సూర్యగ్రహ దోష నివారణకు ప్రత్యేక ఉపాయములు

సూర్యగ్రహ దోష నివారణకు ప్రత్యేక ఉపాయములు

surya-graha-dosha-nivarana-remedies

రవి గ్రహము. దీనినే సూర్యగ్రహం అని కూడా  అంటారు.  పప్రచచండుడైన సూర్యభగవానుడు సూర్యగ్రహంకు అధిపతి.  ఆదివారం లేదా భాను వారం సూర్యానారాయణుడికు అత్యంత ప్రీతికరమైన రోజు. మనకు ఉన్నటువంటి నవగ్రహములలో సూర్యగ్రహం మొట్టమొదటి గ్రహము.

జాతక రీత్యా సూర్యగ్రహం బలహీనంగా ఉన్నవారూ లేదా సూర్యగ్రహ దోషంతో బాధపడుతున్నవారు, ఏ యే పనులు చేయడంవల్ల సూర్యగ్రహ దోషం నుంచి ఉపశాంతి పొందుతారో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆరోగ్యం బాగోకపోవడము, చిక్కులు ఏర్పడటము, చేయవలసిన పనులు సకాలంలో పూర్తి అవ్వకపోవడము,  సంతానంవల్ల ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు ఏర్పడటము మొదలైనవి అన్నీ కూడా సూర్యగ్రహ దోషము వల్ల ఏర్పడే సమస్యలు కావునా…

  1. సూర్యగ్రహ దోష నివారణ కొరకు గోధుమగడ్డి పెంచి పశువులకు ఆహారంగా పెట్టడము,
  2. గోధుమ పిండి & పాలతో చేసిన హల్వాను సూర్యభగవానుడికి నివేదన చేయడము,
  3. చపాతీలు లేదా అప్పాలను పంచడము లేదా ఆవులకు పెట్టడము,
  4. సూర్యభగవానుడిని అర్క పుష్పములు(తెల్ల జిల్లేడు పువ్వుల)తో పూజించడము వల్ల సూర్యగ్రహ దోషం తొలగి ఆయుష్యు, ఆరోగ్యం, ఐశ్వర్యము కలుగును. అంతేకాక
  5. సూర్యానారాయణుడికు ప్రీతిగా  సూర్యగ్రహముకు బ్రాహ్మణోత్తములచే  జపం చేయించుకొని తత్తతు తర్పణాన్ని, హోమమును చేసి,  గోధుమలను దానాన్ని ఇవ్వడం వల్ల  కూడా సూర్యగ్రహం అనుగ్రహం కలిగి విశేష ఫలితములు కలుగును.

ఇవేమీ చేయలేని వారు కనీసం సూర్యగ్రహ స్తోత్రమును 11 సార్లు ప్రతినిత్యం పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితములను పొందవచ్చును.

సూర్యగ్రహ స్తోత్రము:
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్‌|
తమోऽరిం సర్వపాపఘ్నం ప్రణతోऽస్మి దివాకరమ్‌||

సేకరణ: https://www.panditforpooja.com/blog/surya-graha-dosha-nivarana-remedies/

హోళీ పండుగ గూర్చి ముందుగా తెలుసుకోవలసినవి!
శుక్రగ్రహ దోష నివారణకు ప్రత్యేక ఉపాయములు

Related Posts