వైఖానస ఆగమం | వైఖానసులు అంటే ఎవరు?

వైఖానస ఆగమం | వైఖానసులు అంటే ఎవరు?

Loading

వైఖానస ఆగమం:

శ్రీ లక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతాం వన్దే గురు పరంపరామ్ ||

శ్రీమహావిష్ణువుని ప్రప్రథమంగా అర్చన చేసిన మహర్షి విఖనస మహర్షి అందుచే వారి వంసానుగమంగా విఖనసునికి జన్మించిన పుత్ర సంతతిని వైఖానసులు అంటారు. వీరు ఇంద్రునికి అత్యంత ప్రీతిపాత్రులు. నిత్యం శ్రీపతిని పూజించేవారు.

vaikhanasa agama

నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా |
భ్రుగ్వాది మునయః శిష్యా తస్మై శ్రీ విఖనసే నమః ||
ఆనందితాచార్య మనన్య భాజనం  సుత్ర్యైక నిష్టం కరణ త్రాయేణా |
అనారతం శ్రీపతి పాద పద్మయో: నమామి వైఖానస మాది వైష్ణవం ||

శ్రీమద్రామానుజాచార్యుల వారు వైఖానుసుల యొక్క విశిష్టతను కీర్తిస్తూ తెలిపిన శ్లోకం ఇది. ఏ సుత్రమైతే నిందించటానికి శక్యము కానిదో, ఎవరైతే దైవిక, శ్రౌత, శారీరక కర్మలను ఒకే సూత్రము ద్వారా నిత్యమూ శ్రీపతి ఐన శ్రీమహావిష్ణువు యొక్క పాద పద్మములను ఆరాదించినారో వారే వైష్ణవ సంప్రదాయానికి నాంది పలికింది. వారే ఆది వైష్ణవులు.వారే వైఖానసులు.

విష్ణువుని ముఖ్య దైవంగా కొలిచే వైఖానసులు ఇప్పటికీ తమ యొక్క వైఖానస భగవత్ శాస్త్రం అనే ప్రాథమిక గ్రంధం ఆధారంగా తిరుమలలో వేంకటేశ్వరునికి, శ్రీరంగంలో శ్రీరంగనాధునికి మరియు ఇతర ప్రముఖ వైష్ణవ ఆలయాలలో నిత్యపూజలను అందిస్తున్నారు.

వీరు ముఖ్యంగా విష్ణువు యొక్క ఐదు రూపాలను కొలుసారు –

  • విష్ణువు – సర్వాంతార్యామియైన దేవాదిదేవుడు
  • పురుషుడు – జీవితం యొక్క సూత్రము
  • సత్యము – దైవం యొక్క మారని అంశం
  • అచ్యుతుడు – మార్పు చెందని వాడు
  • అనిరుద్ధుడు – ఎన్నటికీ తరగని వాడు

ఏ నఖాః తే వైఖానసాః ఏ వాలాః తే వాలఖిల్యాః‘ అన్న వేదశృతి వాక్యానుసారంగా ఎవరైతే అనఖా: అనగా పాపరహితులో వారే వైఖానసులు. వైఖానసాగమాను సారంగా  జీవన శైలి కలిగియున్న వారిని  ప్రత్యేకంగా వైఖానసులు అంటారు అలా ఎందుకనగా

శ్లోకం : 
యే వైఖానస సూత్రేణ సంస్కృతాస్తు ద్విజాతయః
తే విష్ణు స దృశా జ్ఞేయం సర్వేషాం ఉత్తమోత్తమం |
వైఖానసానాం  సర్వేషాం గర్భ వైష్ణవ జన్మనాం
నారాయణః స్వయం గర్భే ముద్రాం  ధరాయేత్ నిజాం ||

సేకరణ: https://www.panditforpooja.com/blog/what-is-vaikhanasa-agama/

agama shastra, sri maha vishnu, vaikhanasa agama, vaikhanasam
దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు
గోత్రము అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడ్డాయి?

Related Posts