సరస్వతీ నది పుష్కరాలు 2025
సరస్వతి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఇవి గురు గ్రహం మిథున రాశిలో ప్రవేశించినప్పుడు ప్రారంభమవుతాయి. సరస్వతి నది హిందూ ధర్మంలో జ్ఞానానికి, విద్యకు, సంగీతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది అంతర్వాహిని (భూమి లోపల ప్రవహించే నది)గా భావించబడుతుంది. పుష్కర కాలంలో సరస్వతి నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు నివృత్తి అవుతాయని, పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం.
సరస్వతీ పుష్కరాల తేదీలు మరియు తిధులు
తేదీ వారము తిథి
మే 15, 2025 గురువారం అష్టమి
మే 16, 2025 శుక్రవారం నవమి
మే 17, 2025 శనివారం దశమి
మే 18, 2025 ఆదివారం ఏకాదశి
మే 19, 2025 మవారం ద్వాదశి
మే 20, 2025 మంగళవారం త్రయోదశి
మే 21, 2025 బుధవారం చతుర్దశి
మే 22, 2025 గురువారం పౌర్ణమి
మే 23, 2025 శుక్రవారం పాడ్యమి
మే 24, 2025 శనివారం విదియ
మే 25, 2025 ఆదివారం తదియ
మే 26, 2025 సోమవారం చవితి
పుష్కరాలు ప్రారంభమైనప్పటి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం, పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది. సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా పురాణాలు, ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది.