పూజ చేసేటప్పుడు దిక్కులతో పని ఉందా? ఏ వైపు ముఖము పెట్టి పూజ చేయాలి?

పూజ చేసేటప్పుడు దిక్కులతో పని ఉందా? ఏ వైపు ముఖము పెట్టి పూజ చేయాలి?

pooja direction at temple

చాలామందికి కలిగే ఒక చిత్రమైన సందేహం పూజ చేసేటప్పుడు ఏ వైపు ముఖము పెట్టి పూజను చేయాలి…? అని. ఈ సందేహం మీకూ ఉందా???

అనంతముగా వ్యాపించి ఉన్న పరమాత్మని అర్చించేటప్పుడు నిజమునకు దిక్కులో సంబంధం లేదు. కానీ ఏ దిక్కున ఉండి పూజ చేస్తే మంచి ఫలితములను పొందవచ్చో శాస్త్రంలో  ప్రస్తావించబడింది.

vastu directions for pooja

సాధారణంగా పూజలను ఇంట్లో,  ఆలయాలలో, మండపాలు మొదలైన ప్రాంతాలలో చేస్తారు.
ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉండే పూజా గదిలో కూర్చొని పూజ చేసుకోవాలి. ఇంటికి దక్షిణ దిక్కులో కూర్చుని ఎన్నడూ దేవుడిని పూజించరాదు.
ఇంట్లో లేదా కళ్యాణ మండపాలలో చేసుకొనే విశేష కార్యక్రమాలను తూర్పుగా కానీ, ఉత్తరంగా కూర్చొని చేసుకోవడం శుభప్రదం. దేవాలయాలలో, యాగశాలలో, వైదిక క్రతువుల కోసం నిర్మించిన మండపాలలో కూర్చొని చేసే పూజా కార్యక్రములకు దిక్కులతో పనిలేదు. ఆయా సందర్భాన్ని బట్టి దిశను మార్చి కూర్చొని పూజను చేయవచ్చును.

puja directions at yagasala

సేకరణ: https://www.panditforpooja.com/blog/what-are-the-best-vastu-directions-for-pooja-in-different-places/

భోజనం తినేటప్పుడు చేసే తప్పులేమిటి? ఏ పాత్రలో పెట్టుకొని అన్నం తినాలి?
అష్ట సిద్ధులు అంటే ఏమిటి? అష్టసిద్ధులు పొందిన వారి శక్తి ఎలా ఉంటుంది?

Related Posts