుట,
- ప్రతీ శుక్రవారం అమ్మవారి పూజను చేయించడము,
- తెల్లటి వస్త్రములు ధరించడము, మనోనిర్మలతను కలిగి ఉండటము,
- బ్రాహ్మణోత్తములచే శుక్రగ్రహ జపం చేయించుకొని తత్తతు తర్పణాన్ని, హోమమును చేసి, బొబ్బర్లు దానాన్ని ఇవ్వడం వల్ల కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలిగి ఆటంకాలు తొలగును.
- ఇవేమీ చేయలేని వారు కనీసం శుక్రగ్రహ స్తోత్రమును 11 సార్లు ప్రతినిత్యం పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితములను పొందవచ్చును.
శుక్రగ్రహ స్తోత్రము:
హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమంగురుం|
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం||
సేకరణ: https://www.panditforpooja.com/blog/sukra-graha-dosha-nivarana-remedies/