కార్తీక పౌర్ణమి విశిష్టత | కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన పనులు

  1. Home
  2. chevron_right
  3. Devotional Facts
  4. chevron_right
  5. కార్తీక పౌర్ణమి విశిష్టత | కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన పనులు

కార్తీక పౌర్ణమి విశిష్టత | కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన పనులు

కార్తీక మాసము శుక్ల పక్షములో వచ్చే పౌర్ణమిని కార్తీకపౌర్ణమి అంటారు. ఈ రోజును అతి పవిత్రమైన రోజు గా భావిస్తారు. మహాశివరాత్రి తో సమానమైన ఈ రోజుని త్రిపురపౌర్ణమి అని కూడా అంటారు.దేవతలు కార్తిక పౌర్ణిమ నాడు జరుపుకొనే దీపావళి పండుగ కనుక దీనిని దేవదీపావళి అని కూడా పిలుస్తారు.

What to do on Kartik Poornima

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజే ఈ కార్తీకపౌర్ణమి.

కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది. ఈ రోజు ఎవరైతే పరమశివుని వద్ద నేతి దీపములను వెలిగిస్తారో వారు తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి.

ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్న వారికి సకల సంపదలు దరిచేరుతాయి. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది.
శివఅష్టోత్తరము, లింగాష్టకం వంటి పారాయణ, అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభములు చేకురును.

పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యప్పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు. కార్తీకమాసంలో దీపదానం చేస్తే ఫుణ్యమని, సాలగ్రామ దానములు సర్వే సర్వత్రా శుభదాయకము అని పురాణములలో పేర్కొనబడినది.

విశేషంగా దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు చేసే ఏ దానం వలన అయినా జన్మాంతర పాపాలు తొలగిపోతాయి.

, ,
నాగుల చవితి రోజున చేయవలసిన పనులేమిటి?
Karthika Masam | Story & Significance of Kartika Purnima

Related Posts