హోలీని పండుగ ఎందుకు జరుపుకుంటారు ?

హోలీని పండుగ ఎందుకు జరుపుకుంటారు ?

Loading

హోలీని పండుగ ఎందుకు జరుపుకుంటారు ?

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయులు అత్యంత శ్రద్ధా భక్తులతో జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది హోలీ పండుగ [Holi Festival]. ఈ పండుగ వచ్చిందంటే చాలు బంధువులు, స్నేహితులు అందరూ ఒక చోట చేరి రంగులు పూసుకుంటూ కోలాటాలతో సందడి చేసుకుంటారు. హోలీ మంటలు వేసి కోలాటం ఆడుతూ సాంప్రదాయ నృత్యాలు చూస్తూ భగవంతుని సేవలో మునికి తేలడం తరతరాలుగా వస్తుంది. ఈ పండుగను సాధారణంగా శీతాకాలంలో ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఫల్గుణి మాసంలో జరుపుకుంటారు. హోలీ నాడు కృష్ణ రాధలను కొనియాడుతూ వారి పాటలతో సంబరాలు చేసుకుంటారు. కులమతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఈ హోలీ వేడుకలలో పాల్గొని రంగ పంచమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

హోలీని ఎందుకు జరుపుకుంటారు ?

పురాణాల ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి చావు రాకుండా ఉండేలా వరం పొందుతాడు. తనకి చావు లేదని గర్వంతో దేవతల మీద దండెత్తాడు. మానవులు ఎవరూ ఏ దేవుళ్ళని ఆరాధించేందుకు వీలు లేదని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. కానీ హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుని ఆరాధించాడు. దీంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు కొడుకుని చంపేయాలని నిర్ణయించుకుంటాడు.

హిరణ్యకశిపుడు సోదరి హోలిక ఎప్పుడు మంటల్లో ఉంటుంది. ఆమెకి మంటలు అంటుకోకుండా రక్షణ కవచం ఉంటుంది. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని చితిలో కూర్చోమని హిరణ్యకశిపుడు చెప్తాడు. ఆమె అలాగే చేస్తుంది. కానీ ప్రహ్లాదుడు విష్ణువుని ఆరాధించడం వల్ల ఆ మంటలు అతడిని ఏమి చేయలేకపోతాయి. మంటల్లో హోలికా దహనం అవుతుంది. అందుకు గుర్తుగా హోలికా దహనం నిర్వహిస్తారు. రాక్షస జాతికి చెందిన హోళికా మరణించిన దానికి గుర్తుగా హోలీ జరుపుకుంటారని అంటుంటారు.

కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. తల్లితో కృష్ణుడు తన శరీర వర్ణం, రాధ మేనిఛాయ మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని అంటారు. దీంతో కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.

Gopika, holi, Holika, Prahlada, Ragapanchami, Rang Panchami, Ranga Panchami, sri krishna
హోలీ రోజు నాడు కామదహనం ఎందుకు చేస్తారు
రంగ పంచమి అంటే ఏమిటి దీనిని ఎందుకు జరుపుకుంటారు

Related Posts