ఎంత సంపాదించినా డబ్బు ఖర్చైపోతోందా? వాస్తు టిప్స్ మీకోసం !

Loading

vastu tips for money saving

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

 

ఎంత సంపాదించినా డబ్బు ఖర్చైపోతోందా? అయితే ఈ వాస్తు టిప్స్ మీ కోసమే. సంపాదించిన ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలో ఈ పోస్టులో చూడవచ్చును.

ఇంట్లో ఉంచిన వస్తువులు వాస్తుకు సానుకూలంగా ఆయా దిశలలోను ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర దిక్కుకి అధిపతి కుభేరుడు కాబట్టి ధనాన్ని ఉంచుకొనే బీరువా ఎప్పుడూ ఉత్తరాన్ని(లేకపోతే కుదరకపోతే తూర్పుకి) చూసేలా ఉండాలి. బీరువాను ఈశాన్య మూలలో పెట్టడం వల్ల ఆర్ధిక నష్టం జరుగుతుంది. అలాగే డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ దూలం కింద ఉంచరాదు. తద్వారా ఆర్థిక స్థిరత్వం మీద ఒత్తిడి అధికంగా పడుతుంది.

విలువైన పత్రాలు, నగలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపుగోడకు వీటిని పెట్టడం చాలా మంచిది. అలా కుదరకపోతే తూర్పు లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూలగా ఉంచాలి.

లాకర్లను ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం వల్ల కూడా ధనవ్యయం కాదు. లాకర్లకు ఆగ్నేయ, వాయువ్య దిక్కులు కూడా మంచివి కావు. ఎందుకంటే దీనివల్ల అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈశాన్య మూల కూడా సంపద వృద్ధికి తోడ్పడుతుంది.

ఈశాన్య దిశలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకండి. ఇంటి ఈశాన్య దిశ కేవలం పూజమందిరానికి మాత్రమే. ఇంటికి బయట ఈశాన్య దిశలో గాలి, వెలుతురు ఉండాలే చూసుకోవాలి. ఈశాన్యంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఈశాన్య దిశలో బరువులు ఉంచరాదు. ఈ దిశలో చెత్తాచెదారాన్ని ఉంచకూడదు. సిరిసంపదలకు అనుకూలమైన దిశే ఈశాన్య దిశ.

ఇంట్లో చెత్తచెదారాన్ని, అనవసర వస్తువుల్ని పారేస్తూ ఉండాలి. ఇంటిని ఆలయంలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా(నేరుగా) ఎలాంటి విద్యుత్ వైర్లతో కూడిన స్తంభాలు ఉండకుండా చూసుకోవాలి. ఇంటికి ముందు పారే పిల్లకాలువలు(బోదెలు) ఉండటం వల్ల అవి అపార ధనసంపత్తిని తెచ్చిపెడతాయి.

సేకరణ: https://www.panditforpooja.com/blog/vastu-tips-for-money-saving/

money, vastu
గోత్రము అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడ్డాయి?
రావణుడికి ఆ పేరు ఎలా వచ్చింది?

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.